‘కానిస్టేబుల్‌ కనకం- కాల్ ఘాట్ చాప్టర్ 3’ సూపర్ హిట్ అవుతుంది : దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు

'Constable Kanakam - Call Ghat Chapter 3' will be a super hit: Director K. Raghavendra Rao
Spread the love

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు. మేఘ లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించారు. ఈ సిరీస్ కి వచ్చిన రెండు సీజన్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. తాజాగా మేకర్స్ బిగ్ అనౌన్స్ మెంట్ చేశారు. కానిస్టేబుల్‌ కనకం చాప్టర్ 3 కాల్ ఘాట్ సినిమాగా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే రెండు సీజన్స్ కలిపి థియేటర్స్ లో సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు. కాల్ ఘాట్ చాప్టర్ 3 గ్లింప్స్ ని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్విని దత్ లాంచ్ చేశారు.
బిగ్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ… నేను అశ్విని దత్ కలిసి ఫస్ట్ ప్రిన్స్ మహేష్ బాబుని పరిచయం చేశాం. దానికి సాయిబాబానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. తర్వాత పెళ్లి సందడి గంగోత్రి.. ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేశాం.ఆ విజయాల్లో భాగం సాయిబాబా కి ఈటీవీ కి ఉంది. తన అనుభవాన్ని అంతా కలబోసి కానిస్టేబుల్ కనకం అనే సక్సెస్ఫుల్ ఫిల్మ్ చేశారు. వర్ష చాలా మంచి ఆర్టిస్ట్. తను చాలా బిజీ కాబోతోంది. 30 ఏళ్ల క్రితం శాంతినివాసం సీరియల్ తో ఈటీవీతో మా జర్నీ మొదలైంది. శాంతి నివాసానికి రాజమౌళి డైరెక్టర్. నేను అనుకున్న దాని కంటే అద్భుతంగా తీశాడు. ఈరోజు ఇండియాలోనే అగ్ర దర్శకుడుగా ఉన్నారు. శాంతి నివాసానికి హేమంత్ ఎడిటింగ్ చేశాడు. అప్పటినుంచి మా జర్నీ ఉంది. ఇప్పటి దర్శకుడు చాలా అద్భుతంగా తీస్తున్నారు. ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ కూడా చాలా చక్కగా తీశాడు. సాయి కృష్ణ నితిన్ లక్కీ హాండ్స్. వీళ్ళ కాంబినేషన్స్ అన్ని పిక్చర్స్ బాగుంటాయి. వీళ్ళ సక్సెస్ రేట్ చాలా బాగుంది. సురేష్ చక్కని మ్యూజిక్ అందించాడు. ఈవిన్ కథా సుధాలో ఇప్పటివరకు ఒక పది కథలు తీశాను. వాళ్ళ ప్రోత్సాహం చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. కానిస్టేబుల్ కనకం ప్రతి సీజను బాహుబలి లాగా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. అందరికీ థాంక్ యూ అన్నారు.
నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ.. ఈ యూనిట్ మాకు చాలా కొత్తగా అనిపించింది. తప్పకుండా ఈ విజయ పరంపర ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. అందరికీ థాంక్యు.
వర్షా బొల్లమ్మ మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసి మమ్మల్ని బ్లెస్స్ చేసినరాఘవేంద్రరావు గారికి, నిర్మాత అశ్విని దత్ గారికి థాంక్యూ సో మచ్. వాళ్లు ఇచ్చిన సపోర్టు మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. చాప్టర్ 3 కాల్ ఘాట్ చాలా పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను. చాలామంది నేను పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ చేయాలని అంటుంటారు. కానీ అలాంటి అవకాశాలు సాధారణంగా రావు. నాకు అలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన నిర్మాత సాయిబాబా గారికి హేమంత్ గారికి ఈటీవీ విన్ వారికి మా డైరెక్టర్ ప్రశాంత్ కి చాలా చాలా థాంక్స్. ఈ సిరిస్ చాలా ఎంజాయ్ చేశాను. ఒక నటిగా చాలా సంతృప్తిరించిన సిరిస్ ఇది. రాజీవ్ గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. అందరికీ పేరుపేరునా థాంక్యూ. చాప్టర్ 3 నాకు ఒక సర్ప్రైజ్ నేను కిక్ బాక్సింగ్ నేర్చుకున్నాను. అది ఇందులో హెల్ప్ అవుతుంది అని భావిస్తున్నాను. కానిస్టేబుల్ కనకం కు సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
డైరెక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ.. రాఘవేంద్రరావు గారు అశ్విని దత్ గారు చాలా పాషనేట్ ఫిలిం మేకర్స్.ఈ వేడుకలో వారిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈవిన్ యాజమాన్యానికి ధన్యవాదాలు. మా నిర్మాత సాయిబాబా గారు హేమంత్ గారు ప్రతి విషయంలో సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. కాల్ ఘాట్ చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉండబోతుంది. మీ అందరినీ అలరించబోతోంది.
ఈటీవీ విన్ సాయి కృష్ణ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. కానిస్టేబుల్‌ కనకం రెండు సీజన్లు అద్భుతమైన విజయాన్ని సాధించాయి. చాప్టర్ 3 నేరుగా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నాము. మాకు ఇంతగా ప్రోత్సహించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. బాపినీడు గారి విజన్ వలనే ఇది సాధ్యమైంది. అరుంధతి కంటే పెద్ద స్కేల్ లో చాప్టర్ 3 కాల్ ఘాట్ ని నిర్మిస్తున్నాం. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే రెండు సీజన్స్ ని కలిపి సినిమాగా చేసి ఆ సినిమాని ముందుగా రిలీజ్ చేయబోతున్నాం. దాన్ని కూడా మీరందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను.
రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. పాతికేళ్ళ క్రితం రాఘవేంద్రరావు గారు దత్ ఓకే చేస్తేనే స్టూడెంట్ నెంబర్ వన్ తో సినిమా నటుడుగా పరిచయం అయ్యాను. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వాళ్లిద్దరి ముందు కానిస్టేబుల్ కనకం సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సాయిబాబా హేమంత్ నీ ఇద్దరితో నాకు ఒక ఫ్యామిలీ బాండింగ్ వుంది. ఈటీవీ విన్ వరుస విజయాలని సాధిస్తుంది. అందులో నేను కూడా నేను కూడా భాగమవడం చాలా ఆనందంగా ఉంది.
సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ.. ఈ రెండు సీజన్స్ కి పనిచేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి పేరు వచ్చింది. చాప్టర్ 3 కథ విన్నాను. అదిరిపోయింది. తప్పకుండా మీ అందరికీ అలరిస్తుంది. ఈ వేడుకలో యూనిట్ అందరూ పాల్గొన్నారు.

Related posts