ఘనంగా “ల్యాంప్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

Grand "Lamp" Movie Pre-Release Event, Set for Theatrical Release on 14th of This Month
Spread the love

వినోద్ నువ్వుల, మధుప్రియ, కోటి కిరణ్, అవంతిక, నాగ్ రజినీరాజ్, నాగేంద్ర సీహెచ్, వైవీ రావు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ల్యాంప్. ఈ చిత్రాన్ని చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్ పై జీవీఎన్ శేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎస్ జనార్థన్ రెడ్డి, పి. నవీన్ కుమార్ రెడ్డి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. రాజశేఖర్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ల్యాంప్ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు నిర్మాత మురళీమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా…
మురళీ మోహన్ మాట్లాడుతూ – ల్యాంప్ సినిమా కంటెంట్ బాగుంది. సినిమా బాగుంటుందనే అనిపిస్తోంది. ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న చిత్రాలకు ఆదరణ లేక చీకటి అలుముకుంది. ఇలాంటి చీకట్లను పోగొట్టి వెలుగు నింపే దీపం ఈ ల్యాంప్ సినిమా కావాలి. సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ – ల్యాంప్ సినిమా విజువల్స్, మేకింగ్ బాగున్నాయి. సినిమా తప్పకుండా మంచి సక్సెస్ కావాలి. చిన్న చిత్రాలు ఆదరణ పొందితేనే కొత్త టాలెంట్ పరిశ్రమకు వస్తుంది. నా బెస్ట్ విశెస్ ల్యాంప్ సినిమా టీమ్ కు అందిస్తున్నా అన్నారు.
నిర్మాత లయన్ సాయివెంకట్ మాట్లాడుతూ – ల్యాంప్ సినిమా గురించి నాకు తెలుసు. ఈ సినిమా గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఒక చిన్న సినిమా మంచి రిలీజ్ కు రావడమే సక్సెస్. ఈ ల్యాంప్ సినిమా థియేటర్స్ లో ప్రేక్షకుల ఆదరణ పొంది…ఈ టీమ్ అందరికీ విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. అన్నారు.
నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ- ల్యాంప్ సినిమా బ్యానర్ లో గతంలో ఏడు చేపల కథ సినిమా వచ్చింది. ఆ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ లాభాలు చూశారు. ఈ ల్యాంప్ సినిమా కూడా అలాగే సక్సెస్ కావాలి. ఈ రోజుల్లో రెండు వారాలు సినిమా ఆడితే సూపర్ హిట్. ఈ మూవీ వారం ప్రదర్శింపబడినా సూపర్ హిట్ అయినట్లే. 150 థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ల్యాంప్ సినిమా ఇప్పటికే సక్సెస్ అయినట్లు అనిపిస్తోంది అన్నారు.
నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ – ఈ రోజు ఇండస్ట్రీలో పెద్ద పొజిషన్ లో ఉన్న దర్శకులు, నిర్మాతలు, నటీనటులు అందరూ చిన్న చిత్రాలతో పరిచయం అయినవారే. ఈ ల్యాంప్ మూవీ నుంచి కూడా ఫ్యూచర్ స్టార్స్ రావాలని కోరుకుంటున్నా. సినిమా కంటెంట్ బాగుంది. మంచి సక్సెస్ అయి చిన్న చిత్రాలకు హుషారు తీసుకురావాలి. అన్నారు.
దర్శకుడు రాజశేఖర్ రాజ్ మాట్లాడుతూ – ల్యాంప్ సినిమా మేకింగ్ లో ఎన్నో కష్టాలు పడ్డాం. చాలాసార్లు ఈ దీపం ఆరిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నో తుఫానులు గాలి వానలు వచ్చాయి. అయినా ఈ మూవీని కాపాడుకుంటూ వచ్చాం. మా మూవీని థియేట్రికల్ గా రిలీజ్ కు తీసుకొస్తుండటం సంతోషంగా ఉంది. ఈరోజు ఇంతమంది పెద్దలు మా మూవీ టీమ్ ను బ్లెస్ చేసేందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు. అన్ని ఎలిమెంట్స్ ఉన్న మంచి కమర్షియల్ మూవీ ల్యాంప్. మీరంతా ఈ నెల 14న థియేటర్స్ లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు.
హీరో వినోద్ నువ్వుల మాట్లాడుతూ – దర్శకుడు రాజ్ నాకు ఈ కథ చెప్పగానే మరో ఆలోచన లేకుండా మూవీ చేస్తానని ఒప్పుకున్నాను. ల్యాంప్ కథ అంత బాగా నచ్చింది. దర్శకులు చెప్పినట్లు ఈ మూవీ షూటింగ్ టైమ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి. అయినా మా మూవీని ఆగకుండా చేసుకుంటూ వచ్చాం. అందుకు మా టీమ్ ఎంతో సపోర్ట్ చేసింది. వారందరికీ థ్యాంక్స్. ఒక మంచి కొత్త కంటెంట్ మూవీ చూడాలనుకునే ప్రేక్షకులు ఈ నెల 14న థియేటర్స్ కు రండి. ల్యాంప్ మూవీ మీ అందరినీ ఆకట్టుకుంటుంది అన్నారు.
నిర్మాత జీవీఎన్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ – మా ల్యాంప్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి బ్లెస్ చేసిన పెద్దలందిరికీ థ్యాంక్స్ చెబుతున్నా. వారు ఎంతో బిజీగా ఉన్నా వచ్చి మా టీమ్ ను సపోర్ట్ చేస్తున్నారు. ల్యాంప్ మూవీ ఒక మంచి ప్రయత్నంగా పేరు తెచ్చుకుంటుంది. మా దర్శకుడు రాజ్ మా సంస్థకు ఒక మంచి సినిమా ఇచ్చారు. మా టీమ్ సపోర్ట్ తో సినిమా బాగా వచ్చింది. థియేటర్స్ లో ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాం. ఈ నెల 14న తప్పకుండా థియేటర్స్ కు వచ్చి మా ల్యాంప్ మూవీ చూడండి అన్నారు.
నటీనటులు – వినోద్ నువ్వుల, మధుప్రియ, కోటి కిరణ్, అవంతిక, నాగ్ రజినీరాజ్, నాగేంద్ర సీహెచ్, వైవీ రావు, తదితరులు
టెక్నికల్ టీమ్:
రచన దర్శకత్వం – రాజశేఖర్ రాజ్
ప్రొడ్యూసర్ – జీవీఎన్ శేఖర్ రెడ్డి
కో ప్రొడ్యూసర్స్ – ఎస్ జనార్థన్ రెడ్డి, పి.నవీన్ కుమార్ రెడ్డి
డీవోపీ – క్రిష్ బొంగొని
ఎడిటర్ – గణేష్ దాసరి
మ్యూజిక్ – శ్రీ వెంకట్
పీఆర్ఓ – ఆర్ కే చౌదరి

Related posts

Leave a Comment