ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర సెన్సేషనల్ గా మారిన సినిమానే ‘ధురంధర్ 2’. యువ దర్శకుడు ఆదిత్య ధర్, రణ్వీగ్ సింగ్ కలయికలో చేసిన ఈ సాలిడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గ్రాండ్ గా విడుదలకి వచ్చి అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాపై అనేకమంది స్టార్ నటులు, దర్శకులు కూడా తమ స్పందన అందిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ కూడా ఈ సినిమాపై స్పందించడం జరిగింది. ఈ చిత్రాన్ని దర్శకుడు శంకర్ ఆకాశానికి ఎత్తేసారు. నిజంగా జరిగిన ఘటన లను కల్పిత పాత్రలతో తెరకెక్కించి ఒక అద్భుతమైన సినిమాని దర్శకుడు ఆదిత్య ధర్ అందించారు అని తెలిపారు. అలాగే సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా నిడివి సమస్య తను నోటీస్ చేయలేదని కొన్ని సీన్స్ ని ఎంతో కన్వీనెంట్ గా లెంగ్త్ తో సంబంధం లేకుండా తెరకెక్కించడం ఊహించని విధంగా ఉందని శంకర్ కొనియాడారు. అలాగే శాశ్వత్ దేవ్ సంగీతం కూడా అద్భుతం అని రణ్వీర్ సింగ్ టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ చూడడం ఎంతో ఆనందంగా ఉందని, అలాగే మాధవన్ కూడా తన పెర్ఫార్మన్స్, ఎక్స్ ప్రెషన్స్ తో సాలిడ్ గా కనిపించారు. ఇంకా ముఖ్యంగా ఇందులో నటీనటులు ఎంపిక సినిమాకి మరింత సహజత్వాన్ని తీసుకొచ్చింది అని ఈ సినిమా ఇండియన్ సినిమా దగ్గర ఒక చారిత్రక మూమెంట్ గా నిలుస్తుంది అని శంకర్ ఓ రేంజ్ ఎగ్జైట్ అవుతూ తన రివ్యూ అందించారు.
‘ధురంధర్ 2’ : రణ్వీర్ టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్!
