వైభవంగా బొబ్బల శివాని – బొబ్బల శశాంక్ రెడ్డి గృహ నిర్మాణ భూమి పూజ

Marupaka Sravani in splendor - Bobbala Shashank Reddy's house construction Bhoomi Puja
Marupaka Sravani in splendor - Bobbala Shashank Reddy's house construction Bhoomi Puja
Spread the love

బొబ్బల శివాని- బొబ్బల శశాంక్ రెడ్డిలకు సంబంధించిన గృహ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం గురువారం ఉదయం సంప్రదాయబద్ధంగా శ్రీ వేంకటేశ్వరా స్వామి వారి ఆశీస్సులతో శ్రీరామ్ అయ్యవారి మంత్రోచ్చారణల మధ్య వైభవంగా జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని కేసీఆర్ నగర్ లో జరిగిన ఈ గృహ నిర్మాణ భూమి పూజలో బొబ్బల శశాంక్ రెడ్డి తల్లిదండ్రులైన బొబ్బల అలివేలు మంగ – యాకూబ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొబ్బల శివాని – బొబ్బల శశాంక్ రెడ్డి దంపతులు విదేశాల్లో ఉండడం వల్ల ఈ కార్యక్రమాన్ని వారి తల్లిదండ్రులైన బొబ్బల అలివేలు మంగ – యాకూబ్ రెడ్డిలు స్వయంగా పర్యవేక్షించి భూమి పూజలో పాల్గొన్నారు. బొబ్బల శివాని తల్లిదండ్రులు అనూరాధ-మారుపాక గోవర్ధన్ రెడ్డి. కాగా.. శివాని తల్లి అనూరాధ కూడా కూతురితో పాటు విదేశాల్లో ఉన్నారు. బంధుమిత్రులు కిషోర్ , కిరణ్ , దిలీప్ , సందీప్, పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గృహ నిర్మాణం త్వరలో విజయవంతంగా పూర్తవ్వాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత ఎం.డి. అబ్దుల్, వీరారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ జి. శ్రీనివాసరావు, గిరిరాజ్, మాయ శ్రీనివాస్,బి జె వై ఎం ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి, బిజెపి ఉప్పల్ అసెంబ్లీ అధికార ప్రతినిధి ఇలిటం నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.