జీవీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూలై 10న మెగా జాబ్ మేళా–2026

Mega Job Mela-2026 on July 10 under the aegis of GVK Foundation
Spread the love

తెలంగాణ ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీటీపీఓఏ), జీవీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జూలై 10 న ఉస్మానియా యూనివర్సిటీలోని ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో మెగా జాబ్ మేళా–2026” నిర్వహించనుంది. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెగా జాబ్ మేళా కు సంబంధించిన గోడ పత్రికను డా. ఎంజీ రామచంద్రన్, జీవీకే, అజయ్ కుమార్, ఎం.రాజు లతో కలసి టీటీపీఓఏ అధ్యక్షుడు డా. జయరాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నియామక ప్రక్రియలో ప్రముఖ బహుళజాతి సంస్థలతో సహా 100కు పైగా కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, పీజీ లేదా ఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఇందులో పాల్గొనడానికి అర్హులు. ఉద్యోగ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తమ రెజ్యూమ్ లేదా బయోడేటా, ఆధార్ కార్డు, ఆధార్‌తో అనుసంధానించిన మొబైల్ నంబర్, పాన్ కార్డు కాపీ, అన్ని విద్యా అర్హత పత్రాల జిరాక్స్ కాపీలను వెంట తెచ్చుకోవాలి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఈ చరవాణి నంబర్లకు 93919 27259, 8466670308,9441792625 సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.

Related posts