‘కోర్ట్’ ఫేమ్ జోడి హర్ష్ రోషన్, శ్రీదేవి ఇప్పుడు ‘బ్యాండ్ మేళం’ అనే రొమాంటిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ గురువారం థియేటర్లలో విడుదలయిన ఈ సినిమా ఎంతమేర ఆకట్టుకుందో చూద్దాం…
కథ: చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్న బావా మరదళ్లు యాదగిరి (హర్ష్ రోషన్), రాజి (శ్రీదేవి). రాజి చదువులో రాణిస్తుంది, కానీ యాదగిరి స్కూల్ డ్రాపౌట్. రాజి పెరిగి పెద్దయ్యాక యాదగిరిని మర్చిపోతుంది. అయితే.. అతను మాత్రం ఆమెను ప్రేమిస్తూనే ఉంటాడు. అంతేగాక మ్యూజిక్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌కు చేరుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. మరి యాదగిరి తన జీవితంలో విజయం సాధించి, రాజి ప్రేమని ఎలా గెలుచుకున్నాడనేదే ఈ సినిమా కథ.
విశ్లేషణ: ‘బ్యాండ్ మేళం’లో మేజర్ డ్రా బ్యాక్ కథ. పాతచింతకాయ పచ్చడిలా సాగే ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా సినిమాల్లో వచ్చాయి. స్క్రీన్‌ప్లేలో కూడా కొత్తదనం ఏమీ లేకపోవడం మైనస్. సాయి కుమార్ లాంటి సీనియర్ యాక్టర్స్‌కు నటించడానికి పెద్దగా స్కోప్ లభించలేదు. ఫస్ట్ హాఫ్‌లో కొంత ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పటికీ, సెకండాఫ్ చాలా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. కథలో ల్యాగ్ ఎక్కువగా ఉండటం వల్ల మెయిన్ పాయింట్ పక్కదారి పట్టినట్లు అనిపిస్తుంది. రన్‌టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ సినిమా చాలా లెంగ్తీ అనిపిస్తుంది. కొన్ని సీన్లలో ఎమోషన్ సరిగ్గా పండలేదు. సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్ కొంత భిన్నంగా ఉన్నా, దాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయారు. ‘బ్యాండ్ మేళం’ ఎలాంటి కొత్తదనం లేని రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. హర్ష్ రోషన్, శ్రీదేవి ఆపల్ల తమ పాత్రల్లో బాగా నటించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం బాగుంది. అయితే రొటీన్ స్టోరీ లైన్, ఆకట్టుకోని సెకండాఫ్ .. ఎమోషన్ మిస్ కావడం ఈ సినిమాకు మేజర్ డ్రాబ్యాక్స్. కెరీర్ ప్రారంభంలో ఉన్నప్పటికీ, ఈ కమర్షియల్ ఎంటర్టైనర్లో లీడ్ పెయిర్ తమ నటనతో మెప్పించారు. హర్ష్ రోషన్ పల్లెటూరి కుర్రాడిగా చిలిపితనం మరియు అమాయకత్వంతో నీట్‌గా నటించాడు. శ్రీదేవి ఆపల్లా రాజి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. హీరోతో ఆమె కెమిస్ట్రీ బాగుంది. ఇక ఈ సినిమాలో వచ్చే ‘తిప్పుకుంటున్నావ్’ పాట స్క్రీన్‌పై వైబ్రంట్‌గా కనిపించింది. ఫస్టాఫ్ కొంతవరకు పర్వాలేదనిపించేలా సాగింది. అక్కడక్కడా కామెడీ కూడా వర్కౌట్ అయింది.
సాంకేతిక విభాగం: దర్శకుడు సతీష్ జవ్వాజి తన డైరెక్షన్‌తో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఫస్టాఫ్‌లో కొన్ని ఫన్ మూమెంట్స్ ఉన్నా, సెకండాఫ్ కథను సాగదీసింది. విజయ్ బుల్గానిన్ సంగీతం వినడానికి బాగుంది. మూడు పాటలు ఆకట్టుకుంటాయి. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అయితే ఎడిటింగ్ .. స్క్రీన్‌ప్లే ఆశించిన స్థాయిలో లేవు. సో… ఎలాంటి కొత్తదనం లేని రొమాంటిక్ డ్రామా ఈ ‘బ్యాండ్ మేళం’ అని చెప్పొచ్చు. (రేటింగ్: 2.5/5)
‘బ్యాండ్ మేళం’ మూవీ రివ్యూ… రొమాంటిక్ డ్రామా!
