కథలేని ‘కామ్రేడ్ కళ్యాణ్’

'Comrade Kalyan' – A Story Without a Story
'Comrade Kalyan' – A Story Without a Story
Spread the love

By మారుపాక గోవర్ధన్ రెడ్డి

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన వినోదంతో ఎప్పటికప్పుడు వినూత్నమైన కథలతో ప్రేక్షకులను అలరించే హీరో శ్రీవిష్ణు. ఆయన నటించిన తాజా చిత్రమే ‘కామ్రేడ్ కళ్యాణ్’. విక్టరీ వెంకటేష్ నటించిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా వాయిదా పడడంతో ఈ వారానికి ‘కామ్రేడ్ కళ్యాణ్’ పెద్ద సినిమా అయిపోయింది. కోన వెంకట్ సమర్పణలో నూతన నిర్మాత నిర్మించిన ఈ సినిమాతో జానకిరామ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. కోన వెంకట్ సమర్పణలో వెంటక కృష్ణ కర్నాటి-సీతా కర్నాటి సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. భాను, నందు రచయితలుగా జానకిరామ్ మారెళ్ల తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రీవిష్ణుకు జోడీగా మహిమా నంబియార్ నటించగా, రాధికా శరత్ కుమార్, షైన్ టాం చాకో, ఉపేంద్ర లిమాయే ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 9, 2026న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. మరి ఈ సినిమా కథ ఏంటి? ఎలా ఉంది? టైటిల్‌తోటే ప్రేక్షకుల ఆసక్తిని చూరగొన్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది? ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఎంగేజ్ చేసిన ఈ సినిమా ఎలా ఉంది? అనేది చూద్దాం..
కథ : నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉన్న అడవి ప్రాంతానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్‌గా వచ్చిన జార్జ్ కుట్టి (షైన్ టామ్ చాకో)పై ఓ దళం దాడి చేస్తుంది. ఆ ప్రాంతంలోనే కల్యాణ్ (శ్రీ విష్ణు) సినిమా థియేటర్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తుంటాడు. ఒడిశా అమ్మాయి సితారను తొలిచూపులోనే కల్యాణ్ ప్రేమలో పడుతాడు. సితారను పెళ్లి చేసుకొంటానని బ్లాక్ మెయిల్ చేస్తూ బిష్వాస్ (ఉపేంద్ర లిమాయే) అనే వడ్డీ వ్యాపారి వెంటాపడుతుంటాడు. అయితే సితార పరిస్థితి చూసి కల్యాణ్ అండగా నిలుస్తాడు. సత్తిబాబు (సత్య) టీమ్ చేసే స్కీం కారణంగా అడవిలో అన్నగా కల్యాణ్ కామ్రేడ్ అవుతాడు. పోలీస్ ఆఫీసర్ జార్జ్ కుట్టిపై నక్సల్స్ దళం దాడి చేసిన తర్వాత ఏం జరిగింది? సితారతో ఎందుకు ప్రేమలో పడ్డాడు? ఆమెతో కల్యాణ్ లవ్ ట్రాక్ ఎలా సాగింది? సత్తిబాబు, పళ్లం రాజు (ప్రభాస్ శ్రీను), ఎస్సై అప్పలనాయుడు (బ్రహ్మాజీ) బృందం చేసే వ్యవహారాలు ఏంటి? సితారను బిష్వాస్ ఎందుకోసం బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు? సితారకు వచ్చిన సమస్య ఏమిటి? సితార కోసం కల్యాణ్ చేసిన రిస్క్ ఏమిటి? బిష్వాస్ నుంచి సితారను ఎలా కాపాడాలనుకొంటాడు? కల్యాణ్ తల్లి సరస్వతమ్మ (రాధిక శరత్ కుమార్) చేసే హంగామా ఏంటి? శంకరన్న (శత్రు), మాస్టర్ (సాయిచంద్) ఎవరు? కల్యాణ్ ఎందుకు నక్సలైట్‌గా మారాడు. సితారను కల్యాణ్ పెళ్లి చేసుకొన్నాడా? లేదా? అస‌లు అడ‌విలోని అన్న‌ల‌కీ, కళ్యాణ్‌కీ సంబంధం ఏమిటి?  త‌న ప్రేయ‌సి సితార కుటుంబాన్ని క‌ష్టాల నుంచి గట్టెక్కించాడా? సితార కుటుంబం క‌ష్టాల్లో కూరుకుపోవ‌డానికి కార‌ణ‌మేమిటి? అన్న‌ల‌కీ, పోలీసుల‌కీ మ‌ధ్య యుద్ధం ఎప్పుడు ఎలా ఆగింది? అనే ప్రశ్నలకు సమాధానమే ‘కామ్రేడ్ కల్యాణ్’ సినిమా కథ.
విశ్లేషణ : శ్రీవిష్ణు సినిమా అంటే ప్రేక్షకుల్లో సహజంగానే కామెడీపై అంచనాలు ఉంటాయి. ఆయన టైమింగ్‌, విభిన్నమైన కథల ఎంపిక గతంలో ఎన్నోసార్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాంటి అంచనాలతో వచ్చిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ మాత్రం వాటిని అందుకోవడంలో కొంచెం తడబడింది. నక్సల్స్ ఉద్యమం, ప్రేమకథ, గ్రామీణ నేపథ్యం, రాజకీయ పరిస్థితులు.. ఇలా సినిమాలో బలమైన కథకు అవసరమైన అంశాలు చాలానే ఉన్నాయి. కానీ వాటన్నింటినీ కలిపి ఆసక్తికరమైన కథనంగా మలచడంలో రచయితలు విఫలమయ్యారు. ఒక సన్నివేశానికి మరో సన్నివేశానికి మధ్య సరైన అనుసంధానం కనిపించదు. కథ ఎటు వెళ్తుందో ప్రేక్షకుడికి ముందే అర్థమైపోతుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని కలిగించే మలుపులు కూడా పెద్దగా ఉండవు. సీరియస్‌ నేపథ్యాన్ని ఎంచుకున్నప్పుడు దానికి తగిన భావోద్వేగాలు, సంఘర్షణలు ఉండాలి. కానీ ఈ సినిమాలో కీలకమైన సందర్భాలను కూడా సాధారణ సన్నివేశాల్లా మార్చేశారు. దీంతో కథలోని ప్రధాన అంశానికి సరైన ప్రాధాన్యం దక్కలేదు. కామెడీ కూడా పూర్తిగా వర్కవుట్ కాలేదు. ‘మాభూమి’ మొద‌లుకొని ‘విరాట‌ప‌ర్వం’ వ‌ర‌కూ…  పోరుబాటన సాగిన చాలావ‌ర‌కు తెలుగు సినిమాలు గాఢ‌మైన సంఘ‌ర్ష‌ణ‌ని, డ్రామానే ఆవిష్క‌రించాయి. అటు తిరుగుబాటు చేస్తున్న ద‌ళాల సిద్ధాంతాల్ని, ఇటు ప్ర‌భుత్వాల కోణాన్ని, ఆ రెండింటి మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌నీ ప్ర‌స్తావిస్తూ చ‌ర్చ‌ని లేవ‌నెత్తిన చిత్రాలే ఎక్కువ‌! అయితే, ఇది వాట‌న్నిటికీ భిన్న‌మైన సినిమా. పేరుకే కామ్రేడ్ క‌ళ్యాణ్ కానీ, ఆద్యంతం కామెడీ క‌ళ్యాణ్ క‌నిపిస్తుంటాడు. న‌క్స‌లిజం నేప‌థ్యాన్ని ఎంచుకున్నా… న‌వ్వించ‌డ‌మే ల‌క్ష్యంగా  రూపొందిన సినిమా. చాలా వ‌ర‌కు స‌న్నివేశాలు ఆ ల‌క్ష్యాన్ని చేరుకున్నాయి. మెద‌డుకు ఏమాత్రం ప‌ని చెప్ప‌కుండా… లాజిక్ గురించి ఆలోచించ‌కుండా చూస్తే  న‌వ్వుల‌కు కొదవ ఉండదు. ఆర్‌.నారాయ‌ణ‌మూర్తిని, ఆయ‌న సినిమాల్ని గుర్తు చేసే ‘ఎత్త‌రా ఎత్తు…’  పాట త‌ర్వాత నుంచి ఈ సినిమా ఎంచుకున్న దారి ఏమిటో స్ప‌ష్టంగా అర్థం అవుతుంది. ఓ సీరియస్ సబ్జెక్ట్‌ని ఎంత సిల్లీగా, కామెడీగా చెప్పాలో.. అంత సిల్లీగా, కామెడీగానూ చెప్పారు. తీసుకున్నది 90వ దశకం అయినా మాటలు, చేష్టలు అన్నీ కూడా ఈ జెన్ జీ బ్యాచ్‌కి తగ్గట్టుగా అనిపిస్తాయి. 90స్ బ్యాక్ డ్రాప్ అని చెప్పడం తప్పా.. మాటలు, కదలికలు, ఆ వాతావరణం ఎక్కడా కూడా కనిపించదు. చాలా వరకు డైలాగ్స్‌లో ద్వంద్వార్థాలు కనిపిస్తుంటాయి. పేరుకే 90వ దశకం కానీ.. ఈ కథ ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటుంది. నక్సలిజం, పోలీస్ వ్యవస్థ మధ్య ఎప్పుడూ ఓ సన్నని గీత ఉంటుంది. సినిమాల్లో ఎవరిది ఒప్పు? ఎవరిది తప్పు అని చెప్పలేం. చాలా సినిమాల్లో అన్నల్ని హీరోలుగా చూపించారు.. ఎన్నో సినిమాల్లో పోలీసుల్ని హీరోలుగా చూపించారు. అయితే ఈ కామ్రేడ్ కళ్యాణ్ సినిమాని మాత్రం పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించారు. ఆ కామెడీ ట్రాక్‌లో ఎమోషన్ నలిగిపోయినట్టు అనిపిస్తుంది. చివరకు మనం అన్నల సైడ్ గానీ, పోలీసుల సైడ్ గానీ ఆలోచించం. అసలు ఇందులో అలా ఆలోచించడానికి అంత ఆస్కారం కూడా ఇవ్వలేదు. మొత్తం శ్రీ విష్ణు, సత్య కామెడీతోనే లాగించేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా శ్రీ విష్ణు, సత్య, సుదర్శన్ డామినేషన్ కనిపిస్తుంది. సెకండాఫ్ అయినా ఎమోషనల్‌గా, కాస్త హార్ట్ టచింగ్‌గా ఉంటుందని అనుకుంటే.. అక్కడా మళ్లీ అదే సిల్లీ, లాజిక్ లెస్ కామెడీనే పెట్టారు. ఇక క్లైమాక్స్‌కి అటు వాళ్లు, ఇటు వీళ్లు అందరూ మంచివారు అయిపోతారు. హీరో ఇచ్చే స్పీచ్‌తో అందరూ మారిపోవడం మన తెలుగు సినిమాల్లో కామన్ అన్న సంగతి తెలిసిందే. న‌క్స‌లైట్ ద‌ళాలు, పోలీసులు, ఏరివేత… ఇలాంటి మాట‌లు విన‌గానే ఇదేదో సీరియ‌స్ అంశాల్ని స్పృశిస్తున్న  క‌థలా ఉంద‌న్న అభిప్రాయానికి వ‌చ్చేస్తుంటాం. ఆ నేప‌థ్యం అలాంటిది మ‌రీ! బాలకృష్ణ అభిమానిగా రాధిక శ‌ర‌త్‌కుమార్ చేసే సంద‌డి, ఆమె కోసం హీరో పోలీసు స్టేష‌న్ చుట్టూ తిర‌గ‌డం, ఆ త‌ర్వాత హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డ‌టం, ఆమెకి త‌న ప్రేమ విష‌యాన్ని చెప్ప‌డం కోసం ప‌డే పాట్ల‌తో సినిమా స‌ర‌దాగానే సాగినట్టు అనిపించినా, న‌వ్వుల మోతాదు మాత్రం అంతంత మాత్రంగానే అనిపిస్తుంది. దుబాయ్ బాబుగా స‌త్య పాత్ర ప‌రిచ‌యంతోనే ఆ మోతాదు పెరుగుతుంది. హీరో కోసం ఆంగ్లంలో స‌త్య రాసే ప్రేమ‌లేఖ ఎపిసోడ్ నుంచి సినిమా మ‌రింత సంద‌డిగా మారుతుంది. బిశ్వాస్ పాత్రలో ఉపంద్ర లిమాయే ప‌రిచ‌యంతో ఆ నవ్వులు అలా కొన‌సాగుతుంటాయి. విరామానికి ముందు సాగే స‌న్నివేశాలు సినిమాకి కీల‌కం. అక్క‌డ అనూహ్యంగా చోటు చేసుకునే ఓ మ‌లుపు సినిమాని మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార్చేస్తుంది. విరామం త‌ర్వాత క‌థ అడ‌వికి మార‌డంతో, ఇక‌పై వ్య‌వ‌హారం సీరియ‌స్‌గా మారుతుందేమో అనుకుంటాం. కానీ, అడ‌విలో అన్న‌లు, తుపాకులు, షూట్ అవుట్‌లు చూపిస్తూ వాటన్నిటి మ‌ధ్య కూడా హాస్యం పండేలా ర‌చ‌న సాగింది. అయితే ఆ క్ర‌మంలో క‌థ ఏమాత్రం లాజిక్ లేకుండా సాగుతున్న‌ట్టుగా అనిపించినా, ఆ దిశ‌గా ఎక్కువ‌గా ఆలోచించే స‌మ‌యం ఇవ్వ‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు న‌వ్వులు పండ‌ట‌మే ఈ సినిమాకి క‌లిసొచ్చే విష‌యం. ప్ర‌థ‌మార్ధంలో ప్రేమ‌లేఖ స‌న్నివేశానికి దీటుగా  ద్వితీయార్ధంలో వెన్నెల కిశోర్ – శ్రీకాంత్ అయ్యంగార్ కలిసి సంద‌డి చేస్తారు. 90ల నేప‌థ్యంలో సాగే క‌థే అయినా… ఆచార్య ద‌ళం, ప్యార‌డైజ్ కాకి అంటూ వ‌ర్త‌మాన అంశాల‌తో ముడిప‌డిన ఎన్నో విష‌యాల్ని సంభాష‌ణ‌ల్లోకి తీసుకొచ్చి హాస్యం పుట్టించే ప్ర‌య‌త్నం చేశారు ర‌చ‌యిత‌లు. తార‌ల రిఫ‌రెన్సులు కూడా చాలానే ఉన్నాయి. అవ‌న్నీ థియేట‌ర్ల‌లో కావాల్సినంత సంద‌డి చేయిస్తాయి. ఒక నాట‌కీయమైన మ‌లుపుతోనూ, ఓ సందేశంతోనూ సినిమాని ముగించారు. ప‌తాక స‌న్నివేశాలు పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌వు. కొన్ని సినిమాలు  సీరియ‌స్ నేప‌థ్యాల్ని కూడా బ్లాక్ కామెడీ, సటైరికల్‌ కామెడీతో ఆవిష్క‌రిస్తూ ఆలోచ‌న‌ని రేకెత్తిస్తుంటాయి.  అప్పుడ‌ప్పుడూ ఆ ఛాయ‌లు ఇందులోనూ క‌నిపిస్తుంటాయి. ‘కామ్రేడ్ కళ్యాణ్’ టైటిల్ చూడగానే ఇదేదో సీరియస్ కంటెంట్ లా ఉంటుందా అని చాలా మంది అనుకోవచ్చు కానీ ఇందులో అందుకు భిన్నంగా ఫన్ ట్రీట్ దొరుకుతుంది. దర్శకుడు దీనిని ఆద్యంతం వినోదభరితంగా మంచి ఫన్ మూమెంట్స్ తో డిజైన్ చేశారు. తెలుగు తెరపై నక్సలిజం నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చినా, ఈ చిత్రంలో ఆ అంశాన్ని పూర్తిస్థాయి కామెడీ కోణంలో నడిపించిన తీరు ఇంప్రెస్ చేస్తుంది. ఇక హీరోయిన్ ఎంట్రీతో కథనం ఊపందుకుంటుంది. కమెడియన్ సత్య పాత్ర వచ్చాక కామెడీ డోస్ మరింత పెరుగుతుంది. శ్రీవిష్ణు మరోసారి తన మార్క్ టైమింగ్‌తో అలరించారు. కేవలం నవ్వించడానికే పరిమితం కాకుండా పాత్రలోని భావోద్వేగాలను పరిణతితో పండించాడు. శ్రీవిష్ణు, సత్య కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. మహిమా నంబియార్ తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకోగా.. సుదర్శన్, రాధిక, ఉపేంద్ర లిమాయే, షైన్ టామ్ చాకో తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమా స్టార్ట్ మాత్రం స్లోగా మొదలైంది అని చెప్పాలి. హీరో ఎంట్రీ ఇచ్చేవరకు కథనంలో మూమెంట్స్ స్లోగా కొంచెం డల్ అనిపిస్తాయి. ఆ తర్వాత పికప్ అయ్యాయి. అప్పుడు వరకు కథనం అంత ఇంట్రెస్టింగ్ గా కనిపించదు. వీటితో పాటు పాత్రల పరిచయం కూడా అంత బలంగా కుదరలేదు అనిపిస్తుంది. అంతే కాకుండా ఆరంభంలో వచ్చే కొన్ని జోకులు ఆశించిన స్థాయిలో పేలకపోగా, అక్కడక్కడా డబ్బింగ్ సమస్యలు స్పష్టంగా కనిపిస్తాయి. సెకండాఫ్ లో కథనం ఫ్లో కాస్త మందగిస్తుంది. కీలక సమయంలో వచ్చే హీరో ఎలివేషన్ సాంగ్ మరింత ఇంపాక్ట్ కలిగించేలా ఉండాల్సింది. క్లైమాక్స్ సన్నివేశాలు కూడా అంతగా కన్విన్స్ చేయలేకపోయాయి. దర్శకులు జానకిరామ్ మారెళ్ల, రచయితలు భాను భోగవరం, నందు సావిరిగన టీమ్ రాసుకొన్న కథ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవించి వండిన ఫన్ కిచిడి. ప్రేక్షకుడిని ఆలోచింప చేసే విధంగా కాకుండా సరదాగా రెండున్నర గంటలపాటు ఎంటర్‌టైన్‌మెంట్ పంచడానికి చాలా కన్వినియెంట్ స్క్రీన్ ప్లే‌తో తమకు అనుకూలంగా కథను, సన్నివేశాలను పేర్చుకొన్న చిత్రంగా చెప్పవచ్చు. శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్, కమెడియన్ సత్య, సుదర్శన్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని రాసిన కొన్ని సన్నివేశాలు వర్కవుట్ అయ్యాయి. కొన్ని సీన్లు సిల్లీగా అనిపిస్తాయి. బాలకృష్ణ అభిమానిగా రాధిక శరత్ కుమార్ క్యారెక్టర్ కొత్తగా అనిపిస్తుంది. ఓవరాల్‌గా చిన్న లవ్ స్టోరి, ఇంటర్వెల్ టిస్ట్, నక్సలైట్ల ఎపిసోడ్, ఎమోషనల్ క్లైమాక్స్‌ను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన చిత్రంగా చెప్పుకోవచ్చు. చివర్లో చిన్న సందేశంతో ఈ సినిమా సీరియస్ సినిమా కాదు.. వినోదాత్మక చిత్రమని చెప్పే ప్రయత్నం చేశారు. ఓ సాధారణ ఐడియాను శ్రీవిష్ణు శైలి వినోదంతో మేళవించి తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ సరదా సన్నివేశాలు, పంచ్‌లతో సాఫీగా సాగిపోయినప్పటికీ, సెకండ్ హాఫ్ లో అదే స్థాయి వినోదం, పట్టు లోపించాయి. కథా బలం కంటే హీరో టైమింగ్ మీదే ఎక్కువ ఆధారపడ్డ సినిమా ఇది. సాధారణంగా నక్సలిజం, అడవి, తుపాకుల మోత అనగానే హెవీ ఎమోషన్స్, సీరియస్ ఐడియాలజీ డ్రామా అనుకుంటాం. కానీ ఈ సినిమా ఆ మూస పద్ధతిని పూర్తిగా పక్కన పెట్టేసి, ఆ ఇంటెన్స్ సెటప్‌ను ఓ క్రేజీ ‘సిట్యువేషనల్ కామెడీ’గా మార్చేసింది. స్టార్టింగ్‌లో కథ కాస్త క్యాజువల్ నోట్‌తో మొదలైనప్పటికీ, అసలైన కామెడీ గ్యాంగ్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చాక మీటర్ పూర్తిగా మారిపోతుంది. ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ కథకు మంచి బజ్ క్రియేట్ చేయగా, సెకండాఫ్‌లో స్క్రిప్ట్ నేరుగా అడవిలోకి షిఫ్ట్ అవుతుంది. అయితే అక్కడ కూడా కథ సీరియస్ ట్రాక్‌లోకి వెళ్లకుండా, అన్నలు-ఎన్‌కౌంటర్ల సెటప్‌లోనే స్పూఫ్, బ్లాక్ కామెడీ వైబ్స్‌తో సీన్లను పేల్చేశారు. లాజిక్కుల కంటే ఆడియన్స్‌ని వైబ్ చేయడమే టార్గెట్‌గా రచన ఉంది. కథ 90ల టైమ్‌లైన్‌లో నడిచినా, ఇప్పటి మీమ్ కల్చర్, పాప్ కల్చర్ రిఫరెన్స్‌లు, స్టార్ హీరోల ట్రెండింగ్ పంచ్‌లతో రాసిన వన్-లైనర్స్ బీ-సీ సెంటర్ల థియేటర్లలో అదిరిపోయే క్రౌడ్ పుల్లింగ్ మూమెంట్స్‌ని ఇస్తాయి. క్లైమాక్స్‌లో రొటీన్ మెసేజ్, డ్రామా కాస్త డల్ చేసినా… లాజిక్‌లతో పనేం లేదు, కాసేపు హాయిగా నవ్వుకుని రిలాక్స్ అవ్వాలనుకునే వాళ్లకు ఈ సినిమా ఒక పక్కా టైమ్‌పాస్ ఆప్షన్. శ్రీవిష్ణు బలం కామెడీ టైమింగ్‌… ఆయనతో పాటు సత్య, సుదర్శన్‌ వంటి నటులు ఉన్నప్పుడు వినోదానికి కొదవ ఉండదని ప్రేక్షకులు భావిస్తారు. కానీ ఈ సినిమాలో కామెడీ సన్నివేశాలు ఆశించిన స్థాయిలో పేలలేదు. కొన్ని చోట్ల నవ్వించాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే సరైన సందర్భం లేకపోవడం, సన్నివేశాల్లో సహజత్వం లోపించడం వల్ల ఆ ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. కొన్ని సంభాషణలు, హాస్య సన్నివేశాలు కథను ముందుకు తీసుకెళ్లడానికి బదులుగా సాగదీసిన భావన కలిగిస్తాయి. సీరియస్‌గా సాగాల్సిన సన్నివేశాల్లోనూ వినోదాన్ని చొప్పించడంతో కథలోని తీవ్రత తగ్గిపోయింది. మరోవైపు పూర్తిస్థాయి కామెడీని కూడా అందించలేకపోయారు. ఫలితంగా సినిమా ఏ తరహా ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుందో స్పష్టత లేని పరిస్థితి ఏర్పడింది. సినిమా ప్రారంభంలో పాత్రల పరిచయం, గ్రామీణ వాతావరణం, హీరో వ్యక్తిత్వాన్ని చూపించే సన్నివేశాలతో కథ మొదలవుతుంది. అయితే ప్రారంభం నుంచే కథలో వేగం కనిపించదు. ప్రధాన కథలోకి వెళ్లడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, మధ్యమధ్యలో వచ్చే హాస్య సన్నివేశాలు ఆశించిన ప్రభావాన్ని చూపకపోవడం వల్ల ఫస్టాఫ్ నెమ్మదిగా సాగుతుంది. హీరో, హీరోయిన్ మధ్య ప్రేమకథను మరింత బలంగా చూపించే అవకాశం ఉన్నా, ఆ దిశగా కథనం ఆకట్టుకోదు. పాత్రల మధ్య భావోద్వేగ అనుబంధం ప్రేక్షకుడికి బలంగా కనెక్ట్ కావడం లేదు. ఇంటర్వెల్ సమయానికి కథపై ఆసక్తి పెరగాల్సి ఉండగా, తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను కలిగించే విధంగా కథనం సాగదు. దీంతో ఫస్టాఫ్ సాధారణంగానే ముగుస్తుంది. సెకండాఫ్ మరింత నిరాశపరుస్తుంది! ఇంటర్వెల్ తర్వాత కథలో కీలకమైన పరిణామాలు చోటుచేసుకోవాలి. హీరో జీవితంలో మార్పు రావడం, నక్సల్స్ ఉద్యమ నేపథ్యం బలపడటం, ప్రధాన సంఘర్షణ తీవ్రతరం కావడం వంటి అంశాలతో కథ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. కానీ సెకండాఫ్‌లో కూడా కథనం పుంజుకోదు. కీలక సన్నివేశాలను బలంగా తెరకెక్కించలేకపోవడంతో కథలోని సంఘర్షణ ప్రేక్షకుడికి అనుభూతి కలిగించదు. పాత్రల నిర్ణయాలు, వాటి వెనుక ఉన్న కారణాలు కూడా మరింత స్పష్టంగా చూపించాల్సి ఉంది. క్లైమాక్స్‌ దగ్గరకు వచ్చేసరికి కథను ముగించాలనే తొందర కనిపిస్తుంది. పాత్రల్లో మార్పులు, భావోద్వేగ పరిణామాలు సహజంగా జరగాల్సి ఉండగా, కొన్ని సందర్భాలు హడావుడిగా ముగిసిన భావన కలిగిస్తాయి. మొత్తంగా సెకండాఫ్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.

నటీనటుల పనితీరు :
న‌వ్వించ‌డంలో తిరుగులేని క‌థానాయ‌కుడు శ్రీవిష్ణు మ‌రోసారి అల‌వోక‌గా పాత్ర‌లో ఒదిగిపోయారు. అతడికి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. కొత్తగా చేయాల్సిన అవసరమే కలగలేదు. తన బాడీ లాంగ్వేజ్, హావభావాలు, తన మార్క్ డైలాగ్ డెలివరీతో సింపుల్‌గా పని కానిచ్చేశాడు. తనదైన సహజసిద్ధమైన కామెడీ టైమింగ్‌తో సినిమాను ముందుండి నడిపించారు. ప్రత్యేకించి కథానాయకుడి పాత్రను తన శైలికి తగ్గట్టుగా మలచుకొని, చిన్న చిన్న సంభాషణలతోనూ కావాల్సినంత వినోదాన్ని పండించగలిగారు. శ్రీవిష్ణు తనదైన శైలిలో నటించడానికి ప్రయత్నించినా, బలహీనమైన కథ, రొటీన్‌ పాత్ర చిత్రణ ఆయనకు అడ్డంకిగా మారాయి. గత సినిమాల్లో ఆయన కామెడీ టైమింగ్‌ ఎంతగానో ఆకట్టుకుంది. కానీ ఇందులో ఆ స్థాయి వినోదం కనిపించదు. పాత్రలో కొత్తదనం లేకపోవడంతో ఆయన నటన కూడా సాధారణంగానే అనిపిస్తుంది. అయితే.. శ్రీ విష్ణు ఎప్పటిలానే తనకు అలవాటైన పాత్రలో కనిపించి మెప్పిస్తాడు. తన వెరైటీ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల్ని నవ్వించేస్తాడు.
క‌థానాయిక మ‌హిమా నంబియార్‌ గ్లామర్‌తోపాటు పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో కనిపించారు. ఆమెకు న‌టించే అవ‌కాశం పెద్ద‌గా దొర‌క‌లేదు కానీ, పాట‌ల్లో అందంగా క‌నిపించింది. సితార పాత్రలో కనిపించిన మహిమా నంబియార్ కు కథలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. హీరోతో ఆమె ప్రేమకథ మరింత బలంగా ఉండాల్సింది. పాత్రకు తగిన భావోద్వేగాలను చూపించే అవకాశం పరిమితంగా ఉండటంతో ఆమె నటన కూడా అంతగా గుర్తుండిపోదు. ఇక రాధిక శరత్ కుమార్ తన పాత్రలో జీవించినట్టు కనిపించారు. ఆమె పాత్ర ప్రారంభంలో ఆసక్తికరంగా మొదలైనా తర్వాత ప్రాధాన్యం కోల్పోయింది. రాధికా శరత్‌కుమార్ అనుభవజ్ఞురాలైన నటి అయినప్పటికీ, ఆమె పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దాల్సి ఉంది. కథలో ఆమె పాత్ర నుంచి ఆశించిన స్థాయి ప్రభావం కనిపించదు. కమెడియన్ సత్య మరోసారి తన మార్కు కామెడీతో ఆకట్టుకొన్నాడు.  ఆల‌స్యంగా ప‌రిచ‌య‌మైనా స‌త్య పాత్ర కూడా చివ‌రి వ‌ర‌కూ క‌నిపించి న‌వ్విస్తుంది. అయితే.. సత్య మరోసారి తన మార్క్ కామెడీతో ఆకట్టుకున్నప్పటికీ, ద్వితీయార్థంలో ఆయన పాత్ర పరిధి కాస్త తగ్గిందనిపిస్తుంది. సుద‌ర్శ‌న్‌, స‌త్య‌తో క‌లిసి క‌డుపుబ్బా న‌వ్వించాడు. బ్ర‌హ్మాజీ, ర‌ఘుబాబు, ఉపేంద్ర లిమాయే, వెన్నెల కిశోర్‌, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, ప్ర‌భాస్ శ్రీను, శ్రీకాంత్  అయ్యంగార్, శ‌త్రు, సాయిచంద్‌, ముక్కు అవినాష్‌… ఇలా తెర‌నిండా న‌టులే క‌నిపిస్తారు. నిడివితో సంబంధం లేకుండా అంద‌రి పాత్ర‌లూ సినిమాపై బ‌ల‌మైన ప్ర‌భావమే చూపించాయి. షైన్ టామ్ చాకో పాత్ర తేలిపోయింది. బుల్లిరాజు, ఉపేంద్ర లిమియో, వెన్నెల కిషోర్ తమదైన శైలిలో వినోదాన్ని పంచే ప్రయత్నం చేశారు. ఈ చిత్రంలో నటించిన వారంతా గుర్తుండిపోయే పాత్రలతో మెప్పించారు. ఇక ఉపేంద్ర లిమాయే రెగ్యులర్ పాత్రలోనే కనిపించగా, షైన్ టామ్ చాకో పాత్రకు పెద్దగా ఇంపాక్ట్ ఇచ్చే అవకాశం దక్కలేదు. సత్య తనదైన హాస్యంతో నవ్వించడానికి ప్రయత్నించినా, బలహీనమైన కామెడీ రచన కారణంగా ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. సుదర్శన్ తన పాత్ర పరిధిలో నటించినప్పటికీ, పాత్ర రూపకల్పనలో కొత్తదనం లేకపోవడంతో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. షైన్ టామ్ చాకో పోలీసు అధికారిగా ఆయన పాత్రలో కొత్తదనం లోపించింది. పాత్రను మరింత శక్తివంతంగా చూపించే అవకాశం ఉన్నా, ఆ దిశగా బలమైన సన్నివేశాలు లేవు. మొత్తంగా, ప్రతిభావంతులైన నటీనటులు ఉన్నప్పటికీ, బలమైన పాత్రలు, ఆసక్తికరమైన సన్నివేశాలు లేకపోవడంతో వారి ప్రతిభ పూర్తిస్థాయిలో బయటపడలేదు. సత్య కామెడీ టైమింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సుదర్శన్, ఉపేంద్ర, బలగం మురళీధర్ గౌడ్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇలా అన్ని పాత్రలు నవ్విస్తాయి. షైన్ టాం చాకో పాత్ర కూడా కొత్తగా కనిపించదు. బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, రఘు బాబు ఇలా అందరూ తమ పరిధి మేరకు ఆకట్టుకుంటారు. నక్సల్స్ ఉద్యమం, ప్రేమకథ, గ్రామీణ నేపథ్యం వంటి అంశాలను తీసుకున్నప్పటికీ, వాటిని ఆసక్తికరమైన కథగా మలచడంలో దర్శకుడు కొంత మేరకు తడబడ్డారు. కామెడీ సరిగా పండలేదు.. ప్రేమకథ మనసుకు హత్తుకోలేదు.. సీరియస్‌ సన్నివేశాలు కూడా బలంగా అనిపించవు. కథలో వేగం లేకపోవడం, స్క్రీన్‌ప్లేలో పట్టు కనిపించకపోవడం సినిమాకు ప్రధాన అడ్డంకులుగా మారాయి. మంచి నటీనటులు ఉన్నంత మాత్రాన సినిమా బాగుండదని మరోసారి నిరూపించిన చిత్రంగా ‘కామ్రేడ్ కళ్యాణ్’ నిలుస్తుంది. కథలో బలం, సన్నివేశాల్లో కొత్తదనం, భావోద్వేగాల్లో లోతు ఉంటేనే ఇలాంటి నేపథ్యాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అవేవీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోదు.
సాంకేతిక వర్గం పని తీరు: ప్రధానంగా సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఆక‌ట్టుకుంటుంది. క‌థ‌కు త‌గ్గ ప్ర‌పంచాన్ని ప‌క్కాగా ఆవిష్క‌రించింది కెమెరా. అడవి అందాలను బాగా కెమెరాలో బంధించాడు. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం డీసెంట్‌ గా ఉన్నాయి, కానీ కొన్ని కీలక సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత బలంగా ఉండాల్సింది. ఎడిటింగ్ ఓకే. నందు, భాను, కోన వెంక‌ట్ ర‌చ‌న చిత్రానికి ప్ర‌ధానబ‌లం. మాట‌లు ఆక‌ట్టుకుంటాయి. ద‌ర్శ‌కుడు జాన‌కిరామ్  మారెళ్లకు మేకింగ్‌పై ప‌ట్టు ప్ర‌ద‌ర్శించాడు. ప్రమోషనల్ కంటెంట్ కంటే వెండితెరపై కామెడీ సన్నివేశాలు బాగా పండాయి. ఇక ఈ కథకు దర్శకుడు జానకిరామ్ మారెళ్ల మంచి ఎగ్జిక్యూషన్ అందించారు. నటీనటులు నుంచి మంచి పెర్ఫామెన్స్ లు టైమింగ్ లను తాను రాబట్టారు. చోటా.కే.ప్రసాద్ తన పనిని తాను చక్కగా కానిచ్చేయడం వల్ల సినిమా స్పీడ్‌తో సాగిందనిపిస్తుంది. వెంకటకృష్ణ కర్నాటి, సీతార కర్నాటీ నిర్మాణ విలువలు బాగున్నాయి. టెక్నికల్‌గా చూసుకుంటే విజువల్స్ బాగుంటాయి. కానీ 90స్ బ్యాక్ డ్రాప్ సినిమా అన్నట్టుగా మాత్రం కనిపించదు. తెరపై పాటలు బాగానే అనిపిస్తాయి. మాటలు మాత్రం 90వ దశకంలా కాకుండా.. ఇప్పటి జబర్దస్త్ ట్రెండ్, పంచ్ డైలాగ్స్‌లా అనిపిస్తాయి. ఇక మొత్తంగా చూస్తే, ‘కామ్రేడ్ కళ్యాణ్’ మంచి ఫన్ మూమెంట్స్ తో సాగే టైం పాస్ కామెడీ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది. జానకిరామ్ మారెళ్ల ఎంచుకున్న నేపథ్యం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, దాన్ని తెరపై ప్రభావవంతంగా ఆవిష్కరించడంలో కొంత తడబడ్డట్టు అనిపించింది. కథలోని ప్రేమ, వినోదం, ఉద్యమ నేపథ్యం మధ్య సమతుల్యత కుదరలేదు. సన్నివేశాల నిర్మాణం, కథనం వేగం, భావోద్వేగాల విషయంలో మరింత శ్రద్ధ అవసరమైంది. ఈ సినిమాకు ప్రధాన బలహీనత కథ, స్క్రీన్‌ప్లే. బలమైన నేపథ్యాన్ని ఎంచుకున్నప్పటికీ, పాత్రల మధ్య సంఘర్షణలను ఆసక్తికరంగా మలచలేకపోయారు. సంభాషణలు, హాస్య సన్నివేశాలు కూడా చాలా చోట్ల సాధారణంగా అనిపిస్తాయి. విజయ్ బుల్గానిన్ సంగీతం కథనానికి అవసరమైనంత బలాన్ని అందించలేకపోయింది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాపై ప్రత్యేకమైన ముద్ర వేయలేకపోయాయి. సంగీత విభాగంలో ‘ఒరియా పిల్ల’తో పాటు ఆర్‌.నారాయణమూర్తి శైలిని గుర్తుచేసే విప్లవ గీతం కూడా సందర్భోచితంగా ఉత్సాహాన్ని నింపుతాయి. అవసరం లేని ఒక ట్రాక్ ఎడిటింగ్‌లో తొలగించడం ద్వారా కథనం వేగానికి మేలు జరిగింది. సమకాలీన అంశాలు, పాప్ కల్చర్‌ రిఫరెన్స్‌లతో కూడిన సంభాషణలు అక్కడక్కడా సరదాగా పేలాయి. ఎడిటింగ్ ప్రథమార్ధంలో ఉన్నంత చురుగ్గా ద్వితీయార్థంలో సాగలేదు.
(చిత్రం: కామ్రేడ్‌ కళ్యాణ్‌, నటీనటులు: శ్రీవిష్ణు, మహిమా నంబియార్‌, రాధికా శరత్‌కుమార్‌, సత్య, సుదర్శన్, షైన్‌ టామ్‌ చాకో, ఉపేంద్ర లిమాయే, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్, ప్రభాస్ శ్రీను తదితరులు. సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్‌, ఎడిటింగ్‌: చోటా కె ప్రసాద్‌, సమర్పణ : కోన వెంకట్, బ్యానర్: స్కంద వాహన మోహన్ పిక్చర్స్ ఎల్ఎల్‌పీ, కోన ఫిలిం కార్పోరేషన్, రచన: భాను భోగవరపు, నందు సవిరిగాన, జానకిరామ్ మారెళ్ల, నిర్మాత: వెంకట కృష్ణ కర్ణాటి – సీత కర్నాటి, రచన, దర్శకత్వం: జానకిరామ్‌ మారెళ్ల. విడుదల: 09, అక్టోబర్ 2026)