చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన సారా అర్జున్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ధురంధర్. ఒక్క సినిమాతో ఇండియావైడ్‌గా సూపర్ ఫేం సంపాదించింది సారా అర్జున్. ధురంధర్‌లో సారా అర్జున్‌ను యలినా జమాలి పాత్ర కోసం ఎలా ఎంపిక చేశామనే ఆసక్తికర విషయాన్ని కాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ చాబ్రా వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆదిత్య ధర్ (డైరెక్టర్)కు చాలా మంది హీరోయిన్లు మెసేజ్ చేశారు. వారంతా రణ్‌వీర్‌తో కలిసి నటించేందుకు ఆసక్తి చూపించారు. నాకు కూడా చాలా మెసేజ్‌లు వచ్చాయి. ఈ రోల్ కోసం కొత్త వారిని ఎంపిక చేసుకోవాలని ఆదిత్యకు చాలా క్లియర్‌గా చెప్పా. వేరే సినిమాల్లో చేసిన ఫేమస్ హీరోయిన్లు అయితే ఈ పాత్రకు సరిపోరని ప్రకటించినప్పుడే చెప్పాను. రణ్‌వీర్ సింగ్‌తో ఇంతకు ముందు నటించిన హీరోయిన్ అయితే ప్రేక్షకులు కనెక్ట్ కాలేరని చెప్పాను. ఎందుకంటే ఈ చిత్రం (ధురంధర్2)లో హీరో పాకిస్థాన్‌కు వెళ్లి ఆమెను అక్కడ కలుస్తాడు. కాబట్టి ప్రేక్షకులకు అది ఒక సర్‌ప్రైజ్‌లా ఉండాలనుకున్నాం. ఈ రోల్ కోసం సుమారు 1300 మందిని ఆడిషన్ చేశాం. ఫైనల్‌గా సారా అర్జున్‌ను ఒకే చేశామని చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో ‘ధురంధర్ 2’ సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. రణ్‌వీర్‌సింగ్ హీరోగా ఆదిత్యధర్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇందులో హీరోయిన్‌గా అలరించిన సారా అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ నోట్ పోస్ట్ చేసింది. తెర వెనక హీరోలకు ధన్యవాదాలు తెలిపారు. చిన్నతనంలోనే మంచి నటిగా గుర్తింపుతెచ్చుకున్న సారా అర్జున్.. ‘ధురంధర్ 2’ విజయంతో తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నారు.
సారా అర్జున్ : సూపర్ ఫేం!
