సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ డిమాండ్
ప్రజల పట్ల బాధ్యత లేకుండా,ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, వారంలో రెండు,మూడు, సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం,ప్రజలపై ఆర్ధిక భారాలను మోపడం,ప్రజలకు జవాబుదారీగా ఉండకుండా,కార్పోరేట్ సంస్థలకు అనుకూలంగా దోపిడీ పాలనను అనుసరిస్తున్న మోడీ తక్షణమే గద్దె దిగాలని సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్, సీపీఐ (ఎం)ఆలేరు పట్టణ కమిటీ కార్యదర్శి ఎం.ఎ.ఇగ్బాల్ డిమాండ్ చేశారు. గురువారం నాడు ఆలేరు పెట్రోల్ బంక్ ముందు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ,సీపీఐ, సీపీఐ (ఎం)పార్టీల ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను ఉపసంహరించుకోవాలని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. పై పార్టీల రాష్ట్ర కమిటీల పిలుపు లో భాగంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా జనార్ధన్,వెంకటేష్,ఇగ్నాల్ లు మాట్లాడుతూ,మోడీ ప్రభుత్వం నేల విడిచి సాము చేసినట్లుగా,ప్రజలను విడిచి పాలన సాగిస్తున్నారని,కార్పోరేట్ సంస్థలకు పెద్ద పీట వేస్తూ,ప్రజలను అనేక ఆర్ధిక, మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని విమర్శించారు. జూన్ 26 నాడు దేశ వ్యాపితంగా జరిగే కలెక్టర్ కార్యాలయం ల ముందు ధర్నాలు, రాజ్ భవన్,రాష్ట్ర పతిలకు,రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ మెమొరాండం లు ఇవ్వాలని AIKSCC జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపును పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో AIKMS జిల్లా ప్రధాన కార్యదర్శి డొంకెన శ్రీహరి,రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొల్లూరి రాజయ్య, సీపీఐ (ఎం) మండల కార్యదర్శి ఎం.చంద్రశేఖర్, IFTU జిల్లా నాయకుడు ఇక్కిరి కుమార్,గొట్టిపాటి శ్రీనివాస రాజు,ఎం.మల్లేష్, పాకాల నరేష్ గుజ్జపాండు తదితరులు పాల్గొన్నారు