క్రేజీ ఆఫర్స్ కోసం…

For crazy offers...
Spread the love

పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంటోంది కథానాయిక ప్రియాంకా మోహన్. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ నటిగా చక్కటి గుర్తింపును పొందుతోంది. ఈ ముద్దుగుమ్మ తొలిసారిగా కన్నడ ‘ఒంధ్ కథే హెల్లా (2019) ద్వారా సినీరంగంలో అడుగుపెట్టి నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత నాని ‘గ్యాంగ్ లీడర్’లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. శర్వానంద్ ‘శ్రీకారం’లోనూ నటించినా ఫలితం లేకుండా పోయింది. దాంతో టాలీవుడ్ పై నమ్మకం సన్నగిల్లిన ప్రియాంకా మోహన్ వరుసగా తమిళ సినిమాల్లో నటించింది. తర్వాత టాలీవుడ్ లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి పవన్ కళ్యాణ్ ‘ఓజీ’లో మెరిసింది. ఈ సినిమా ఆమెకు మంచి ఫలితాన్నే ఇచ్చింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంకా ఇటీవలే అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కించుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఆమె తాజా చిత్రం ‘మేడ్ ఇన్ కొరియా’ గ్లోబల్ వైడ్‌గా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఈ సూపర్ హిట్ చిత్రం సాధించిన అద్భుతమైన సక్సెస్ తర్వాత, కొరియా టూరిజం ఆర్గనైజేషన్ ప్రియాంకా మోహన్‌ను ‘కొరియా టూరిజం గౌరవ అంబాసిడర్’గా అధికారికంగా నియమించింది. కొరియా సంస్కృతిని, అక్కడి పర్యాటక రంగ విశేషాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు, ముఖ్యంగా భారతీయులకు మరింత దగ్గర చేసేందుకు కొరియా ప్రభుత్వం ఆమెను ఈ గౌరవ పదవికి ఎంపిక చేసింది. రోజురోజుకూ పెరుగుతున్న తన అంతర్జాతీయ ఫ్యాన్ బేస్‌తో ప్రియాంక ఒక గ్లోబల్ స్టార్‌గా అవతరిస్తూ ప్రపంచ వేదికపై సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ అరుదైన గౌరవం దక్కడంపై ప్రియాంకా మోహన్ హర్షం వ్యక్తం చేస్తూ, తనకు ఈ అవకాశం కల్పించిన కొరియా ప్రభుత్వానికి అక్కడి టూరిజం ఆర్గనైజేషన్‌కు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. ఇప్పుడు ఇక క్రేజీ ఆఫర్స్ కోసం ప్రియాంకా మోహన్ ఎదురుచూస్తోంది. అలాంటి ఆఫర్స్ ఆమెకు లభించాలని కోరుకుందాం.

Related posts