అట్టహాసంగా వెండితెర & ఓటీటీ అవార్డ్స్.. ప్రతిభకు ఘన గుర్తింపు,విజయవాడలో ఘనంగా విబి ఎంటర్టైన్మెంట్స్ వెండితెర & ఓటీటీ అవార్డ్స్

Grand Celebration of Silver Screen & OTT Awards: Distinguished Recognition for Talent; VB Entertainments' Silver Screen & OTT Awards Held Grandly in Vijayawada.
Grand Celebration of Silver Screen & OTT Awards: Distinguished Recognition for Talent; VB Entertainments' Silver Screen & OTT Awards Held Grandly in Vijayawada.
Spread the love

విజయవాడ, ఆగస్టు 18: సినీ, ఓటీటీ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న కళాకారులు, సాంకేతిక నిపుణులను గుర్తించి సత్కరించే లక్ష్యంతో నిర్వహించిన విబి ఎంటర్టైన్మెంట్స్ వెండితెర & ఓటీటీ అవార్డ్స్ వేడుక విజయవాడలో అట్టహాసంగా జరిగింది. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమం సినీ ప్రముఖులు, కళాకారులు, మీడియా ప్రతినిధులు, అభిమానులతో సందడిగా సాగింది.ఈ వేడుకలో వెండితెరతో పాటు ఓటీటీ రంగంలో ప్రతిభ కనబరిచిన పలువురు ప్రముఖులకు అవార్డులను అందజేశారు. సినీ నటులు వడ్డే నవీన్, రాజీవ్ కనకాల, మ్యూజిక్ డైరెక్టర్ రఘకుంచె, అనితాచౌథరి తదితరులు అవార్డులను అందుకున్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. విజయవాడలో ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.కళాకారులను ప్రోత్సహించడం, వారి ప్రతిభను గుర్తించి గౌరవించడం ద్వారా సినీ రంగానికి మరింత ఉత్సాహం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు.మాజీ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ అంబికా కృష్ణ మాట్లాడుతూ.. ప్రతిభ ఉన్న కళాకారులను గుర్తించి ప్రతి సంవత్సరం అవార్డులతో సత్కరించడం అభినందనీయమన్నారు. విబి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు.
ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ రామారావు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ.ఈ అవార్డుల వేడుకలో ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ రామారావు పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఆయన మాట్లాడుతూ…త్వరలో నంది అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.విష్ణుబొప్పన కు నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు.వి వి కె హౌసింగ్ ఇండియా టైటిల్ స్పాన్సర్ చేయగా, పీవీఆర్ గ్రూప్, శ్రీ నిలయ ఇన్‌ఫ్రా, రైతు రాజేంద్ర అగ్రో ఫార్మ్స్, రోటరీ విజయవాడ మిడ్‌టౌన్, ఆర్‌ఆర్ ఇన్‌ఫ్రా, ఎల్‌ఐసీ, శ్రీ గౌతమ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ తదితర సంస్థలు స్పాన్సర్లుగా తమ సహకారాన్ని అందించాయి. వారి సహకారంతో అవార్డుల కార్యక్రమం మరింత ఘనంగా నిర్వహించబడింది.
వెండితెరతో పాటు ఓటీటీకి గుర్తింపు
ప్రస్తుతం వినోద రంగంలో ఓటీటీకి కూడా విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో వెండితెరతో పాటు ఓటీటీ రంగానికి చెందిన ప్రముఖులు, కళాకారులను కూడా అవార్డులతో సత్కరించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమా రంగంలో నటీనటులతో పాటు దర్శకులు, రచయితలు, సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణులు తదితర విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి గౌరవించడం ఈ అవార్డుల ప్రధాన ఉద్దేశంగా నిలిచింది.పేదకలాకారూలకు ఆర్ధిక సహయం అందించడం జరిగింది అని తెలిపారు..