‘ది ప్యారడైజ్’ కోసం స్టార్ బ్యూటీ కీర్తి సురేష్?

Star beauty Keerthy Suresh for ‘The Paradise’?
Star beauty Keerthy Suresh for ‘The Paradise’?
Spread the love

నాచురల్ స్టార్ నాని హీరోగా ఇప్పుడు నటిస్తున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’ అందరికీ తెలిసిందే. తన బ్లాక్ బస్టర్ చిత్రం ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న ఈ రెండో సినిమా భారీ అంచనాలు సెట్ చేసుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు దాదాపు పూర్తి కావస్తుండగా ఓ క్రేజీ బజ్ ఇపుడు దీనిపై వినిపిస్తుంది. ఆల్రెడీ ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొన్నాళ్ల నుంచి ఆ సాంగ్ ఎవరు చేస్తారు అనేదే ప్రశ్నగా మిగిలింది. కానీ ఇప్పుడు ఫైనల్ గా తమ దసరా బ్యూటీనే లాక్ అయినట్టుగా వినిపిస్తుంది. స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ దసరా సినిమాలో ఎలాంటి మ్యాజిక్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ వారి కోసం కీర్తి ఓకే చెప్పినట్టుగా ప్రస్తుతం ఓ రూమర్ వైరల్ గా మారింది. మరి ఇది నిజమైతే మరోసారి వెన్నెల మ్యాజిక్ చేస్తుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా ఎస్.ఎల్. వి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.