వడ్డే జిష్ణు సమర్ఫణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. ఈ సినిమాతో కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్‌కి జోడిగా రాశీ సింగ్ నటించారు. ఈ చిత్రం ఈనెల 19న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో గురువారం హీరోయిన్ రాశీ సింగ్ మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలివే..
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
-పక్కింటి అమ్మాయిలా నా పాత్ర ఉంటుంది. ఎంతో సహజంగా అనిపిస్తుంది. విత్ అవుట్ మేకప్ నటించాను. చాలా వరకు నేచురల్‌గానే కనిపిస్తాను. ఇందులో కంప్లీట్ మదర్ పాత్రలా ఉండదు. ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథ ఇది. వడ్డే నవీన్ గారితో సినిమా అని తెలిశాక చాలా వరకు ఆయన గురించి రీసెర్చ్ చేశాను. ఆయన నటించిన ఎన్నో చిత్రాల గురించి తెలుసుకున్నాను. ఎందుకు ఇంత గ్యాప్ ఇచ్చారు అని అందరి కంటే ముందుగా నేను ఆయన్ను అడిగాను (నవ్వుతూ).
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’లో మీ పాత్ర ఎలాంటి టర్నింగ్ పాయింట్‌లా ఉంటుంది?
-భర్తకు ప్రతీ విషయంలో సపోర్ట్‌గా ఉండే ఓ చక్కటి గృహిణిగా లక్ష్మీ పాత్ర ఉంటుంది. నేను రియల్ లైఫ్‌లో కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటాను. లక్ష్మీ పాత్రను పోషించడం ఆనందంగా ఉంది. ఈ ట్రాన్స్‌ఫర్స్ విషయంలో లక్ష్మీ అనే కారెక్టర్ ఎప్పుడూ ప్రిపేర్ అయి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చిరాకు పడినా కూడా భర్తకు ఎప్పుడూ అండగానే ఉంటుంది. నా కెరీర్‌లో ఇదొక డిఫరెంట్ పాత్ర అవుతుంది. దర్శకుడు కమల్ గారికి ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఆయనకు ఏం కావాలో అది వచ్చే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. లక్ష్మీ ఎలా ఉండాలో.. అలానే ఉండాలని ఆయన చెబుతుంటారు. కొంచెం అటూ ఇటూ కూడా కావొద్దు అని ఆయన అంటుంటారు. ఆయనకు ప్రతీ క్రాఫ్ట్ మీద క్లారిటీ ఉంది. ఆయనతో జర్నీ చాలా స్మూత్‌గా సాగింది.
వడ్డే నవీన్ తో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి చెప్పండి?
-వడ్డే నవీన్ గారు చాలా ఇంటలెక్చువల్. ఆయనకు వరల్డ్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో ఏ విషయం గురించి అడిగినా బోలెడంత సమాచారం ఇస్తారు. కానీ సోషల్ మీడియా, ఇన్ స్టాగ్రాం అంటే మాత్రం పారిపోతారు. ఆయకు ఇన్ స్టా అకౌంట్ ఓపెన్ చేయించాలని చాలా ప్రయత్నించాను.
రెస్టారెంట్ బిజినెస్ ఎలా నడుస్తోంది?
-రెస్టారెంట్ బిజినెస్ అద్భుతంగా నడుస్తోంది. వడ్డే నవీన్ గారు కూడా నా వ్యాపకాల గురించి అడిగేవారు. నాకున్న రెస్టారెంట్, కెఫె వ్యాపారాల గురించి చెప్తే ఆశ్చర్యపోయారు. నాకు ఫుడ్, కాఫీ అంటే చాలా ఇష్టం. అందుకే ఆ బిజినెస్ పెట్టాను. నా బ్రదర్ హోటల్ మేనేజ్మెంట్ చేశారు. అతని సలహాలు కూడా తీసుకున్నాను.
మీకు ఏ రంగంలో కంఫర్ట్‌గా అనిపిస్తుంది?
-నాకు సినిమాలు, వ్యాపారాలు రెండూ ఇష్టం. నేను ఇంకా ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఇదంతా కూడా నథింగ్. 14 ఏళ్లకే మోడలింగ్ స్టార్ట్ చేశా. ఛత్తీస్ ఘడ్‌లోని భిలాయ్ నుంచి వచ్చాను. మిస్ చత్తీస్ ఘడ్ పోటీలో రెండో స్థానంలో వచ్చాను. పేపర్‌లో నా ఫోటో చూసి ఆ విషయం మా ఇంట్లో వాళ్లకి తెలిసింది. నాకు చదువుల్లో అంతగా ఆసక్తి ఉండేది కాదు. అలా మెల్లిగా ఎయిర్ హోస్టెస్‌గా కెరీర్ ప్రారంభించాను. ఇప్పుడు సినిమాలు, వ్యాపారాల్లో బిజీగా ఉన్నాను.
ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్‌లు ఏంటి?
-‘గాసిప్’ అని ఓ ప్రాజెక్ట్ ఓటీటీ కోసం చేశాను. ఇంకా కొన్ని ప్రాజెక్టులు చర్చల దశల్లో ఉన్నాయి. రకరకాల పాత్రలు, డిఫరెంట్ కంటెంట్ ఉన్న చిత్రాల్ని చేయాలని చూస్తున్నాను. గ్లామర్ అయినా పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ అయినా సరే నేను నటించేందుకు సిద్దంగానే ఉన్నాను.
ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ సినిమా చూశారా?*
-షూటింగ్ టైంలో నాకు పూర్తి కథ తెలీదు. నా సీన్స్ వరకే కథను చెప్పారు. ఈ చిత్రాన్ని చూసిన తరువాత ఆశ్చర్యపోయాను. నవీన్ గారు చాలా సర్ ప్రైజ్ చేస్తారు. నా పాత్ర తెరపై చక్కగా అనిపించింది. వంద శాతం న్యాయం చేశానని అనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ చూశాక సినిమా అద్భుతంగా అనిపించింది. ఇదొక మంచి చిత్రంగా నిలుస్తుంది.
