ప్రభాస్ రూల్స్ బ్రేక్..సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం!

Prabhas breaks the rules... sets a brand-new trend!
Spread the love

వంగా చేస్తున్న సరికొత్త ప్రయోగం
ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలు

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న హై-వోల్టేజ్ కాప్ డ్రామా ‘స్పిరిట్’ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతోంది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రాలన్నీ ఎక్కువగా గ్రీన్ స్క్రీన్స్, సీజీఐ, భారీ స్టూడియో సెట్లలోనే షూటింగ్ జరుపుకోగా.. వంగా మాత్రం ఇందుకు భిన్నంగా రియల్ లొకేషన్స్‌ను ఎంచుకున్నాడు. కృత్రిమ సెట్ల వల్ల ప్రభాస్ సహజసిద్ధమైన రా స్క్రీన్ ప్రెజెన్స్ దెబ్బతింటోందనే విమర్శలకు ఈ సినిమాతో చెక్ పెట్టబోతున్నాడు. ఇందులో భాగంగానే ‘స్పిరిట్’ షూటింగ్‌ను వంగా హైదరాబాద్ లోని అసలైన గల్లీల్లోకి తీసుకువచ్చాడు. కొద్దిరోజుల క్రితం నగరంలోని ఐకానిక్ విమల్ థియేటర్ వద్ద ఒక హై-ఆక్టేన్ సీక్వెన్స్‌ను షూట్ చేయగా, ప్రస్తుతం చంచల్‌గూడ సెంట్రల్ జైలులో ప్రభాస్‌పై ఒక కీలక షెడ్యూల్ రన్ అవుతోంది. సాధారణంగా క్రౌడ్ తక్కువగా ఉండే ప్రదేశాల్లో షూటింగ్ చేయడానికి ఇష్టపడే ప్రభాస్‌ను వంగా ఇలా పబ్లిక్ లొకేషన్లలోకి తీసుకురావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తన మార్క్ పట్టుదలతో వంగా చేస్తున్న ఈ సరికొత్త ప్రయోగంపై ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కంఫర్ట్ జోన్ దాటి పూర్తి రియలిస్టిక్ లొకేషన్లలో శరవేగంగా జరుగుతున్న ఈ షూటింగ్ గనుక పర్‌ఫెక్ట్‌గా వర్కవుట్ అయితే, ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే బ్లాక్‌బస్టర్ పడటం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Related posts