హైదరాబాద్,జూలై, 24: నిమ్స్ లో ప్రెస్ క్లబ్ సభ్యులకు మాస్టర్ హెల్త్ చెకప్ ప్రత్యేక శిబిరం ప్రారంభమైంది వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు శుక్రవారం నాడు నిమ్స్ లో ప్రెస్ క్లబ్ సభ్యులకు మాస్టర్ చెకప్ ప్రత్యేక శిబిరాన్ని నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ పరిరక్షణలో డీన్ సీనియర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్, సీనియర్ ప్రొఫెసర్ పరంజ్యోతి, అసిస్టెంట్ రిజిస్టర్ డాక్టర్ చరణ్ రాజు లు లాంఛనంగా ప్రారంభించారు. జర్నలిస్టులో వారి కుటుంబ సభ్యులకు ఈ మాస్టర్ హెల్త్ చెకప్ శిబిరం ఎంతగానో ఉపకరిస్తుందని ప్రెస్ క్లబ్ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు ఎస్. విజయకుమార్ రెడ్డి ,రమేష్ వరికుప్పల ఈ సందర్భంగా అన్నారు.
తీవ్రమైన పని ఒత్తిడి వల్ల జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అలాంటి వారికి ఈ నిమ్స్ శిబిరం ఒక సువర్ణ అవకాశమని ప్రెస్ క్లబ్ కార్యవర్గం అభిప్రాయపడింది.ఈ వైద్య శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు ఏ .రాజేష్, అరుణ అత్తలూరి, జాయింట్ సెక్రెటరీ చిలుకూరి హరిప్రసాద్, కోశాధికారి రమేష్ వైట్ల, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఎన్. శ్రీనివాస్ రెడ్డి, వనం నాగరాజు, అశోక్ దయ్యాల, రచన ముడుంబై, నిమ్స్ పి .ఆర్. ఓ .సత్యం గౌడ్ సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డు ఉన్న సభ్యులందరికీ ఈ మాస్టర్ హెల్త్ చెకప్ చేయడం జరుగుతుందని నిమ్స్ వైద్యాధికారులు వెల్లడించారు. ప్రెస్ క్లబ్ నమోదు చేసుకున్న సభ్యులకు మాత్రమే ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందని ప్రెస్ క్లబ్ కార్యవర్గం వెల్లడించింది.
ప్రెస్ క్లబ్ సభ్యులకు నిమ్స్ లో మాస్టర్ హెల్త్ చెకప్ ప్రారంభం
