మార్చి 21న వస్తున్న “రాజుగారి దొంగలు”

"Raju Gari Dongalu" Releasing on March 21st
Spread the love

లోహిత్ కల్యాణ్, రాజేష్ కుంచాడా, జోషిత్ రాజ్ కుమార్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రాజు గారి దొంగలు. ఈ చిత్రాన్ని నడిమింటి లిఖిత సమర్పణలో హిటాసో ఫిలిం కంపెనీ బ్యానర్ పై నడిమింటి బంగారునాయుడు నిర్మిస్తున్నారు. దర్శకుడు లోకేష్ రనాల్ హిటాసో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 21న ప్రపంచం వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు లోకేష్ రనాల్ హిటాసో మాట్లాడుతూ మంచి వైవిధ్యమైన కథతో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుందని, ఈ నెల 21న మీ ముందుకు తీసుకొస్తున్నామని తెలుగు ప్రేక్షకులందరు ఆదరించాలని అన్నారు.
ఈ చిత్రానికి డీవోపీ – సందీప్ బదుల, ప్రకాష్ రెడ్డి, స్టోరీ రైటర్స్ – సుమంత్ పల్లాటి, సూరాడ బ్రహ్మ విజయ్, మ్యూజిక్ – నాఫల్ రాజా ఏఐఎస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రాజవంశీ, పీఆర్ఓ – చందు రమేష్, బ్యానర్ – హిటాసో ఫిలిం కంపెనీ, సమర్పణ – నడిమింటి లిఖిత, నిర్మాత – నడిమింటి బంగారునాయుడు, దర్శకత్వం – లోకేష్ రనాల్ హిటాసో.

Related posts

Leave a Comment