పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాశి ఖన్నా – శ్రీలీల హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రమే ‘ఉస్తాద్ భగత్ సింగ్’. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఈ ఉగాది కానుకగా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ మాత్రం అభిమానుల్లో మంచి బజ్ ని పెంచింది. ఇక ఈ ట్రైలర్ పై మన టాలీవుడ్ స్టార్స్ నుంచి కూడా ఫీడ్ బ్యాక్ వచ్చింది. మరి లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమా ట్రైలర్ పై తమా స్పందన తెలియజేయడం వైరల్ గా మారింది. మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. ట్రైలర్ అదిరింది.. ఉగాదికి “ఉస్తాద్ భగత్ సింగ్” తో అన్నీ శుభాలే!! అంటూ తన మార్క్ రెస్పాన్స్ తో చిత్ర యూనిట్ కి తన బ్లెస్సింగ్స్ అందించారు. అలాగే రామ్ చరణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ టెర్రిఫిక్ గా ఉంది అని పవన్ కళ్యాణ్ గారు ఫుల్ స్వాగ్ తో ఫెంటాస్టిక్ గా ఉన్నారు. హరీష్ గారికి ఎలా ప్రెజెంట్ చెయ్యాలో బాగా తెలుసు అంటూ పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ లు ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.
ముహూర్తం కుదిరింది.. ట్రైలర్ అదిరింది : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ పై మెగాస్టార్
