‘బర్ఫీ’లో శ్రుతి ఘోష్ పాత్రని దక్షిణాది ప్రేక్షకులు ఎలా తీసుకునేవారో తెలియదుగానీ..బాలీవుడ్లో మాత్రం ‘బహు బాగా నటించావు’ అని ప్రశంసించారు.. అని చెప్పింది ఇలియానా తన బాలీవుడ్ ఎంట్రీ చిత్రం గురించి చెబుతూ. ‘‘దక్షిణాదిలో సుపరిచితం అయినప్పటికీ, బర్ఫీ చేస్తున్నప్పుడు మాత్రం ఇక్కడి ప్రేక్షకులకు కొత్త నటినే. అది ప్లస్ అయింది. నాకైతే ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించింది. ప్రయోగాలు చేయడానికి ఒక వేదిక దొరికినట్లయింది. ప్రేక్షకులకు నా పాత్ర ఎంతగానో నచ్చింది. ఇది నేను ఊహించనిది. నేను ఎప్పుడూ కంఫర్ట్జోన్ను ఇష్టపడను. అది దాటి బయటికి వచ్చినప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేయడానికి అవకాశం దొరుకుతుంది’’ అంటోంది ఇలియానా .మాంచి మాస్ మసాలా సినిమా ద్వారా బాలీవుడ్లోకి ఎంట్రీ కావాలనుకుంది ఇలియానా. అయితే ‘బర్ఫీ’ మసాలా సినిమా కాదు. ‘‘స్టోరీ విన్నప్పుడు నిర్ణయం తీసుకోవడానికి మూడు నెలలు తీసుకున్నాను. ఇలాంటి సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ అయితే ఎలా ఉంటుంది? అని ఆలోచించాను. నా కోరిక ఎలా ఉన్నప్పటికీ ‘బర్ఫీ’లాంటి కథ మళ్లీ చేసే అవకాశం దొరుకుతుందో లేదో అని చేశాను. ఈ సినిమాతో బాలీవుడ్లోకి అడుగు పెట్టడం అదృష్టంగా భావిస్తాను. అయితే నేను ఊహించనిది జరిగింది అని చెబుతోంది ఇలియానా.
నేను ఊహించనిది జరిగింది : ఇలియానా
![iliyana uhinchanidhi jarigindhi](https://tollywoodtimes.in/wp-content/uploads/2021/06/ileana-dcruz-1.jpg)