- భాస్కర్ సార్ అంటే…
- ఆ రోజుల్లో గజ్వేల్ లో హడల్. ఆయన విధించే రకరకాల శిక్షలు యాది చేసుకుంటే పోలీసుల థర్డ్ డిగ్రీ గుర్తుకువచ్చేది. దాదాపు
- నాలుగు దశాబ్దాలు వెనక్కి వెళ్తే… గజ్వేల్ హైస్కూల్ లో మాకు లెక్కలు బోధించిన భాస్కర్ సార్ పేరు వింటేనే చెమటలు పుట్టేవి.
- ఆయన చాలా స్ట్రిక్ట్… ఆ సబ్జెక్టులో మేమేమో వీక్…
- ఇంకేముంది మా క్లాసులో ఆయన లాఠీ దెబ్బలు తినని విద్యార్థి అంటూ ఉండడు. ఆయన గట్టిగా కేక వేస్తే చడ్డీలు తడిసేవి. శిక్షలను పక్కన బెడితే, లెక్కల సబ్జెక్టులో శ్రద్ధగా ఆయన వద్ద తర్ఫీదు పొందిన ఎందరో విద్యార్థులు ఉన్నత స్థాయిల్లో ఎదిగ గలిగారు. విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంపొందించడంలో ఆయన చేసిన కృషి అభినందనీయం.
- ఒక్కమాటలో చెప్పాలంటే అంకితాభావంతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించిన గురువు. ఆయనను అభిమానించే శిష్యుల జాబితాలో నేను కూడా. అయితే దాదాపు 30 ఏండ్ల సుదీర్ఘ కాలం తర్వాతా ఇవ్వాళ షామిర్ పేటలో జరిగిన ఆయన మనమరాలి వివాహా కార్యంలో భాస్కర్ సార్ ను కలుసుకునే అవకాశం నాకు దక్కింది. సుమారు 88ఏండ్ల వయస్సు కలిగి ఉన్న ఆయన నన్ను చూసి ఎంతో మురిసిపోయారు. మా ఇద్దరి కలవడిలో ఆనాటి పలు స్మృతులను గుర్తుచేసుకొని కడుపుబ్బా నవ్వుకున్నాం.