తెలంగాణ ఫిలింఛాంబర్ అధ్యక్షుడిగా 6వ సారి ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రతాని రామకృష్ణ గౌడ్

Pratani Ramakrishna Goud was unanimously elected as the President of Telangana Film Chamber for the 6th time
Spread the love

తెలంగాణ ఫిలింఛాంబర్ ఎన్నికలు తాజాగా జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ప్రతాని రామకృష్ణ గౌడ్. ఆయన తెలంగాణ ఫిలింఛాంబర్ అధ్యక్షుడిగా వరుసగా ఆరోసారి బాధ్యతలు చేపడుతున్నారు. 16 వేల మంది ఈ అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ ఫిలింఛాంబర్ ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా..
తెలంగాణ ఫిలింఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – తెలంగాణ ఫిలింఛాంబర్ ఏర్పాటు చేసి 12 ఏళ్లవుతోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేను ఆరోసారి వరుసగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. నాపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు. రెండేళ్లు ఈ పదవీ కాలం. ఈ రెండేళ్లలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మొత్తం 24 క్రాప్టుల్లో కలిపి తెలంగాణ ఫిలింఛాంబర్ లో 16వేల మంది ఉన్నారు. నిర్మాతలే వెయ్యి మంది ఉన్నారు. ఇప్పటిదాకా మా అసోసియేషన్ నుంచి 200కు పైచిలుకు సినిమాలు సెన్సార్ అయ్యాయి. ఈ ఏడాది 70 సినిమాలు సెన్సార్ చేశాం. సినిమా ఔట్ డోర్ షూటింగ్ ల సమయంలో యూనిట్ సభ్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు, చిన్న చిత్రాలకు రాయితీలు వంటివి ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. నాతో పాటు వివిధ పోస్టులకు ఎన్నికైన నా మిత్రులకు శుభాకాంక్షలు చెబుతున్నా అన్నారు.
ఉపాధ్యక్షుడు డి. కోటేశ్వరరావు మాట్లాడుతూ – తెలంగాణ ఫిలింఛాంబర్ కు ఉపాధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కల్పించిన సభ్యులకు, తన పూర్తి సహకారం మాకు అందిస్తున్న ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. వచ్చే రెండేళ్లలో మంచి కార్యక్రమాలు మా సభ్యుల కోసం చేపట్టబోతున్నాం. మాకు పర్మినెంట్ ఆఫీస్, విద్యార్థులకు స్కాలర్ షిప్ లు వంటి వాటి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవనున్నాం. అలాగే సీరియల్స్, సినిమాల్లో తెలంగాణ నటీనటులకు, టెక్నిషియన్స్ కు అ‌కాశాలు వచ్చేలా మా వంతు ప్రయత్నం చేస్తాం. అన్నారు.

సెక్రటరీస్ విద్యాసాగర్, కాచం సత్యనారాయణ మాట్లాడుతూ – తెలంగాణ ఫిలింఛాంబర్ కు సెక్రటరీగా ఎన్నికవడం సంతోషంగా ఉంది. మాకు సపోర్ట్ గా నిలబడిన ప్రతి ఒక్క సభ్యుడికి థ్యాంక్స్ చెబుతున్నాం. మా అసోసియేషన్ మెంబర్స్ సినిమాలకు సెన్సార్ సమస్యలు వచ్చినప్పుడు వాళ్లతో పాటు వెళ్లి సమస్యలు పరిష్కరించాం. అలాగే నెంబర్ వన్ అసోసియేషన్ గా తెలంగాణ ఫిలింఛాంబర్ ను భవిష్యత్ లో తీర్చిదిద్దుతాం అన్నారు.
టీ మా ప్రెసిడెంట్ రశ్మి ఠాకూర్ మాట్లాడుతూ – తెలంగాణ ఫిలింఛాంబర్ లో ఏకగ్రీవంగా ఇదే కమిటీని ఎన్నుకోవడం ఇది వరుసగా మూడోసారి. దీంతోనే మా అసోసియేషన్ లో ఎంత ఐక్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. కోవిడ్ టైమ్ లో రామకృష్ణ గౌడ్ గారు ఎంతోమందికి హెల్ప్ చేశారు. ఇకపైనా మా సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా హెల్ప్ చేసేందుకు ఈ కమిటీ సిద్ధంగా ఉంటుంది. అన్నారు.
టి. మా సెక్రటరీ స్నిగ్ధ మాట్లాడుతూ సెక్రెటరీ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ్యలందరికి కృతజ్ఞతలు. అవకాశం కల్పించిన మా తెలంగాణ ఛాంబర్ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ గారికి థాంక్స్ అన్నారు.
కె.ఎల్.ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ నేను టీ మా వైస్ చైర్మన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది కారకులైన డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి అలాగే మెంబర్స్ అందరికీ చాలా చాలా థాంక్స్. తప్పకుండా ఆర్టిస్ట్ అసోసియేషన్ అలాగే ఛాంబర్ డెవలప్మెంట్ కోసం మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అలాగే మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని కలిసి తప్పకుండా ప్రభుత్వ సహకారం తీసుకోవడానికి చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారితో వెళ్లి ప్రభుత్వ సహకారం తీసుకొని చాంబర్ డెవలప్మెంట్ కు తప్పకుండా కృషి చేస్తాను అన్నారు.
ఫైట్ మాస్టర్ రవి మాట్లాడుతూ కొత్తగా ఫైట్ మాస్టర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి ధన్యవాదాలు. నన్ను చైర్మన్ గా, కన్నా గౌడ్ గారిని సెక్రెటరీగా, కృష్ణ గారిని ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేశారు. నూట ఎనిమిది దేశాలలో నాంచాక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన రవి ఫైట్ మాస్టర్. కరాటేకు సంబంధించి హీరో సుమన్ గారు కూడా మాకు పూర్తి సహకారం అందిస్తారు. వారికి కూడా ఈ సందర్భంగా థాంక్స్ చెప్తున్నాను. అలాగే డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి కూడా చాలా చాలా థాంక్స్ అన్నారు.
తెలంగాణ ఫిలింఛాంబర్ ఉపాధ్యక్షులుగా ఏ గురురాజ్, డి.కోటేశ్వరరావు, జి. వరప్రసాద్ ఎన్నికయ్యారు.జనరల్ సెక్రెటరీస్ గా జె.వి.ఆర్, విద్యాసాగర్, కాచం సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రెటరీస్ గా పినిశెట్టి అశోక్ కుమార్, పి. వరప్రసాద్ రావ్, వై.శ్రీనివాసరావు జాయింట్ సెక్రటరీస్ గా సోమిరెడ్డి, ఎం. బిందు, ట్రెజరర్ గా డా.పి ప్రకాష్ ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ గా 12 మంది ఎన్నికయ్యారు. అలాగే టి. మా ప్రెసిడెంట్ గా రేష్మి ఠాగూర్, వైస్ ప్రెసిడెంట్స్ గా కె.ఎల్.ఎన్. ప్రసాద్, బి. కిషోర్ తేజ, ఎన్. లక్మి సామ్రాజ్యం, జనరల్ సెక్రటరీస్ గా ఎస్. స్నిగ్ధ మద్వాని, బి. రమేష్ యాదవ్, జాయింట్ సెక్రటరీస్ గా ఎల్. వెంకన్న, బి. ప్రేమ సాగర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీస్ గా డా.ఆకుల రమేష్, చింతల శ్రీ శ్రీనివాస్, ఈసి మెంబర్ గా జి. సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఇంకా తెలంగాణ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గా డా. టి రమేష్ నాయుడు, డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గా ఎస్. వంశీ ప్రతాప్ గౌడ్, ఫైట్ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గా వి. రవి, తెలంగాణ ఫిల్మ్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గా జి. రాజ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఈసీ మెంబెర్స్, మరియు ఛాంబర్ సభ్యులు పాల్గొన్నారు. త్వరలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు.

Related posts

Leave a Comment