లవ్ వైరస్2 షార్ట్ ఫిలిం పోస్టర్ ఆవిష్కరించిన దిల్ రాజు

Dil Raju unveils Love Virus 2 short film poster
Spread the love

జర్నలిస్ట్ నుమాన్ మంచి కథతో వస్తే తమ ప్రొడక్షన్స్ లో సినిమా నిర్మిస్తామని, కొత్తవారిని తాము ఎప్పుడూ ప్రోత్సహిస్తామని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. స్వయంకృషి క్రియేషన్స్ పై రూపుదిద్దుకుంటున్న లవ్ వైరస్2 షార్ట్ ఫిల్మ్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఆవిష్కరించారు. సోమవారం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఆయన కార్యాలయంలో లవ్ వైరస్ పార్ట్ వన్ వీక్షించారు. దర్శకుడు సయ్యద్ నుమాన్, అరమాస ప్రవీణ్ నిర్మాతగా రూపుదిద్దుకుంటున్న ఈ షార్ట్ ఫిలిం పార్ట్ వన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో లవ్ వైరస్ చిత్రీకరణ ప్రారంభిం చారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ దర్శకుడు నుమాన్ మంచి కథతో వస్తే తప్పకుండా కొత్తవారిని ప్రోత్సహిస్తామని అన్నారు. తక్కువ సమయంలో తక్కువ బడ్జెట్ తో షార్ట్ ఫిలిం ని రూపొందించిన చిత్ర బృందాన్ని దిల్ రాజు అభినందించారు. ఈ కార్యక్రమంలో నటీనటులు భాను ప్రకాష్, గణపతి, హసీనా, శ్రీ హర్ష, శ్యామ్, శివ నాగులు, మహేష్, కాస్ట్యూమ్ డిజైనర్ యామిని, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ పిట్ల హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts