రావు బహదూర్ : బెస్ట్ ఓపెనింగ్స్!

Rao Bahadur: Best Openings!
Spread the love

మ్యాప్ మిరాకిల్స్ సత్యదేవ్ హీరోగా దీపా థామస్ హీరోయిన్ గా దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన అవైటెడ్ తెలుగు సినిమానే ‘రావు బహదూర్’. ఒక ఇంట్రెస్టింగ్ ప్రయత్నంగా వస్తున్న ఈ సినిమా గ్రాండ్ గా విడుదలకి వచ్చి ఒకింత మిక్స్డ్ టాక్ సంతరించుకుంది. అయినప్పటికీ డే 1 మాత్రం ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా మొదటి రోజు రావు బహదూర్ ప్రపంచ వ్యాప్తంగా 3.9 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టు పిఆర్ వర్గాలు చెబుతున్నాయి. సో ఇది మాత్రం సత్యదేవ్ కి అలాగే వెంకటేష్ మహాకి కూడా బెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే సినిమా పరిస్థితి స్టడీగానే ఉంది సో ఈ వీకెండ్ వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి స్మరన్ సాయి సంగీతం అందించగా సూపర్ స్టార్ మహేష్ బాబు, చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, ఈశ్వరన్ విజయరాఘవన్ లు నిర్మాణం వహించారు.

Related posts