మెగాస్టార్ చిరంజీవి మనవరాలు.. రామ్ చరణ్, ఉపాసన దంపతుల మొదటి బిడ్డ క్లింకార కొణిదెల గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ముహూర్తంలో ఈ చిన్నారి మెగా ఇంట్లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఆ ఇంటికి అదృష్టం పట్టిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వివాహానంతరం దాదాపు పదేళ్ళ తరువాత ఉపాసన.. క్లింకారకి జన్మనిచ్చింది. ఇక ఎప్పుడెప్పుడు ఈ చిన్నారి ముఖం చూస్తామా అని మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది. మూడేళ్ళ తరువాత చరణ్ – ఉపాసన.. తమ గారాల పట్టీ క్లింకార ముఖాన్ని అభిమానులకు చూపించారు. ఎన్నోసార్లు క్లింకార ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. బయటకు వచ్చినప్పుడు ఆమె ముఖాన్ని దాచడానికి చరణ్ పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. తనను ఎప్పుడైతే నాన్న అని పిలుస్తుందో అప్పుడు తన కూతురు ముఖాన్ని రివీల్ చేస్తానని చరణ్ చెప్పాడు. చెప్పినట్లుగానే ‘పెద్ది’ సమయంలో క్లింకార.. చరణ్ ని నాన్న అని పిలవడమే కాదు.. ఐ లవ్ యూ కూడా చెప్పింది. ఇక ఆ వీడియో చూసిన ఫ్యాన్స్.. క్లింకార ముఖాన్ని చూపించాలి అని చరణ్ ని కోరారు. ఇక చరణ్.. అభిమానులకు చెప్పినట్లే మాట నిలబెట్టుకున్నాడు. నేడు క్లింకార మూడవ పుట్టినరోజు. ఉదయం నుంచి మెగా ప్రిన్సెస్ కి మెగా ఫ్యాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. తాజాగా వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ ఉపాసన.. క్లింకార ముఖాన్ని రివీల్ చేస్తూ పోస్ట్ పెట్టింది. తల్లిదండ్రుల మధ్యలో నవ్వులు చిందిస్తూ ఉన్న క్లింకార ఫోటోను అభిమనులతో షేర్ చేసుకుంది. బ్లూ అండ్ గ్రీన్ కలర్ ఫ్రాక్ వేసుకుని, తలపై చిన్న వైట్ బో పెట్టుకొని మెగా ప్రిన్సెస్ చాలా ముద్దుగా కనిపిస్తుంది. ఆమె నవ్వుతున్న తీరు చూస్తుంటే అచ్చం తండ్రి రామ్ చరణ్ పోలికలే వచ్చాయంటూ నెటిజన్లు మరియు మెగా అభిమానులు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటివరకు చరణ్ దంపతులు ఎక్కడికి వెళ్లినా క్లింకార ముఖం కనిపించకుండా ఎమోజీలు పెట్టడం లేదా కెమెరాలకు దొరకకుండా జాగ్రత్తపడటం చేసేవారు. కానీ, మొదటిసారి ఇలా పూర్తి ముఖాన్ని చూపిస్తూ అధికారికంగా ఫొటో బయటకు రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఎంత క్యూట్‌గా ఉందో…రామ్ చరణ్ కూతురు క్లింకార ఫేస్ రివీల్..
