వెబ్‌ సీరిస్‌లపై సమంత దృష్టి!

Samantha's focus on web series!
Spread the love

కప్పుడు వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద అలరించిన సమంత ఇప్పుడు ఓటీటీ వేదికగానూ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే ‘ఫ్యామిలీమెన్‌ 2’లో ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఇప్పుడు మరో సరికొత్త సిరీస్‌లోనూ సమంత నటించడానికి సిద్ధమయ్యారు. రాజ్‌ అండ్‌ డీకే సారథ్యంలో రూపొందబోయే పీరియాడిక్‌ ఫాంటసీ సిరీస్‌లో సమంత నటించబోతున్నారట. ఆదిత్య రాయ్‌కపూర్‌, వామికా గబ్బీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘తుంబాద్‌’ వంటి మిస్టీరియస్‌ థ్రిల్లర్‌ తీసిన రాహి అనిల్‌ బార్వి దీనికి దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ప్లిక్స్‌ వెల్లడించనుంది. ఇప్పటివరకూ భారతీయ సినిమా తెరపై రాని సరికొత్త కథాంశంతో ఈ సిరీస్‌ను తీయబోతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. సిరీస్‌ చూస్తున్న ప్రేక్షకుడిని మరో సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్తుందట. మోసం, నమ్మకద్రోహం, ప్రేమ, త్యాగం ఇలా అన్ని అంశాలను మేళవించిన కథతో దీన్ని తీర్చిదిద్దుతున్నారు. తొలుత దీన్ని సినిమాగా తీయాలనుకున్నా, తెరపై ఆవిష్కరించే అంశాలు ఎక్కువగా ఉండటంతో వెబ్‌సిరీస్‌గా మలిచారు. ఆదిత్యరాయ్‌ కపూర్‌కు ఇది రెండో వెబ్‌సిరీస్‌ ఆయన నటించిన ’ది న్కెట్‌ మేనేజర్‌’ డిస్నీహాట్‌స్టార్‌ వేదికగా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక సమంత రాజ్‌ డీకే దర్శకత్వంలో ’సిటాడెల్‌: హనీ బన్నీ’లో నటిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకొంటోంది. వావిరీ గబ్బీకి ఇది ఐదో వెబ్‌సిరీస్‌. రాజ్‌ అండ్‌ డీకేల విషయానికొస్తే నెట్‌ప్లిక్స్‌ కోసం వాళ్లు చేసిన ’గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’ పర్వాలేదనిపించింది. ప్రస్తుతం ’ఫ్యామిలీమెన్‌ 3’ చేస్తున్నారు. ఇది అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

Related posts

Leave a Comment