తగ్గిన ‘పుష్ప-2’ టికెట్‌ ధరలు

'Pushpa-2' ticket prices reduced
Spread the love

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన రీసెంట్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘పుష్ప2: ది రూల్‌’. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం అని తేడా లేకుండా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ సునామీ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కేవలం 3 రోజుల్లో ఈ చిత్రం రూ.600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా టికెట్‌ రేట్లకు సంబంధించి మూవీ ప్రేక్షకుల నుంచి నెగిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. బెనిఫిట్‌ షో టికెట్‌నే రూ.1250గా పెట్టిన చిత్రబృందం విడుదలైన తర్వాత టికెట్‌ రేట్లను సింగిల్‌ స్క్రీన్‌లో రూ.350గా.. మల్టీప్లెక్స్‌లో రూ.550గా పెట్టింది. దీంతో సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాకు చాలా దూరమయ్యారు. ముఖ్యంగా ఒక ఫ్యామిలీ నుంచి నలుగురు ఈ సినిమాకి వెళ్లాలి అంటే సింగిల్‌ స్క్రీన్‌లో రూ.1380 అవ్వనుండగా.. మల్టీప్లెక్స్‌లో రూ.2120లు కానుంది. దీంతో టికెట్‌ ధరలు మూవీపై చాలా ఎఫెక్ట్‌ పడ్డాయి. సోషల్‌ మీడియాలో అయితే టికెట్‌ ధరలపై సెటైర్లు , ట్రోలింగ్‌ ఓ రేంజ్‌లో జరిగింది. ఈ నేపథ్యంలో పుష్ప నిర్మాతలు దిగొచ్చారు. సోమవారం నుంచి ఈ సినిమా టికెట్‌ ధరలు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ఇక తగ్గిన ధరల బట్టి చూసుకుంటే.. సింగిల్‌ స్క్రీన్‌లో రూ.200 ఉండగా.. మల్టీప్లెక్స్‌లో రూ.350గా ఉంది. దీంతో అల్లు అర్జున్‌ అభిమానులు సంబరపడుతున్నారు. ఇప్పటి వరకు టికెట్‌ ధరలు చూసి భయపడ్డ ప్రేక్షకులు ఇకపై థియేటర్‌కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related posts

Leave a Comment