కెరీర్ గాడిన పడేదెప్పుడు?

When does a career take a hit?
Spread the love

టాలీవుడ్ లో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ, స్టార్ దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ మారిపోయారు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండేకు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. తొలి సినిమాతోనే హిట్ అందుకున్న షాలిని కచ్చితంగా బిజీ ఆర్టిస్ట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కొన్ని సినిమాలకే పరిమితం అయ్యింది.  ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో నటించి మెప్పించిన షాలిని పాండేకు మంచి పేరు వచ్చింది. కానీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవి సక్సెస్ కాలేదు. దాంతో ఈ అమ్మడు బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. దాంతో ఆఫర్స్ కరువయ్యాయి.  తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది. అక్కడ కూడా సక్సెస్ కాలేదు. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ భామ ఇప్పుడు సన్నజాజిలా మారిపోయింది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ వయ్యారాలు ఒలకబోస్తుంది. అయినా కూడా పెద్దగా ఆఫర్స్ రావడం లేదు.  సోషల్ మీడియాను షేక్ చేసేలా ఫోటోలు షేర్ చేస్తుంది. తన గ్లామర్ తో గాలులు వేస్తోంది. అందాలు ఆరబోస్తున్నా కూడా ఈ అమ్మడికి అవకాశాలు మాత్రంనిల్లు. కానీ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ మాత్రం భయంకరంగా పెంచుకుంది. సినిమాలు లేకపోయినా అభిమానులను సోషల్ మీడియా ద్వారా ఆకట్టుకుంటుంది షాలిని. ఇక ఈ అమ్మడి ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ బ్యూటీ సినిమాల్లో ఎందుకు బిజీ అవ్వలకేపోతుందా అని ఆరాలు తీస్తున్నారు. చూద్దాం..ఈ అమ్మడి కెరీర్ ఎప్పుడు గాడిన పడుతుందో..!?

Related posts