ఎస్తర్ నోరోన్హా కథానాయికగా ఎస్.కె గోపాల్ దర్శకత్వంలో బ్లూ రే సర్క్యూట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా నిర్మితమవుతున్న కొత్త చిత్రం ప్రారంభమైంది. హీరోయిన్ గా నూపూర్ ముఖర్జీ నటిస్తోంది. ముఖ్య పాత్రల్లో ముగ్గురు హీరోలు.. ముగ్గురు హీరోయిన్లు కూడా నటిస్తారు. ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే వివరాలు ప్రకటిస్తారు. సోమవారం మణికొండ శివాలయంలో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ‘సంతోషం’ ఫిలిం మ్యాగజైన్ అధినేత, నిర్మాత సురేష్ కొండేటి హీరో హీరోయిన్ల పై క్లాప్ కొట్టారు. నవ్యాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ఎస్విఎన్ రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఎక్స్ మినిస్టర్ వేణుగోపాల చారి స్క్రిప్ట్ అందించారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాల అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో దర్శక, నిర్మాతలు ఎస్.కె గోపాల్, అభినంద మాట్లాడుతూ జూన్ రెండవ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని.. ఈ లోపు మిగతా ఆర్టిస్టులు, లొకేషన్స్ , ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చేసుకుంటామని తెలిపారు. సాంగ్స్ ఆల్రెడీ రికార్డింగ్ దశలో ఉన్నాయని చెప్పారు. ఈ సినిమా ముఖ్యంగా హారర్ కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకులను మెప్పించేట్లు తెరకెక్కించనున్నామని తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చిత్రం రూపుద్దిద్దుకోనుందని చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించి నటీనటులు , హీరో చాక్లెట్ బాయ్ పవన్, ఒక హీరోయిన్ గా సంధ్య ను సెలెక్ట్ చేశామని, మిగతా ఇద్దరు హీరోలు.. ఇద్దరు హీరోయిన్లు సెలక్షన్స్ చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి దర్శకత్వం : ఎస్.కె గోపాల్, నిర్మాత, దర్శకత్వ పర్యవేక్షణ : అభినంద, మ్యూజిక్ : అజయ్ పట్నాయక్. సినిమాటోగ్రఫీ : మను టిఎఫ్ఐ, ప్రసాద్, పీఆర్ఓ : బాబు నాయక్



