ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన డెమొక్రాటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక మాజీ అధ్యక్షుడు గౌరవనీయులైన శ్రీ. మైత్రిపాల సిరిసేన డాక్టర్ కలశ నాయుడిని ఆసియా ఐకాన్ 2024గా సత్కరించారు.
ఇరుగు పొరుగుతో ఎన్ని ఘర్షణలున్నాఇంటి సరిహద్దులు మార్చుకోలేము. అందుకే సరిహద్దు వివాదాలను ప్రేమ, స్నేహానుబంధాల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవడం సాధ్యమని ఇండియా పాకిస్థాన్ సరిహద్దు వివాదాలపై భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ చేసిన వ్యాఖ్యలు నేటికీ ప్రపంచదేశాలకు ఆదర్శప్రాయమే. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయ్ ఆశయాలను, సూచనలను అక్షరాలా అమలు చేస్తోంది చిన్నారి కలశనాయుడు. సామాజిక సేవతో ప్రపంచ దేశాల మధ్య స్నేహ సౌరభాలను పూయిస్తున్న పదకొండేళ్ల ఆ చిన్నారి డా. కలశనాయుడు ఆసియా ఐకాన్ 2024 అవార్డును సొంతం చేసుకుంది.
వివాదాల పరిష్కారం కోసం ప్రారంభించే యుద్ధం రక్త పాతం సృష్టిస్తుంది తప్ప మనుషుల మధ్య ప్రేమాభిమానాలను పెంచదు. రక్తపాతం మనుషులను దూరం చేస్తే, సేవ ద్వారా శత్రువులను కూడా స్నేహితులుగా మార్చుకోవచ్చని ఆ చిన్నారి రుజువు చేసింది. కలశ పుట్టిన సంవత్సరంలోనే ఆమె తల్లిదండ్రులు కలశ ఫౌండేషన్‌ను ప్రారంభించి సామాజిక సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. తల్లిదండ్రులు చేస్తున్న సేవలపై ముక్కుపచ్చలారని పసి వయసులోనే ఆకర్షితురాలైన కలశ నాయుడు ఆ కలశ ఫౌండేషన్ ద్వారా తన సేవలను విస్తృత పరిచింది. తల్లిదండ్రులు ప్రారంభించిన ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను జిల్లా స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. పలు అంతర్జాతీయ సేవా సంస్థలతో కలిసి కలశ ఫౌండేషన్ ద్వారా సుమారు 135 దేశాల్లో కలశనాయుడు సేవలను అందిస్తున్నారు. పదకొండేళ్ల ఈ చిన్నారి పది సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఆ చిన్నారి నిబద్దతకు నిదర్శనమని పలువురు ప్రశంసిస్తున్నారు. అతిచిన్న వయస్సు సామాజిక సేవకురాలిగా గౌరవ డాక్టరేట్ అందుకున్న కలశనాయుడు ఇటీవల మరో గొప్ప అచీవ్‌మెంట్ సాధించారు. సోషల్ సర్వీస్ కేటగిరిలో ఆసియా ఐకాన్ 2024 అవార్డును అందుకున్న అతిచిన్న వయస్కురాలిగా డా. కలశ నాయుడు మరో సరికొత్త రికార్డు నెలకొల్పారు. శ్రీలంక రాజధాని కొలంబోలో ఈనెల 26, 27 తేదీల్లో నిర్వహించిన ఆసియా ఐకాన్ అవార్డు 2024 కార్యక్రమంలో కొలంబో గవర్నర్ సెంథిల్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీలంక మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన విశిష్ట వ్యక్తులు పాల్గొన్నారు.
గ్రేట్ బ్రిటన్‌లో గౌరవ డాక్టరేట్.. ఆసియా ఐకాన్ 2024 డా. కలశనాయుడు
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన డెమొక్రాటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక మాజీ అధ్యక్షుడు గౌరవనీయులైన శ్రీ. మైత్రిపాల సిరిసేన డాక్టర్ కలశ నాయుడిని ఆసియా ఐకాన్ 2024గా సత్కరించారు.
గ్రేట్ బ్రిటన్ .. అత్యున్నత ప్రజాస్వామ్య విలువలు కలిగిన దేశం. పైగా, ఆ దేశ పార్లమెంటు భవనానికి ప్రపంచదేశాల్లోనే విశిష్ట స్థానముంది. అందుకే, ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా బ్రిటన్‌లో పర్యటించి ఆ దేశ పార్లమెంటు భవనాన్ని దూరం నుండైనా చూడాలని ఆశపడతారు. రాజకీయ, ఆర్థిక, కళా, సాంస్కృతిక, సాంకేతిక, సినిమా వంటి విభిన్న రంగాల సెలబ్రెటీలకు సైతం అంత ఈజీగా ఆ భవనంలోకి ప్రవేశించడం సాధ్యం కాదు. కానీ, ఇండియాకు చెందిన 11 సంవత్సరాల చిన్నారికి మాత్రం ఆ భవనంలోకి సాదర ఆహ్వానంతో పాటు అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ మంత్రులు, ప్రజాప్రతినిధుల సాదర స్వాగతాల మధ్య పార్లమెంటు భవనంలోకి ప్రత్యేక ఆహ్వానితురాలిగా అడుగుపెట్టింది. అతిరథ మహారథులైన వారి సమక్షంలో గ్లోబల్లీ ది యంగెస్ట్ సోషల్ వర్కర్ బిరుదుతో పాటు గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని అందుకుంది. అంతేకాదు బ్రిటన్ పార్లమెంటేరియన్ల ఎదుట రెండు నిమిషాల పాటు ప్రసంగించింది. అత్యంత అరుదైన ఆ అవకాశం అందుకున్న చిన్నారి మరెవరో కాదు కలశ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. కలశ నాయుడు.
కలశ ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న కలశనాయుడు సేవలను గుర్తించి గ్లోబల్లీ ది యంగెస్ట్ సోషల్ వర్కర్ బిరుదుతో పాటు గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది యుఎన్‌జిపిసి సంస్థ. కలశ ఫౌండేషన్ తరపున నిరంతరం సాటి మనుషులకు సేవ చేయడంలో అంకితభావం, కరుణ, మానవతా దయార్థ్ర హృదయం కనబరుస్తోన్న చిన్నారి కలశ నాయుడును యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంటర్నేషనల్ యూనివర్శిటీ మరియు యుఎన్ జిపిసి సంయుక్తంగా సత్కరించాయి.
బ్రిటన్ పార్లమెంటు భవనంలోకి ఒక్కసారి అడుగు పెట్టనిస్తే అదృష్టమని భావించే చోటుకు కలశనాయుడు అత్యంత గౌరవ మర్యాదలతో ఘనమైన సాదర స్వాగతాన్ని అందుకుంది. లండన్ పార్లమెంట్ భవనంలోని ది ప్యాలెస్ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో గ్లోబల్లీ యంగెస్ట్ సోషల్ వర్కర్ బిరుదుతో పాటు పదకొండేళ్ల చిరుప్రాయంలోనే సామాజికసేవా రంగంలో గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని అందుకుంది. ఈ సందర్భంగా కలశనాయుడు చేసిన ప్రసంగానికి రాజకీయ ఉద్ధండులైన ఆ దేశ మంత్రులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, విమర్శకులు సైతం ఆశ్చర్య పోయారు. అత్యంత అరుదైన ఈ సత్కార కార్యక్రమానికి హాజరు కాలేక పోయినందుకు అప్పటి బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ ఆవేదన వ్యక్తం చేయడం కలశనాయుడుకు దక్కిన అపురూప గౌరవం.
అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, పురస్కారాలు పొందిన డా. కలశ నాయుడుకు మరో అవార్డు లభించింది. సోషల్ వర్క్‌లో కలశనాయుడు కృషికి ఆసియా ఐకాన్ అవార్డు 2024 దక్కింది. ఈ నెల 26, 27 తేదీల్లో శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన ఆసియా ఐకాన్ అవార్డ్స్ 2024 కార్యక్రమంలో డా. కలశనాయుడు ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీలంక కేబినెట్ మంత్రులు, కొలంబో గవర్నర్ సెంథిల్ పాల్గొన్నారు.
ఆసియా ఐకాన్ మన తెలుగమ్మాయి .. డా. కలశ నాయుడుకు ఆసియా ఐకాన్ 2024 అవార్డు
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన డెమొక్రాటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక మాజీ అధ్యక్షుడు గౌరవనీయులైన శ్రీ. మైత్రిపాల సిరిసేన డాక్టర్ కలశ నాయుడిని ఆసియా ఐకాన్ 2024గా సత్కరించారు.
ఆసియా ఖండంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా భావించే ఆసియా ఐకాన్ 2024 అవార్డును మన తెలుగుమ్మాయి గెలుచుకుంది. సోషల్ సర్వీస్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 ఏళ్ల చిన్నారి డా. కలశనాయుడు ఆసియా ఐకాన్ అవార్డు 2024ను అందుకున్నారు. కలశ ఫౌండేషన్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో కలశనాయుడు చేస్తున్న సామాజిక సేవాకార్యక్రమాలకు గాను ఈ అవార్డు లభించింది. శ్రీలంక రాజధాని కొలంబోలో ఈనెల 26, 27 తేదీల్లో జరిగిన ఆసియా ఐకాన్ అవార్డ్ ప్రదానోత్సవ కార్యక్రమంలో కలశనాయుడు ఈ అవార్డు అందుకున్నారు. కొలంబో గవర్నర్ సెంథిల్ చేతుల మీదగా కలశనాయుడు ఈ అవార్డు స్వీకరించారు.
ఆసియా ఖండంలో వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన వ్యక్తులు, సంస్థలు, కంపెనీలకు ఈ అవార్డులను ప్రతి ఏటా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు కోసం ఆసియాలోని ప్రతి దేశం నుండి అన్ని కేటగిరీలకూ ఎంతోమంది ప్రతిభావంతులు పోటీ పడతారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వాణిజ్యంతో పాటు , అన్ని రకాల వృత్తులు, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ తో పాటు వివిధ రకాల కేటగిరీలతో పాటు సోషల్ సర్వీస్ కేటగిరీ కూడా ఉంది. ఈ అవార్డు కోసం వ్యక్తులు ఇండిపెండెంట్‌గా నైనా, కంపెనీలు, సంస్థల తరపున కానీ నామినేషన్ పంపవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన ఆ నామినేషన్లను కమిటీ స్క్రూటినీ చేసి విజేతలను ఎంపిక చేస్తుంది. అవార్డు విన్నర్స్‌కు సర్టిఫికెట్, మెడల్‌తో పాటు ప్రశంసాపత్రాన్ని కూడా అందచేస్తుంది. అంతేకాదు ఆసియా ఐకాన్ అవార్డు విజేతలకు ప్రచారం కల్పించడంతో పాటు వారినీ భాగస్వాములను చేస్తుంది.
సోషల్ సర్వీస్ కేటగిరీలో ఆసియా ఐకాన్ అవార్డు 2024 కోసం ఎంతో మంది పోటీ పడినా అవార్డు మాత్రం 11 ఏళ్ల చిన్నారి డా. కలశనాయుడునే వరించింది. అంతేకాదు, ఈ అవార్డు ద్వారా చిన్నారి కలశ రెండు రికార్డులను నెలకొల్పింది. ఒకటి అతి చిన్న వయస్సులో సోషల్ సర్వీస్ కేటగిరిలో అవార్డు సాధించడం, రెండోది ఆసియా ఐకాన్ అవార్డు దక్కించుకున్న మొట్టమొదటి ఇండియన్ అందులోనూ తెలుగమ్మాయి కావడం.
ఆంధ్రప్రదేశ్‌లో పుట్టినా కలశ అక్షరాభ్యాసం హైదరాబాద్‌లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రైమరీ తరగతులు చదువుకుంది. ప్రస్తుతం లండన్‌లో సెకండరీ ఎడ్యుకేషన్ చదువుతోంది. సమాజం పట్ల తనకున్న ప్రేమను సేవా కార్యక్రమాల ద్వారా చాటి చెబుతోన్న కలశనాయుడుకు పదకొండేళ్ల వయసులోనే అరుదైన గౌరవం లభించింది. 11 ఏళ్ల కలశనాయుడును యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంటర్నేషనల్ యూనివర్శిటీ మరియు యుఎన్ జిపిసి సంయుక్తంగా గౌరవ డాక్టరేట్‌తో సత్కరించాయి. గ్లోబల్లీ యంగెస్ట్ సోషల్ వర్కర్ గా గుర్తించాయి. డా. కలశనాయుడు సేవారంగంలోనే కాదు చదువుల్లోనూ అపర సరస్వతీ దేవి. ఏమాత్రం తొట్రుపాటు లేకుండా అనర్గళంగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ, స్పానిష్ తో పాటు ఫ్రెంచ్ భాషలో కూడా మాట్లాడుతుంది. అంతేనా క్లాసికల్ సంగీతంలో అద్భుతంగా పాటలు పాడుతుంది. వీటితో పాటు చెస్, రూబిక్స్ ఆడతుంది. సూకర్ ప్లేయర్, ఈత కొట్టడంలో కలశనాయుడుతో పోటీ పడగల గజ ఈతగాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. 128 యోగాసనాలను అద్భుతంగా వేస్తోంది. సమాజం పట్ల అమితమైన ప్రేమ, బాధ్యత, భారతీయ శాస్త్రీయ కళల పట్ల మక్కువ, చదువులు, ఆటపాటల్లో మేటి , అందునా తెలుగమ్మాయి డా. కలశనాయుడుకు ఆసియా ఐకాన్ అవార్డు 2024 రావడం మనందరికీ గర్వకారణం.
యంగెస్ట్ సోషల్ వర్కర్‌కు ‘ఆసియా ఐకాన్ 2024’ అవార్డు
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన డెమొక్రాటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక మాజీ అధ్యక్షుడు గౌరవనీయులైన శ్రీ. మైత్రిపాల సిరిసేన డాక్టర్ కలశ నాయుడిని ఆసియా ఐకాన్ 2024గా సత్కరించారు.
కొలంబోలో అవార్డు తీసుకున్న డా. కలశనాయుడు మేడపురెడ్డి ప్రపంచంలోని అతి చిన్న వయస్కురాలైన సోషల్ వర్కర్ డా. కలశనాయుడు ఇప్పుడు ఆసియా ఐకాన్ గా మారారు. సోషల్ సర్వీస్ రంగంలో కలశనాయుడు చేస్తున్న సేవలకు గాను ఆ చిన్నారిని ఆసియా ఐకాన్ అవార్డు 2024 వరించింది. శ్రీలంక రాజధాని కొలంబోలో ఈనెల 26, 27 తేదీల్లో రెండు రోజుల పాటు అట్టహాసంగా జరిగిన ఆసియా ఐకాన్ అవార్డ్స్ 2024 ప్రదానోత్సవ కార్యక్రమంలో డా. కలశనాయుడు అవార్డును స్వీకరించారు. కొలంబో గవర్నర్ సెంథిల్ చేతుల మీదగా డా. కలశనాయుడు ఆసియా ఐకాన్ 2024 అవార్డును తీసుకున్నారు. ఈ సందర్భంగా కలశనాయుడును వేదికపై ఉన్న ఆహుతులు ప్రశంసలతో ముంచెత్తారు. అతి చిన్న వయసులోనే అకుంఠిత సేవాభావంతో పని చేస్తున్న కలశనాయుడునేటి తరానికి ఆదర్శమని అభినందించారు. అంతేకాదు 11 ఏళ్ల ఆ చిన్నారి సాధించిన విజయాలు, అవార్డులు, రివార్డుల గురించి తెలిసి ఆశ్చర్య పోయారు. ఐక్యరాజ్యసమితి కలశనాయుడును గ్లోబల్ యంగెస్ట్ సోషల్ వర్కర్ బిరుదుతో సత్కరించడం, సేవారంగంలో ఆ చిన్నారి చేసిన సేవలకు గాను యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ గౌరవ డాక్టరేట్‌తో సన్మానించడం ఆసియా ఖండానికే గర్వకారణమని అన్నారు.
కలశ ఫౌండేషన్ ద్వారా డా. కలశనాయుడు ప్రపంచవ్యాప్తంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో 2013, ఆగస్ట్ 30న ప్రారంభమైన కలశ ఫౌండేషన్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా జిల్లాలు, రాష్ట్రాలు, దేశం కూడా దాటి అంతర్జాతీయంగా సేవాకార్యక్రమాలను నిర్వహిస్తోంది. సమాజ సేవే పరమావధిగా ఎన్నో ఉన్నతాశయాలతో కలశ తండ్రి డాక్టర్. నూతననాయుడు మేడపురెడ్డి ఈ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. కలశ పుట్టిన క్షణంలోనే ఫౌండేషన్ ప్రారంభించిన డా. నూతననాయుడు పాప పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. సేవా కార్యక్రమాలతో పాటు పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తింపు ప్రతి ఏటా కలశ అవార్డులు కూడా ప్రదానం చేస్తున్నారు.
తండ్రి స్థాపించిన ఫౌండేషన్ ఆశయాలను ఐదేళ్లకే అర్థం చేసుకున్న చిన్నారి కలశనాయుడు తాను కూడా అందులో భాగమైంది. ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను నూతన నాయుడు రాష్ట్రస్థాయిలో నిర్వహించగా, ఆ స్ఫూర్తితో ఆ కార్యక్రమాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు కలశనాయుడు. ప్రస్తుతం కలశ ఫౌండేషన్ ద్వారా సుమారు 135 దేశాల్లో సేవా కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతున్నాయి. స్థానిక స్వచ్ఛంధ సంస్థలు, వ్యక్తుల పరస్పర సహకారంతో కలశనాయుడు తన ఫౌండేషన్ కార్యకలాపాలను విస్త్రతం చేస్తోంది. తల్లిదండ్రులు డా. ప్రియా నాయుడు, డా. నూతన నాయుడు గైడెన్స్‌తో కలశ ఫౌండేషన్ ద్వారా సమాజసేవ చేస్తున్న డా. కలశనాయుడుకు అభినందనలు.