తెలుగు చిత్రం నిర్మాతల మండలి ఎన్నికలు సమీపించగా ఎన్నికలలో పోటీ చేస్తున్న బ్యానల్స్ లో ఒకటైన మన ప్యానెల్ సభ్యులు నేడు కీలక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో మన ప్యానెల్ సభ్యులందరూ పాల్గొని ఎన్నికలకు సంబంధించిన విషయాలపై మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా…
సి కళ్యాణ్ గారు మాట్లాడుతూ :
* మన ప్యానెల్ తరపున అందరికీ నమస్కారం. నన్ను ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు థాంక్స్. బండ్ల గణేష్ తో మాట్లాడటం జరిగింది.
* గిల్డ్ వారికి మేము పూర్తి సహకారం అందించాము కానీ వారు ఈ సంస్థకి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఎన్నికల సమయంలోనే వారు కనిపిస్తారు. గిల్డ్ లో కౌన్సిల్ కి వచ్చే కమిషన్ సొమ్ము తీసుకుంటున్నారు. వచ్చే వారికి మెంబర్షిప్ కూడా ఇవ్వడం లేదు.
* మేము దాసరి నారాయణ రావు గారి అడుగు జాడల్లో నడుస్తున్నాము. బాలకృష్ణ గారితో సానుకూలంగా మాట్లాడటం జరిగింది.
* మేము కచ్చితంగా ఇద్దరు సీఎంలను కలిసి జరిగేది వివరించి మాట్లాడతాను. మెడిక్లైమ్ తీసుకొచ్చింది మేమే. ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో స్పందిస్తూ అందరికీ అందుబాటులో ఉన్నాము.
* మేము ఎన్నికైన వెంటనే 4 లక్షల నుండి 5 లక్షలకు మెడిక్లైమ్ చేస్తాము. కార్డ్స్ వెంటనే అందించే ప్రయత్నం చేస్తాము. చిన్న నిర్మాతలకు అండగా నిలబడతాడు. ఒక్క సినిమా చేసిన నిర్మాతకు కూడా మెడిక్లైమ్ చేసే ప్రయత్నం చేస్తాము.
* గతంలో ఇచ్చినట్లు చదువుకు 30 వేలు, పెళ్లికి అవసరమైన సొమ్మును ఇస్తాము. ఒక కుటుంబంలో ఒక ఆడబిడ్డ పెళ్లికి గతంలో ఇచ్చినట్లే 30 వేలు లేదా ఇంకా ఎక్కువ ఆర్ధిక సాయం చేస్తాము.
* వృద్ధులకు పెన్షన్ కమిటీ వేసి ఆర్ధిక సాయం చేస్తాము. మరణించిన వారి కుటుంబానికి అండగా నిలబడతాడు.
* ఏపీ ఎఫ్డిసి భారత్ భూషణ్ గారితో చర్చలు చేస్తున్నాము. రెండు రాష్ట్రాల సినీ ఆస్తుల గురించి కూడా మాట్లాడుతున్నారు. గతంలో పని చేసిన అందరికంటే బాగా భారత్ భూషణ్ గారు పని చేస్తున్నారు. ఈ విషయం గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిలతో మాట్లాడతాను.
* గతంలో కట్టిన బిల్డింగ్ రెంట్స్ ద్వారా వచ్చిన సొమ్మును 2032 నుండి 30% ఆదాయం సినిమా వారికి ఉపయోగిస్తాము.
* వెబ్సైట్ ద్వారా చిన్న సినిమాలు OTT బిజినెస్ జరిగేలా చూస్తాము.
చదలవాడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ :
* మన ప్యానెల్ నుండి రెగ్యులర్ గా సినిమాలు తీస్తూ పోటీ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు. దాసరి నారాయణరావు గారిని మేము అనుసరిస్తున్నాము. బండ్ల గణేష్ గారికి కృతజ్ఞతలు.
* సినిమా ఇండస్ట్రీలో రైతులా కష్టపడి పనిచేసే వ్యక్తి నిర్మాత. నిర్మాతల ఎన్నికలలో నామినేషన్ వేసిన అందరికీ కృతజ్ఞతలు .
* మేము ఎంతో హుందాగా ముందుకు వెళ్తుండగా అశోక్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన నామినేషన్ మేము కావాలని వెనక్కి వచ్చేలా చేశాం అంటున్నారు. కానీ ఆయన కోర్టు వెళ్లారు. ఆయన ఇండస్ట్రీకి గౌరవం ఇచ్చి ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాను. అనుభవం లేక 3 నామినేషన్ వేసారు, దానికి ఆయనను అనర్హులుగా తీర్మానించారు. వారి ప్యానెల్ లో వేరే వాళ్ళు కూడా ఎక్కువ నామినేషన్ వేసి విత్డ్రా చేసుకోబట్టి ముందుకు వెళ్ళారు. ఆయన విత్డ్రా చేసుకోలేదు కాబట్టి అనర్హులు అయ్యారు.
* వారి వల్ల పరిశ్రమకు ఎటువంటి ఉపయోగం లేదు. ముఖ్యమంత్రులకు కనిపించేందుకు, ప్రజలకు కనిపించేందుకు కాదు వారి పదవి. సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ గా నిలిచి ముందుకు వెళ్ళే మన ప్యానెల్ కు ఓటు వేయాలని కోరుకుంటున్నాను. మంచి పరిపాలన అందిస్తాము.
తుమ్మల ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ :
* గత ఎన్నికలలో చదలవాడ శ్రీనివాసరావు గారి మాటకు విలువ ఇచ్చి ముందుకు వెళ్ళడం జరిగింది. గతంలో జరిగిన ఒక సందర్భంలో కూడా కొన్ని అవకతవకల వల్ల కొన్ని నిర్ణయాలు సమయస్పూర్తిగా ముందుకు వెళ్ళాము.
* రికార్డ్స్ లో మేము చేసిన సేవలు, అందించిన మెడిక్లైమ్ ఉన్నాయి. ఇబ్బందిలో ఉన్న వృద్ధులకు అండగా నిలబడి ఛారిటీగా పని చేస్తున్నాము. దానికి సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయి.
* డబుల్ నామినేషన్ వేసిన అందరూ ఇచ్చిన సమయంలోనే ఒకటి మాత్రమే ఉంచుతూ ముందుకు వెళ్ళారు. సమయం పూర్తైన తర్వాత అశోక్ గారు విత్డ్రా చేసేందుకు వస్తె సమయం అయిపోయింది. బండ్ల గణేష్ గారు సి కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ విత్డ్రా చేయడం జరిగింది.
* నామినేషన్ విధానం అంతా రూల్ ప్రకారం పద్ధతిగా జరిగింది. కోర్టుకు మేము గౌరవం ఇస్తాము. చదలవాడ గారు, సునీల్ నారంగ గారు, ఆర్టిస్ట్ శివాజీ గారు అండగా నిలబడి సేవలు అందించారు.

