‘గడిచిన జీవితం అంతా చదువు, ఆటలతోనే సరిపోయింది. నిజానికి నా లైఫ్‌లో సరదాలు తక్కువే. చిన్నప్పట్నుంచీ క్రమశిక్షణతోనే పెరిగాను. నాన్న సోల్జర్ కావడంతో ఇల్లాంతా ఆర్మీ వాతావరణమే ఉండేది.’ అంటూ చెప్పుకొచ్చింది మీనాక్షి చౌదరి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి ఆమె మాట్లాడింది. ‘నాన్నకు ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ. అందుకే చిన్నప్పట్నుంచీ నన్ను స్పోర్ట్స్ వైపు నడిపించారు. నేను స్విమ్మింగ్, బ్యాట్మింటన్‌లో స్టేట్ లెవల్ ప్లేయర్‌ని. నా ఫిజిక్ ఫిట్‌గా ఉండటానికి కారణం అదే. నాన్న ద్వారా అబ్బిన ప్రపంచజ్ఞానం నన్ను మిస్ ఇండియాగా నిలబెట్టింది. హీరోయిన్ అవుతానని మాత్రం అస్సలు అనుకోలేదు. ఓ విధంగా ఇదంతా మా నాన్న ఆశీర్వాదం’ అంటూ ఆనందం వెలిబుచ్చింది మీనాక్షి చౌదరి. వెంకటేశ్‌కి జోడీగా ఆమె నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే.
Related posts
-
చిత్ర పరిశ్రమ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా.. చలన చిత్ర అభివృద్ధి సంస్థ నూతన చైర్మన్ దిల్ రాజ్
Spread the love రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వి. వెంకట రమణ రెడ్డి @ దిల్ రాజు బుధవారం... -
అత్యంత ఘనంగా ‘నాగన్న’ మూవీ ట్రైలర్ విడుదల
Spread the love చాందిని క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ కుమార్ హీరోగా, చిత్రం శ్రీను ప్రధాన పాత్రలో నెక్కింటి నాగరాజు నిర్మిస్తున్న... -
జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్
Spread the love మైండ్ బ్లోయింగ్ యాక్షన్ డ్రామా, క్రావెన్: ది హంటర్ ఇంకో రెండు వారాల్లో థియేటర్లలో విడుదల కానుంది....