ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈనెల 21,22 తేదీలలో జరిగే జాతీయ సదస్సుకు జి.హెచ్.ఎం.సి కమిషనర్ కర్ణన్, హెచ్.ఎం.డి.ఏ కమిషనర్ సర్పరాజ్ అహమ్మద్ ను హైదరాబాద్ ప్రెస్ క్లబ్ పాలకమండలి కలిసింది.బుధవారం నాడు ప్రెస్ క్లబ్స్ అఫ్ ఇండియా ఫెడరేషన్ సీ.ఈ.ఓ వివేక్ ముఖర్జీ, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎస్. విజయ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఏ. రాజేష్,జాయింట్ సెక్రెటరీలు చిలుకూరి హరిప్రసాద్, వర్దెల్లి బాపురావు, కోశాధికారి రమేష్ వైట్ల జిహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్ ను ఈ సందర్భంగా శాలువతో సత్కరించారు. ప్రెస్ క్లబ్స్ అఫ్ ఇండియా ఫెడరేషన్ జాతీయ సదస్సుకు రావాలని ఆహ్వానించారు.
అనంతరం నానక్ రామ్ గూడా లోని హెచ్.ఎం.డి.ఏ కార్యాలయంలో కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ గారిని ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల, ఉపాధ్యక్షులు ఏ. రాజేష్, జాయింట్ సెక్రెటరీలు చిలుకూరి హరిప్రసాద్, వర్దెల్లి బాపు రావు, ప్రెస్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ముత్యాల సత్తిబాబు తదితరులు కలిసి ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కాంక్లేవ్ కు ఆహ్వానించారు.
హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ గారిని మర్యాదపూర్వకంగా శాలువతో సత్కరించారు. ఇదే సందర్భంగా ఆహ్వాన పత్రాన్ని ప్రెస్ క్లబ్ పాలకమండలి బృందం అందజేసింది. జాతీయస్థాయిలో జరిగే ఈ సదస్సుకు తప్పకుండా హాజరవుతానని సర్ఫరాజ్ వెల్లడించారు. దేశంలోని ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ జాతీయ సదస్సు విజయవంతం కావాలని సర్ఫరాజ్ ఆకాంక్షించారు.

