చంద్రహాస్ కోట్ల హీరోగా కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.3 పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

Production No. 3 from the banner Kurra Productions, starring Chandrahas Kotla and presented by K. Raghavendra Reddy, has been launched grandly with a formal *pooja* ceremony.
Production No. 3 from the banner Kurra Productions, starring Chandrahas Kotla and presented by K. Raghavendra Reddy, has been launched grandly with a formal *pooja* ceremony.
Spread the love

చంద్రహాస్ కోట్ల హీరోగా కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దినేష్ కుర్ర నిర్మిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెంబర్.3 గా రాబోతోన్న ఈ సినిమాకి చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు.
ఫిల్మ్ నగర్‌లోని సాయి బాబా గుడిలో సినిమాని ఘనంగా ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ రెరా మాజీ ఛైర్మన్ డా. ఎన్. సత్యనారాయణ క్లాప్ కొట్టగా.. గంగరాజు కాకర్ల, రంగారావు వేములపల్లి, సిరాజ్ ఎస్ఎం, మధుసూదన్ స్క్రిప్ట్ అందజేయగా, దీపా ఆర్ట్స్ అధినేత శ్రీనివాస్ గౌడ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
టైటిల్ ఇంకా ఖరారు చేయని ఈ మూవీకి శివా రెడ్డి ఎస్వి కెమెరామెన్‌గా, డి. వెంకట ప్రభు ఎడిటర్‌గా పని చేయనున్నారు.
తారాగణం : చంద్రహాస్ కోట్ల & తదితరులు
సాంకేతిక బృందం:
కథ-స్క్రీప్లే- డైలాగ్స్ – దర్శకత్వం : చెందు ముద్దు
నిర్మాత: దినేష్ కుర్ర
బ్యానర్: కుర్ర ప్రొడక్షన్స్
సమర్పణ : కె. రాఘవేంద్ర రెడ్డి
DOP: శివా రెడ్డి ఎస్వి
ఎడిటర్: డి వెంకట ప్రభు
సంగీతం: మారుతీ రాజా
PRO: సాయి సతీష్