జర్నలిస్ట్ అంటే చాలా పవర్ ఫుల్ రోల్. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో చాలా రిస్క్ వుంటుంది. దానికి గట్స్ కావాలి. ‘దూత’లో అలాంటి గట్సీ పాత్రలో నాగచైతన్య కనిపిస్తారు. : డైరెక్టర్ విక్రమ్ కె కుమార్

A journalist is a very powerful role. Investigative journalism involves a lot of risk. It needs guts. Naga Chaitanya will be seen in such a gutsy role in 'Doota'. : Director Vikram K Kumar
Spread the love

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ‘దూత’ వెబ్ సిరిస్ తో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమయ్యారు. ‘దూత’ నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరిస్ కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది. సూపర్ నాచురుల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సిరిస్ కి క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. ప్రియా భవానీ శంకర్‌, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మాత శరత్ మరార్ ఈ వెబ్ సిరీస్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ‘దూత’ ప్రమోషనల్ కంటెంట్ చాలా క్యూరియాసిటీని పెంచింది. డిసెంబర్ 1 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ సిరీస్ ప్రసారం కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు విక్రమ్ కె కుమార్ ‘దూత’ వెబ్ సిరీస్ విశేషాలు విలేకరులతో పంచుకున్నారు.

మీ నుంచి ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే ప్రేక్షకులు ఖచ్చితంగా యునిక్ కాన్సెప్ట్స్, కొత్తదనం ఆశిస్తారు.. ‘దూత’తో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచబోతున్నారు?
-13బి తర్వాత నేను సూపర్ నాచురల్ జోనర్ లో సినిమాలు చేయలేదు. నిజంగా ఆ జానర్ ని మిస్ అయ్యాను. వెబ్ నుంచి ఇలాంటి అవకాశం ఇచ్చిన నేపధ్యంలో లాంగర్ ఫార్మెట్ లో ఇలాంటి జానర్ ని చేయాలని అనుకున్నాను. దూత ఆలోచన ఎప్పటినుంచో వుంది. నాగ చైతన్య గారికి చెప్పాను. ఆయనకి చాలా నచ్చంది. తర్వాత స్క్రీన్ ప్లే చేశాను. ఇదొక సూపర్ నాచురల్ థ్రిల్లర్. చాలా మలుపులు వుంటాయి. లాంగర్ ఫార్మెట్ లో ప్రతి ఎపిసోడ్ కి ఒక మలుపు వుండాలి. కథతో పాటు ప్రేక్షకుడిని చివరి వరకూ తీసుకెళ్ళాలి. ఇది పెద్ద సవాల్. రైటింగ్ ప్రాసెస్ ని చాలా ఎంజాయ్ చేశాను. ఈ షో పై ప్రేక్షకుల స్పందన తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

‘దూత’ నేపథ్యం ఏమిటి?
దూత అంటే మెసేంజర్. ఒక సంఘటనని ప్రజల వద్దకు చేరవేసే జర్నలిస్ట్ కూడా దూతనే. ఇది ఒక జర్నలిస్ట్ నేపధ్యంలో జరుగుతుంది.

దూత ఆలోచనని వెబ్ సిరిస్ కోసమే అనుకున్నారా?
దూత ఆలోచన ఎప్పటినుంచో వుంది. ఆ ఆలోచనని స్క్రీన్ ప్లే గా రాసుకున్నప్పుడు మాత్రం వెబ్ సిరిస్ ని ద్రుష్టిలో పెట్టుకునే రాశాను. కొన్ని ఆలోచనలు రెండు గంటలకే సరిపోతాయి. ఇంకొన్ని ఆలోచనని చాలా విస్తృతంగా చూపించవచ్చు. దూత ఆలోచనకు ఎనిమిది ఎపిసోడ్లని హోల్డ్ చేసే బలం వుంది.

వెబ్ సిరిస్ చేయడం ఎలా అనిపించింది ?
ఓటీటీకి ఓ గొప్ప సౌలభ్యం వుంది. ఇప్పుడు విడుదలౌతున్న దూత దాదాపు 240 దేశాల్లో ప్రసారం కానుంది. ప్రపంచంలో నలుమూల ప్రేక్షకులు చూస్తారు. మనం కొరియన్, ఫారిన్ షోస్ చూస్తుంటాం. మన తెలుగు షో కూడా వాళ్ళు చూడాలనే ఆసక్తి మనకి వుంటుంది. దూత సూపర్ నాచురల్ జానర్. ఇలాంటి జోనర్ ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ వున్నారు. మన షోని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయడం మంచి అనుభూతి.

నాగ చైతన్య గారికి ఈ కథ చెప్పినపుడు ఆయన రియాక్షన్ ఏమిటి ?
నేను, చైతు మంచి ఫ్రండ్స్. మూడోసారి కలసి పని చేశాం. ‘మనం’ చేసిన సమయంలోనే చైతుకి ఓ హారర్ కథ చెప్పాను. అయితే తనకి ఘోస్ట్ స్టొరీస్ అంటే భయం. ‘హారర్ కథలు వద్దురా నాకు భయం’ అన్నారు( నవ్వుతూ). ‘దూత’ కథ మాత్రం తనకి చాలా నచ్చింది. ఇది సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఫిక్షనల్ స్టొరీ.

నాగ చైతన్య గారిని డిఫరెంట్ లుక్ లో చుపిస్తున్నారు కదా.. లుక్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు ?
దూతకి ముందు ఆయన ‘థాంక్ యు ‘సినిమా చేశారు. అందులో గడ్డం వుంటుంది. అంతకుముందు చేసిన సినిమా లవ్ స్టొరీలో కూడా గడ్డంతో కనిపించారు. తను గడ్డంలో చాలా అందంగా కనిపిస్తారు. నాకు కూడా చైతుని గడ్డం లుక్ లోనే చూడటం ఇష్టం. అయితే దూతకి వచ్చేసరికి కొంచెం కొత్తగా ప్రయత్నిద్దాం అన్నారు. క్లీన్ షేవ్ లో కనిపిస్తా.. ఎలా వుంటుందో చూడు అన్నారు. అలా ఒక ఫోటో పంపించారు. క్లీన్ షేవ్, మీసంలో చాలా అద్భుతంగా కనిపించారు. అదే లుక్ ని ఫిక్స్ అయ్యాం.

జర్నలిస్టు పాత్ర నేపధ్యలో… ఫిక్షనల్ స్టొరీ.. ఇది చాలా వైవిధ్యంగా అనిపిస్తుంది కదా ?
జర్నలిస్ట్ అంటే చాల పవర్ ఫుల్ రోల్. ప్రజాస్వామ్యంలో జర్నలిజం ఒక మూలస్థంబం. అందులోనూ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో చాలా రిస్క్ వుంటుంది. ఆ వ్రుత్తిలో ఉండాలంటే చాలా గట్స్ కావాలి. అందరూ ఆ పని చేయలేరు. ఈ కథలో అలాంటి పాత్రని చాల అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. ఈ సూపర్ నాచురల్ థ్రిల్లర్ లో చాలా లేయర్లు వున్నాయి. అవి ప్రేక్షకులకు చాలా థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని ఇస్తాయి.

టాలీవుడ్ లో ‘దూత’నే బిగ్గెస్ట్ వెబ్ సిరిస్ అనుకోవచ్చు. ప్రమోషన్స్ కూడా అవే రేంజ్ లో వున్నాయి. ప్రేక్షకుల్లో అంచనాలు కూడా అవే స్థాయిలో వున్నాయి కదా.. ఎలా అనిపిస్తుంది ?
నిజానికి ఒక సినిమా విడుదలైతే శుక్రవారం మొదటి ఆటకే దాని ఫలితం తెలుస్తుంది. కానీ వెబ్ సిరిస్ ది మాత్రం ప్రత్యేకమైన పరిస్థితి. జనాలకు నచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. సినిమాతో పోల్చుకుంటే ఈ విషయంలో ఒత్తిడి కాస్త తక్కువగానే వుంది.

సూపర్ నాచురల్ థ్రిల్లర్ రాయడంలో సవాల్ గా అనిపించిందా ?
నాకు ఈ జోనర్ చాలా ఇష్టం. అయితే 13 బి తర్వాత అదే తరహా కథలకు సంప్రదించారు. అదే తరహా కథలు చేస్తే ఇవే చెయ్యగలుగుతానేమో అనే ముద్రపడిపోతుందని కొన్నేళ్ళు ఆ జోలికి వెళ్ళలేదు. ఐతే ఇన్నాళ్ళు నిజంగా ఆ జోనర్ ని మిస్ అయ్యాను. ఇప్పుడు విరూపాక్ష, మంగళవారం లాంటి సినిమాలతో మళ్ళీ అలాంటి కథలకు జోష్ వచ్చింది. నా వరకూ ఇలాంటి కథలు రాయడాన్ని చాలా ఎంజాయ్ చేస్తాను. దూత 2 దూత 3 ఆలోచనలు కూడా వున్నాయి.

దూతలో మీరు ఎక్కువగా ఎంజాయ్ చేసిన ఎపిసోడ్ ఏమిటి ?
ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ షూట్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఆ సన్నివేశాల్లో చైతు పెర్ఫార్మెన్స్ అద్భుతంగా వుంటుంది.

నాగార్జున గారు మీకు ఏమైనా సూచనలు ఇచ్చారా ?
ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే నాగార్జున గారు అభినందిస్తారు. ఈ ప్రాజెక్ట్ చేస్తున్నపుడు కలసి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ప్రియా భవానీ శంకర్‌, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్‌ పాత్రల గురించి ?
ఈ కథ రాస్తున్నప్పుడే క్రాంతి పాత్రలో పార్వతిని అనుకున్నాను. తను వెర్సటైల్ యాక్టర్. తనకి తెలుగు సినిమాకు చేయాలని వుంది. నా నేను డైరెక్ట్ చేసిన సిరిస్ తో తెలుగులో రావడం ఆనందంగా వుంది. ఇందులో తనది పోలీస్ ఆఫీసర్ పాత్ర. చాలా బ్రిలియంట్ గా వుంటుంది. అలాగే ప్రియా భవానీ శంకర్‌, ప్రాచీ దేశాయ్‌ పాత్రలు కూడా చాలా కీలకంగా వుంటాయి. అందరూ చాలా ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మ్ చేశారు.

ఈ వెబ్ సిరిస్ విడుదల చేయడంలో కొంత జాప్యం జరిగింది కదా కారణం ?
షూటింగ్ త్వరగానే పూర్తి చేశాం. అయితే చాలా హెవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిగింది. వెబ్ సిరిస్ లు విస్తృతంగా అందుబాటులో వున్నాయి. ప్రేక్షకుడిని షోలో కూర్చోబెట్టాలంటే టెక్నికల్ వర్క్ చాలా బ్రిలియంట్ గా వుండాలి. ఎనిమిది ఎపిసోడ్స్ లో యంగేజ్ చేయాలంటే ఎడిటింగ్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దాని కోసం కావాల్సిన సమయం తీసుకున్నాం. నవీన్ అద్భుతంగా ఎడిట్ చేశారు. అలాగే మ్యూజిక్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నాం. ఇక వెబ్ సిరిస్ అంటే ఓటీటీ సంస్థలకు కొన్ని ఫార్మాలిటీస్ వుంటాయి. క్యాలిటీ చెక్స్ వుంటాయి. వాటికి సహజంగానే కాస్త సమయం పడుతుంది.

దూతని గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించడం ఎలా అనిపించింది ?
చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండీ. ఒక ఎపిసోడ్ ని స్క్రీన్ చేశాం. అందరికీ చాలా నచ్చింది.

నిర్మాత శరత్ మరార్ గారు నిర్మాణంలో ఎలా సపోర్ట్ చేశారు?
నిర్మాణం పరంగా ఇది చాలా ప్యాషన్ తో కూడుకున్న సిరిస్. శరత్ మరార్ గారు లాంటి ప్యాషనేట్ నిర్మాత వలనే ఇది సాధ్యమైయింది. మూడు సినిమాల నిడివి వున్న కంటెంట్ ఇది. దాదాపు సన్నివేశాలన్నీ వర్షంలోనే చిత్రీకరీంచాం. నా గత సినిమాల్లో రెండు మూడు రోజుల మాత్రమే రెయిన్ ని వాడేవాడని. ఇందులో వందరోజుల వాడాను. శరత్ మరార్ గారు లాంటి ప్రొడక్షన్ హౌస్ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు.

మీకు ఇష్టమైన వెబ్ సిరిస్ లు ?
ఫ్యామిలీ మ్యాన్, పాతాళ్ లోక్, స్కాం, జూబ్లీ ఇలా చాలా షోస్ ఇష్టం

మీది కేరళ కదా.. మలయాళం సినిమా ఎప్పుడు చేస్తారు ?
మా బంధువులు కూడా అదే అడుగుతున్నారు. ఒక మలయాళీ సినిమా చేయొచ్చుకదా అంటారు. (నవ్వుతూ) నాకూ చేయాలనే వుంది. అయితే ఇప్పటివరకూ అలాంటి కథ రాయలేదు. భవిష్యత్ లో అలాంటి కథ కుదురుతుందేమో చూడాలి.
ఆల్ ది బెస్ట్
థాంక్స్

Related posts

Leave a Comment