ప్రైవేట్ ఆల్బమ్స్‌తో పేరు తెచ్చుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆ తర్వాత సినిమాల్లో కూడా బిజీ అయ్యారు. నాటు నాటు సాంగ్‌తో ఆస్కార్ స్టేజి మీద కూడా పర్ఫార్మ్ చేసి స్టార్ సింగర్ అయ్యారు. రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల ఆగస్టులో తను ప్రేమించిన అమ్మాయి హరిణ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. రాహుల్ సిప్లిగంజ్ – హరిణ్య రెడ్డి వివాహం నవంబర్ 27న ఘనంగా జరగనుంది. ఈ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా హాజరు కానున్నట్టు సమాచారం. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ తనకు కాబోయే భార్య హరిణ్య రెడ్డితో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.. తన వివాహానికి ఆహ్వానించాడు. సీఎం రేవంత్ రెడ్డి వివాహానికి వస్తాను అని చెప్పినట్లు రాహుల్ సిప్లిగంజ్ తెలిపారు.
సీఎం రేవంత్‌ను కలిసి పెళ్లికి ఆహ్వానించిన రాహుల్ సిప్లిగంజ్
