ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్న స్టోరీల్ని ఎంచుకుంటూ వరుసగా సూపర్ హిట్స్ కొడుతున్నారు డైనమిక్ హీరో నిఖిల్. ఈ పంధాలో అర్జున్ సురవరం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత నిఖిల్ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా 18 పేజీస్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో 100 % లవ్, భలే భలే మగాడివోయ్, పిల్లా నువ్వు లేని జీవితం, గీతగోవిందం, ప్రతి రోజు పండగే వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తో సక్సెస్ ఫుల్ నిర్మాతగా అందరి మన్ననలు పొందున్న బన్నీ వాసు నిర్మాణ సారధ్యంలో 18 పేజీస్ చిత్ర తెరకెక్కుతుంది. ఈ సినిమా నిర్మాణంలో బన్నీ వాసుతో పాటు భాగస్వామిగా వ్యవహరిడంతో పాటు కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు స్టార్ డైరెక్టర్ సుకుమార్. ఇక సక్సెస్ ఫుల్ సినిమాలతో సినీ అభిమానుల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా మల్లూబ్యూటీ అనపమ పరమేశ్వరన్ ఎంపకైంది. నిఖిల్, అనుపమ జోడి, అలానే వారి ఇద్దరి మధ్య సన్నివేశాలు ఆద్యంతం ఆభిమానుల్ని ఆకట్టుకునే రీతిన రెడీ చేస్తున్నట్లుగా దర్శకుడు సూర్య ప్రతాప్ తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొదలైంది, హైదరబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ ని చిత్రీకరిస్తున్నట్లుగా నిర్మాత బన్నీవాసు చెప్పారు.
ఉత్కంఠ రేపుతున్న 18 పేజీస్ టైటిల్
స్టార్ డైరెక్టర్ సుకుమార్ రాసిన స్టోరీ అంటేనే ఏదొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుందనే అంచనాలు అభిమానుల్లో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు 18 పేజీస్ అనే టైటిల్ ఎనౌన్స్ మెంట్ బయటకు వచ్చినప్పటి నుంచి అటు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇటు ప్రేక్షకులు నుంచి అనూహ్య స్పందన లభించింది.
కుదిరిన క్రేజీ కాంబినేషన్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గార, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీవాసు, స్టార్ డైరెక్టర్ సుకుమార్, డైనమిక్ హీరో నిఖిల్, పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్ స్కిల్స్ వెరసి 18 పేజీస్ కు హిట్ కాంబినేషన్ అద్భుతంగా కుదిరింది. ఇప్పుడు ఈ సక్సెస్ ఫుల్ టీమ్ లోకి హ్యాపెనింగ్ హీరోయిన్ మల్లూ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా వచ్చి చేరడంతో 18 పేజీస్ పై భారీగా అంచనాలు పెరగుతున్నాయి.
నటీనటులు
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ తదితరులు
సాంకేతిక వర్గం
సమర్పణ – అల్లు అరవింద్
బ్యానర్ – జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్
కథ, స్క్రీన్ ప్లే – సుకుమార్
మ్యూజిక్ – గోపీ సుందర్
లైన్ ప్రొడ్యూసర్ – బాబు
పీఆర్ఓ – ఏలూరు శ్రీను
సినిమాటోగ్రాఫర్ – వసంత్
రైటర్ – శ్రీకాంత్ విస్సా
ఆర్ట్ డైరెక్టర్ – రమణ వంకా
ఎగ్జీక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – శరణ్ రాపార్తి(జీఏ2 పిక్చర్స్), అశోక్ బి (సుకుమార్ రైటింగ్స్)
కో డైరెక్టర్ – రాధా గోపాల్
ప్రొడక్షన్ కంట్రోలర్ – వై వీరబాబు
నిర్మాత – బన్నీ వాసు
దర్శకత్వం – పల్నాటి సూర్య ప్రతాప్