ఏప్రిల్ 24, 2026న థియేటర్లలో విడుదలైన ‘గేదెలరాజు’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఆహాలో ప్రేక్షకాదరణతో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రధాన పాత్రలో నటించిన రఘు కుంచే తన నటనతో విశేష ప్రశంసలు అందుకుంటుండగా, ఆయన స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యధికంగా రీ-వాచ్ అవుతున్న చిత్రాల్లో ఒకటిగా నిలవడంతో పాటు, ఆహాలో కూడా ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మోటూరి క్రియేషన్స్ పతాకంపై రఘు కుంచే సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. ఆయన తొలి ప్రయత్నమైన ఈ చిత్రంలోని నాన్-లీనియర్ కథనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వికాస్, టీనా శ్రావ్య, రామచంద్రం, మోనికా కలపాల, రవి చిన్నిబిల్లి, శ్రీకాంత్ అయ్యంగార్, బాషా , దివ్య మోటూరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
అమెజాన్ ప్రైమ్‌లో ప్రేక్షకులను అలరిస్తున్న ‘గేదెలరాజు’
