తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో గద్దర్ సంస్కరణ సభ
తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ప్రముఖ గాయకుడు రచయిత గద్దర్ సంస్కరణ సభను రంగారెడ్డిపై జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీలో ఎల్ఐజి లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ‘జై బోలో తెలంగాణ’ సినిమా డైరెక్టర్ శంకర్, పరుచూరి గోపాలకృష్ణ, ఎమ్మెల్యే క్రాంతి, గాయకురాలు మధుప్రియ, జయరాజ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంస్కరణ సభ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సంస్కృతిక శాఖ చైర్మన్ రసమయి బాలకిషన్, తెలుగుఫిల్మ్ ఇండస్ట్రీస్ పెద్దలు నటీనటులు హాజరై గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్బంగా గద్దర్ తెలంగాణను ఉద్దేశించి పాడినటువంటి పాటలను గుర్తు చేస్తూ కళాకారులు ఆడి పాడారు.
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కార్యక్రమాల చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. గద్దర్ అన్న మరణం తెలుగు ఫిలిం ఇండస్ట్రీస్ అలాగే ప్రజా గాయకులకు తీరని లోటు అన్నారు. గద్దర్ అన్నతో చాలా సన్నిహితం ఉండేదని గద్దర్ అన్న ఆసుపత్రిలో చేరి శస్త్ర చికిత్స చేయించుకుని మనలో ఒక్కడిగా ఉండిపోతాడని భావించామనీ కానీ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతాడని ఊహించలేదన్నారు.