మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ మరోసారి బౌండరీస్ ని దాటి ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. ఫలక్‌నుమా దాస్, దాస్ కా ధమ్కీ వంటి చిత్రాలతో హీరో, దర్శకుడు, నిర్మాత, రచయితగా ఆకట్టుకున్న విశ్వక్సేన్ ఇప్పుడు తన స్వీయ రచన, దర్శకత్వంలో ‘కల్ట్’తో రాబోతున్నారు. తారక్ సినిమాస్ బ్యానర్ పై సందీప్ కాకరాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారతీయ సినిమాల్లో తొలి స్లాషర్ జానర్ చిత్రంగా ‘కల్ట్’ వాస్తవ ఘటనల నుంచి ప్రేరణ పొందిన రా, అన్‌కంప్రమైజింగ్ సినిమాటిక్ అనుభూతిని అందించనుంది. రక్తంతో తడిసిన, ఇంటన్ లుక్‌లో విశ్వక్ సేన్ కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే భారీ హైప్ సృష్టించగా, తాజాగా విడుదలైన టీజర్ ఆసక్తిని మరింత పెంచింది. కథ గోవాకు ఎంజాయ్ చేయడానికి వెళ్లిన ఓ ఫ్రెండ్స్ గ్రూప్ చుట్టూ తిరుగుతుంది. స్టాగ్స్ అనే కారణంతో పబ్‌లోకి అనుమతి నిరాకరిస్తారు. అదే సమయంలో వారిలో ఒకరు ప్రత్యేకమైన “కల్ట్ పాస్‌లు” సంపాదించడంతో ఓ ఎక్స్‌క్లూజివ్ పార్టీకి వెళ్లే అవకాశం వస్తుంది. మొదట కలలా అనిపించిన ఆ అనుభవం, పార్టీ హోస్ట్ ప్రారంభించే ప్రాణాంతక ఆటతో ఒక్కసారిగా భయంకరమైన నైట్‌మేర్‌గా మారుతుంది. ఒక్కొక్కరిని హతమారుస్తూ ముందుకు సాగే ఈ కథలో, “గేమ్ మాస్టర్” కథను మరింత మలుపు తిప్పుతాడు. అతను రక్షకుడా? లేక మరింత ప్రమాదకరమైన వ్యక్తా? అనేది ఆసక్తికరం. భారతీయ సినిమాకు కొత్త జానర్‌ని పరిచయం చేస్తూ విశ్వక్ సేన్ స్టైలిష్‌గా ముందుకు వచ్చారు. యూత్‌ఫుల్ సెటప్‌తో మొదలయ్యే కథ, హత్యలు మొదలైన వెంటనే కఠినమైన, రక్తపాతం నిండిన ప్రపంచంలోకి దూసుకెళ్తుంది. రచయితగా, దర్శకుడిగా విశ్వక్ సేన్ తన నైపుణ్యాన్ని మరోసారి చూపించారు. 100 మంది కొత్త నటులతో కూడిన యువతర తారాగణం గొప్ప ఎనర్జీతో కనిపిస్తుంది. కథ చివర్లో విశ్వక్ సేన్ ఎంట్రీ ఇవ్వడం సినిమాకు మరింత బలం చేకూర్చింది. అతని రూత్‌లెస్, ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను మరింతగా ఎలివేట్ చేస్తుంది. విశ్వక్సేన్ అంబిషస్ విజన్‌కు ఒక పవర్‌హౌస్ టెక్నికల్ టీమ్ బలంగా నిలుస్తుంది. డైలాగ్స్‌ను తరుణ్ భాస్కర్ రాస్తుండగా, ఆయనకు ప్రత్యేకమైన షార్ప్ రైటింగ్ ఈ చిత్రానికి సహజత్వాన్ని తెస్తోంది. మ్యూజిక్ కంపోజర్ రవి బస్రూర్ తన ట్రేడ్‌మార్క్ స్టైల్లో ఇంటెన్స్, హై-ఇంపాక్ట్ మ్యూజిక్ అందించారు. సినిమాటోగ్రాఫర్ అర్వింద్ విశ్వనాథన్, ఎడిటర్ రవి తేజ గిరిజాల, ప్రొడక్షన్ డిజైనర్ అర్వింద్ ములే వంటి ప్రతిభావంతులైన టెక్నీషియన్లు కలిసి ఈ చిత్రానికి రిచ్ టెక్స్చర్, గ్రాండ్ స్కేల్‌ను అందిస్తున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ లావిష్‌గా, పాలిష్డ్‌గా కనిపిస్తున్నాయి. గ్లోబల్ అంబిషన్‌తో రూపొందుతున్న ‘కల్ట్’ తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో మల్టీలింగ్వల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. యూనివర్సల్ థీమ్, భారీ స్కేల్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ మాట్లాడుతూ..అందరికీ నమస్తే జనాలు. ఏం కోరుకుంటున్నారు? ఏం మిస్ అవుతున్నారు? ఇవన్నీ నేను గమనిస్తున్నాను. అవన్నీ కలిపికొట్టి ఈ సినిమా తీశాను. పలక్ నామ దాస్ తీయకముందు నాలో ఒక కసి ఆకలి ఉండేది. ఈ సినిమా తీసే ముందు కూడా ముందు కూడా ఆ కసి పదింతలు పెరిగింది. అంత కసిగా ఈ సినిమా తీశాను. ఈ టీజర్ లో మీరు ఏమి చూడలేదు. జస్ట్ చివర్లో ఒక షాట్ పెట్టాను. పిల్లలు, సున్నిత మనస్కులని ఈ సినిమాకి దూరంగా ఉంచండి. అరవింద్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఇచ్చారు. తారక్ అద్భుతంగా పెర్ఫాం చేశాడు. గాయత్రి చాలా ప్రొఫెషనల్. తనకు సినిమా అంటే చాలా పాషన్. ఈ సినిమాకి ఒక కన్ను తరుణ్ భాస్కర్ అయితే మరొక కన్ను రవి బస్రూర్ సార్. ఈ సినిమా సౌండ్ చూసుకున్న తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. మ్యూజిక్ మామలుగా వుండదు. ఆయనకి ఒక చిన్న కానుకగా రోలెక్స్ వాచ్ ని బహుమతిగా ఇస్తున్నాను. ఈ సినిమా కోసం ఆయన ఇచ్చిన మ్యూజిక్ కి జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ సినిమాలో దాదాపు 100 మంది కొత్త నటీనటులు ఉన్నారు. అందరూ కూడా క్యారెక్టర్స్ కి పూర్తి న్యాయం చేశారు. పలక్ నామా కథ చెప్పినప్పుడు నీవే డైరెక్షన్ చేయాలని ప్రోత్సహించాడు తరుణ్ ప్రోత్సహించాడు. ఈ సినిమా కథ విని నివ్వె చేయాలని చెప్పాడు. తను నా బ్లడ్ బ్రదర్. కాలేజీలో రీఓపెనింగ్ సమయానికి సినిమాని మీ ముందుకు తీసుకు వస్తాను. మీ అందరి ప్రేమకి థాంక్యూ సో మచ్.
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఈవెంట్ ని చూస్తుంటే మళ్ళీ కాలేజీకి వచ్చినట్టు అనిపిస్తుంది. సినిమా కోసం విశ్వక్సేన్ ఏది చెప్తే అది విన్నాను .ఈ సినిమా కోసం అందరూ చాలా కష్టపడ్డారు. ఈ సినిమా కల్ట్, రెస్పాన్స్ కల్ట్, కలెక్షన్స్ కల్ట్, విశ్వక్ విషయంలో చాలా ప్రౌడ్ గా ఉంది.
రవి బస్రూర్ మాట్లాడుతూ. కే జి ఎఫ్ కి మీరు ఇచ్చిన ప్రేమకి ధన్యవాదాలు. కల్ట్ విషయంలో విశ్వక్సేన్ కి థాంక్స్ చెప్పాలి. ఆయన నామీద ఎంతో నమ్మకం పెట్టారు. ఈ సినిమాలో మీరు మెస్మరైజింగ్ సౌండ్ వింటారు. నేను చనిపోదామని అనుకున్న సమయంలో ఓ వ్యక్తి నా గురించి తెలిసి కీ-బోర్డ్ కొనుక్కునేందుకు రూ.35వేలు ఇచ్చాడు. అతడి పేరు రవి. అప్పటి నుంచి నా సొంత పేరును తీసేసి రవి బస్రూర్‌గా మార్చుకున్నా. ఇప్పుడు విశ్వక్‌కు థ్యాంక్స్ చెబుతున్నా. 25ఏళ్ల నా కెరీర్‌లో నా సోల్ ని గుర్తుంచారు విశ్వక్. ఇది కేవలం వాచ్ మాత్రమే కాదు సంగీత దర్శకులకు దక్కిన గౌరవం.
డిఓపి అరవింద్ మాట్లాడుతూ.. కల్ట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. విశ్వక్ తో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. కల్ట్ అందరికీ కనెక్ట్ అవుతుంది. మీరు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు’ ఈ వేడుకులో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.
తారాగణం: విశ్వక్‌సేన్, గాయత్రీ భరద్వాజ్, తారక్ పొన్నప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగర్, కార్తికేయ, అనిరుధ్ భాస్కర్, EZY, యజ్ఞ తుర్లపాటి, కబీర్ భారతీయ, విశాక్ నాయర్, చేపూరి వివేక్
సాంకేతిక సిబ్బంది:
రచన, నిర్మాత, దర్శకత్వం: విశ్వక్‌సేన్
నిర్మాత: సందీప్ కాకరాల
బ్యానర్: తారక్ సినిమాస్
లైన్ ప్రొడ్యూసర్: అవినాష్ యార్లగడ్డ
డైలాగ్స్: తరుణ్ భాస్కర్
సంగీతం: రవి బస్రూర్
DOP: అరవింద్ విశ్వనాథన్
ఎడిటర్: రవితేజ గిరిజాల
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మూలే
కొరియోగ్రాఫర్: వశ్వంత్ మాస్టర్
స్టంట్స్: కరుణక్ ఏఆర్, జాషువా
కాస్ట్యూమ్ డిజైనర్: జి అన్నపూర్ణ
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ ‘కల్ట్’ టీజర్
