సంజోష్ తగరం, హర్షిత హీరో హీరోయిన్లుగా జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్ పతాకం పై తెరకెక్కుతోన్న నూతన చిత్రం ‘మై లవ్’. ఈ చిత్రానికి ఐటి & ఇండస్ట్రీస్ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్లాప్ కొట్టగా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కెమెరా స్విచ్ ఆన్ చేస్తూ ఫస్ట్ షార్ట్ కి దర్శకత్వం వహించారు. ఈ సందర్బంగా హీరో & దర్శకుడు సంజోష్ తగరం మాట్లాడుతూ.. ఇది మంచి యూనివర్సల్ కంటెంట్ ఉన్న సినిమా. సినిమా సరికొత్తగా ఉంటుంది ఇలాంటి కంటెంట్ ఇప్పటి వరకు ఎవరూ టచ్ చెయ్యని పాయింట్ తీసుకోవడం జరిగింది. నేటి యువతకు మంచి మెసేజ్ తో పాటు, మంచి సందేశం కూడా ఉంటుంది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. మా కుటుంబ సహకారం మరువలేనిది. ఈ చిత్రంలో మంచి సాహిత్యం విలువలతో కూడిన పాటలు అతి త్వరలో వినబోతున్నారు. దర్శకుడిగా, నటుడుగా, నాకంటూ మంచి గుర్తింపు వస్తుంది అని అన్నారు. ఈ సందర్బంగా నిర్మాత శ్రీనివాస్ రావు మాట్లాడుతూ మంచి కథ మంచి కథనంతో రూపొందుతున్న చిత్రం ఇది. తప్పకుండా అన్ని వర్గాల వారికి నచ్చుతుంది అన్నారు. హీరోయిన్ హర్షిత మాట్లాడుతూ.. సంజోష్ నాకు చెప్పిన పాయింట్ చాలా కొత్తగా వుంది ఈ చిత్రంతో మంచి నటిగా పేరు వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. కోరియాగ్రాఫర్ రవి క్రిష్ణ మాట్లాడుతూ చాలా రోజుల తరువాత మంచి సాహిత్యం విలువలతో కూడిన పాటలకు కొరియోగ్రఫి చేయబోతున్నందుకు చాలా ఆనందంగా వుంది. నా కెరియర్ లో ది బెస్ట్ చిత్రంగా నిలుస్తుంది అన్నారు. ఈ చిత్రానికి సింగల్ కార్డు. కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చిన సంజోస్ గారికి రుణపడి ఉంటానని చెప్పారు. ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో 30 ఇయర్స్ పృధ్వీ, గబ్బర్‌సింగ్ ఆంజనేయలు, రచ్చ రవి,
డీజే టిల్లు మురళీధర్ గౌడ్ , తనికెళ్ళ భరణి, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత : ఆర్.వి శ్రీనివాస్ రావు
కెమెరా : వెంకట్ రాజు, కొరియోగ్రాఫర్. రవి క్రిష్ణ, డైలాగ్స్ సాహిల్, ఆర్ట్ డైరెక్టర్ : వెంకటేష్ గుల్ల, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంజోష్ తగరం
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్లాప్ తో ‘మై లవ్’ ప్రారంభం
