వెంకటేష్- కళ్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్ ప్రారంభం

Spread the love

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, ‘హిట్ మెషీన్’ అనిల్ రావిపూడి కలిసి ఒక పూర్తి స్థాయి పండుగ వినోదాత్మక చిత్రం అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ చిత్రం 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కీర్తి సురేష్, కృతి శెట్టి ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్ర బృందం,  పలువురు ప్రముఖ అతిథుల సమక్షంలో ఘనంగా జరిగిన ముహూర్తం, పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. దిల్ రాజు, శిరీష్ స్క్రిప్ట్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి,  నిర్మాత సాహు గారపాటికి అధికారికంగా అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ముహూర్తం సందర్భంగా, విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టిలపై చిత్రీకరించిన మొదటి షాట్‌కు అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, సురేష్ బాబు కెమెరాను స్విచ్ ఆన్ చేశారు. దిగ్గజ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు ఓపెనింగ్ షాట్‌కు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అనిల్ రావిపూడి స్టయిల్ లో సాగే వినోదం, నవ్వులతో కూడిన సంక్రాంతి చిత్రంగా ఉండబోతోంది. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబో ఈ ప్రాజెక్ట్‌కు మరింత ఎట్రాక్షన్ జోడించడంతో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పండుగ చిత్రాలలో ఒకటిగా ఇది నిలుస్తోంది. అనిల్ రావిపూడికి ఉన్న అద్భుతమైన బ్లాక్‌బస్టర్ ట్రాక్ రికార్డ్, స్టార్స్ కలయిక, పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థల మద్దతు కారణంగా ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి అత్యుత్తమ సాంకేతిక బృందం పనిచేస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్,  ఎ.ఎస్. ప్రకాష్ ఆర్ట్ డైరెక్షన్  నిర్వహిస్తున్నారు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
తారాగణం: విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సాంకేతిక సిబ్బంది: రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి, నిర్మాత: సాహు గారపాటి, సమర్పకులు: సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, శ్రీమతి అర్చన, సంగీతం: జివి ప్రకాష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ, సినిమాటోగ్రాఫర్: సమీర్ రెడ్డి, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, పి.ఆర్.ఓ : వంశీ-శేఖర్, మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా


Related posts