స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తి అల్లు అర్జున్‌ : బన్నీ వాసు భావోద్వేగం

Allu Arjun is the person who brings friendship to life: Bunny Vasu is emotional
Spread the love

స్నేహితుడికి అవసరం ఉందంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా అల్లు అర్జున్‌ అండగా ఉంటారని నిర్మాత బన్నీ వాసు అన్నారు. ‘ఆయ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. అల్లు అర్జున్‌తో తనకున్న స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. ‘నాకు కష్టం వచ్చిందంటే ఇద్దరు వ్యక్తులు ఎప్పుడూ మందుంటారు. వాళ్లలో ఒకరు మా అమ్మ అయితే.. రెండో వ్యక్తి నా స్నేహితుడు అల్లు అర్జున్‌. ‘ఆయ్‌’ సినిమా ప్రచారం సరిగ్గా జరగడంలేదని.. బన్నీని పోస్ట్‌ పెట్టమని అడగాలని మా టీమ్‌ వాళ్లు కోరారు. కానీ, నేను ఆయన్ను అడగలేదు. నేను సమాచారం ఇవ్వకుండానే ఆయనే తన ఎక్స్‌లో ఈ చిత్రం గురించి పోస్ట్‌ చేశారు. నాకు అవసరం ఉన్న ప్రతిసారి ఆయన ముందుండి నడిపిస్తారు. ఒక స్నేహితుడికి కష్టమొస్తే.. తనకు ఎలా సపోర్ట్‌ చేయాలని తెలిసిన ఏకైక వ్యక్తి నా దృష్టిలో అల్లు అర్జునే. 20 ఏళ్ల క్రితం నేను గీతా ఆర్ట్స్‌ నుంచి వెళ్లిపోవాల్సిన సంఘటన ఎదురైంది. ఆరోజు బన్నీ నాకు సపోర్ట్‌ చేయడం కోసం వాళ్ల నాన్నను కూడా ఎదిరించారు. అప్పుడు ఆయన సపోర్ట్‌ చేయకపోతే ఈ రోజు నేను ఈ స్థానంలో ఉండేవాడిని కాదు. తన స్నేహితుల్లో ఎవరికి అవసరం వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా బన్నీ సపోర్ట్‌ చేస్తాడు. మంచి వ్యక్తి‘ అంటూ తమ స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. ’సినిమాలకు సంబంధించిన విషయాలను సినిమా వరకు మాత్రమే ఆలోచించగల హీరో ఎన్టీఆర్‌. ‘ఆయ్‌’ ట్రైలర్‌ను పిఠాపురంలో చేయాలని నాకు అనిపించినప్పుడు ఎన్టీఆర్‌కు ఈ సమాచారాన్ని అందించాం. నిర్మాతకు ఉపయోగ పడుతుందంటే మిగతా విషయాలేవీ పట్టించుకోవద్దు అని చెప్పారు. ఈ విషయంలో ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. నేను మొదటి నుంచి పవన్‌ కల్యాణ్‌ అభిమానిని. ఈరోజు ఆయనతో పాటు పొలిటికల్‌ జర్నీలో ఉంటున్నానంటే నా అదృష్టమని చెప్పాలి’ అంటూ బన్నీ వాసు భావోద్వేగానికి గురయ్యారు.

Related posts

Leave a Comment