ఆనంద చక్రపాణికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్

Best Supporting Actor for Ananda Chakrapani
Spread the love

నటుడు, దర్శకుడు ఆనంద చక్రపాణికి మధ్యప్రదేశ్ లో జరిగిన వింధ్య ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా జాతీయ అవార్డు లభించింది. మొదటిసారిగా చైనా, స్పానిష్ వంటి ఇతర దేశాల భాషలతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళం వంటి ఏడు భాషల్లో ‘పాన్ వరల్డ్’ సినిమాగా విడుదల చేస్తున్న ‘స్వయంభు’ చిత్రంలో గ్రామ అధికారిగా ఆనంద చక్ర పాణి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆనంద చక్రపాణి ఏక కాలంలో దేశంలోని పలు భాషల్లో విడుదల చేస్తున్న ఈ చిత్రంలో గ్రామ అధికారి పాత్ర తనకు ఎంతో పేరు తెచ్చిపెడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసారు. 1500 ఏళ్లనాటి సింహళ దేశం ఇతి వృత్తంతో హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో ఈ సినిమా చిత్రీకరిస్తున్నారు. ఆనంద చక్రపాణి ఇప్పటి వరకు పలు సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించారు.లవ్ స్టోరీ’లో హీరోయిన్ సాయిపల్లవి తండ్రిగా, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో విజయ్ దేవరకొండ తండ్రి పాత్రల్లో, ‘వకీల్ సాబ్’ చిత్రంలో హీరోయిన్ అనన్య నాగళ్ల తండ్రి గా నటించారు. మొదటిసారిగా పాన్ వరల్డ్ చిత్రంలో నటిస్తున్నందున ఎంతో సంతోషంగా ఉందని, ఏప్రిల్ లో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని చక్రపాణి తెలిపారు.

Related posts