25న ‘బ్యాడ్ గాళ్స్’ వస్తున్నారు

'Bad Girls' is coming out on the 25th
Spread the love

ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ముఖ్య తారాగణం తో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వంలో వస్తున్న మరో ఎంటర్టైనర్ చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. అయితే ఈ చిత్రం క్రిస్మస్ పండుగ కానుకగా ఈనెల 25న విడుదల చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా… ఈ చిత్ర దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి మాట్లాడుతూ “మా ‘బ్యాడ్ గాళ్స్’ పూర్తి ఎంటర్టైనర్ చిత్రం. జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రం మా ‘బ్యాడ్ గాళ్స్’. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మా చిత్రాన్ని క్రిస్మస్ పండుగ కానుకగా 25న విడుదల చేస్తున్నాం. ఇది మంచి ఎంటర్టైనర్ చిత్రం. అనూప్ రూబెన్స్ మంచి సంగీతం అందించగా ఆస్కార్ చంద్ర బోస్ అని పాటలకు లిరిక్స్ అందించారు. పాటలు చాలా బాగా వచ్చాయి. ఇటీవల విడుదల అయినా ‘ఇలా చూసుకుంటానే’ పాటకు మంచి ఆదరణ లభించింది, యూట్యూబ్ లో 6 మిలియన్ వ్యూస్ తో దుసుకుపోతుంది. అలాగే ఇటీవల విడుదల అయినా బాడ్ గర్ల్స్ టైటిల్ సాంగ్ కి మంచి ఆదరణ లభిస్తుంది. మిగతా పాటలు మరియు టీజర్, ట్రైలర్ త్వరలో విడుదల చేస్తాం. ఈనెల25న విడుదల అవుతుంది తప్పక చూడండి” అని తెలిపారు.

Related posts