‘7జి బృందావన్ కాలనీ’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో హీరోయిన్గా నటించిన సోనీ అగర్వాల్ ఇప్పటికీ ప్రేక్షకులకు హాట్ ఫేవరెట్‌గానే ఉంది. తాజాగా ఆమె డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘డిటెక్టివ్ సత్యభామ’. సిన్మా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నవనీత్ చారి దర్శకత్వంలో శ్రీశైలం పోలెమోని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్, పోస్టర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఫిలించాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణగౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … ట్రైలర్ చూస్తుంటే ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాల ఘటనలను బేస్‌గా తీసుకుని ఈ సినిమా చేసినట్లు ఉంది. వాస్తవాలతో కూడిన కథలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. సోనీ అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్ని ప్రధాన పాత్రకు ఎంచుకోవటంలోనే సగం సక్సెస్ సాధించారు. సినిమా ఇండస్ట్రీ ఒక సముద్రం. ఎంత కొత్త టాలెంట్ వచ్చినా తనలో కలుపుకుంటుంది. నిర్మాత శ్రీశైలం గారు మా టీఎఫ్‌సీసీ మెంబర్. దర్శకుడు నవనీత్ చారి కూడా మల్టీటాలెంటెడ్. సిరాజ్ గారి ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుండటం నిర్మాతకు బాగా హెల్ప్ అవుతుంది అన్నారు. ‘ బిచ్చగాడు’ సహా పలు విజయవంతమైన చిత్రాలకు మాటల రచయితగా పనిచేసిన భాషాశ్రీ మాట్లాడుతూ .. దర్శకుడు నాకు చాలా కాలంగా మిత్రుడు దాదాపు 400 సినిమాలకు వివిధ డిపార్ట్మెంట్స్లో పనిచేశాడు. ఆ అనుభవంతో మెగాఫోన్ పట్టుకున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. తప్పకుండా విజయం సాధిస్తుంది అన్నారు. టీఎఫ్‌సీసీ డైరెక్టర్స్ వింగ్ జాయింట్ సెక్రటరీ సిరాజ్ మాట్లాడుతూ.. సంగీత దర్శకుడే దర్శకుడు అయితే సినిమా ఏ లెవల్లో ఉంటుందో నవనీత్ చారి గారు నిరూపించారు. డిటెక్టివ్ సబ్జెక్ట్‌లకు మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. నా శక్తి మేరకు థియేటర్స్ ఇప్పించే ఏర్పాటు చేస్తా. ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా అన్నారు. చిత్ర నిర్మాత శ్రీశైలం పోలెమోని మాట్లాడుతూ .. ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ అన్న బేధం లేకుండా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసి పోయాం. ఒక ఇంట్లో శుభకార్యాన్ని అందరూ కలిసి ఎలా విజయవంతం చేస్తారో.. మేమందరం అలాగే ఈ సినిమాని విజయవంతంగా పూర్తి చేశాం. ఈ విషయంలో మా కెమెరామెన్ లక్కీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. దర్శకుడు నవనీత్ చారి గారు తక్కువ టైంలో అనుకున్న బడ్జెట్లో క్వాలిటీ సినిమా చేశారు. ఆయన వందల సినిమాలకు అనేక రంగాల్లో పనిచేయడం వల్లనే ఇది సాధ్యం అయింది. మా సినిమాను ఆశీర్వదించటానికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. త్వరలోనే విడుదలకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తాం అన్నారు. దర్శకుడు నవనీత్ చారి మాట్లాడుతూ .. మంచి టెక్నీషియన్స్ టీంతో పనిచేశాం. సోనియా అగర్వాల్ గారు మా స్క్రిప్ట్ విన్న వెంటనే ఓకే చేయటం చాలా సంతోషం. ఒక స్టార్ హీరోయిన్ ఈ కథను సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేయటాన్ని బట్టి ఈ కథలో ఉన్న విషయం అర్ధం చేసుకోవచ్చు. నిర్మాత గారు ఎప్పుడూ టెన్షన్ పడలేదు. కొత్తవారైనా అనుభవం ఉన్న నిర్మాతలా ప్లాన్ చేసి షూటింగ్ సమయానికి అన్నీ అరేంజ్ చేశారు. ఇలాంటి ప్యాషన్ ఉన్న నిర్మాతలు పరిశ్రమకు చాలా అవసరం. సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీఎఫ్‌సీసీ వైస్ ప్రెసిడెంట్‌ల్లో ఒకరైన నెహ్రూ, టీఎఫ్‌సీసీ ‘మా’ జనరల్ సెక్రటరీ కిషోర్ తేజ, హీరో రోషన్ బాబు, హీరో ఫిరోజ్‌ఖాన్, హీరో రెహాన్, తారాసింగ్, కెమెరామెన్ లక్కీ, సౌత్ 9 ఎండీ చక్రవర్తి మానపాటి, డైలాగ్ రైటర్ సంతోష్, కో డైరెక్టర్ హబీబ్, అపర్ణ కౌశిక్ తదితర చిత్ర యూనిట్ మెంబర్స్ ప్రసంగిస్తూ సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు. నటీ నటులు : సోనియా అగర్వాల్, సాయి పంపన, రవివర్మ, సునీత పాండే, రోబో గణేష్, సోనాక్షివర్మ, సంజన, పూజ, బాలు, రెహాన్, భరత్ తదితరులు. సాంకేతిక నిపుణులు : బ్యానర్ : సిన్మా ఎంటర్టైన్మెంట్ నిర్మాత : శ్రీశైలం పోలె మోని సంగీతం`దర్శకత్వం: నవనీత్ చారి డీఓపీ`ఎడిటర్: లక్కీ ఏకరి డైలాగ్ : సంతోష్ ఇజ్ఞాని పి.ఆర్.ఓ : ఆర్.కె. చౌదరి
Related posts
-
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ... -
చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది.. “ఒక పథకం ప్రకారం” దర్శక, నిర్మాత వినోద్ కుమార్ విజయన్
Spread the love సంచలన దర్శకుడు పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ “ఒక... -
Oka Pathakam Prakaaram will Maintain Suspense Till The End: Director Vinod Kumar Vijayan
Spread the love Sai Ram Shankar, the younger brother of sensational director Puri Jagannadh, is starring in...