సిపిఎం ఆధ్వర్యంలో ఆలేరులో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
ఆలేరు-టాలీవుడ్ టైమ్స్
ప్రజల నిత్యజీవిత అవసరాలపై విపరీత ప్రభావం చూపుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆలేరు బస్టాండ్ వద్ద సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు సిపిఎం పట్టణ కార్యదర్శి ఎంఏ ఇక్బాల్ లు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర తగ్గినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచడం వల్ల ధరలను తగ్గకుండా చేసి పేద ప్రజల పై మోయలేని భారం వేస్తున్నారని ఈరోజు దేశవ్యాప్తంగాపెట్రోల్ ధర వంద రూపాయలు దాటిందని అదేవిధంగా డీజిల్ 95 రూపాయలు దాటి సెంచరీకి చేరువలో ఉందని దీని వల్ల నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అందుకొని పేద మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపి ప్రజలు ఆర్థికంగా మోయలేని భారం పడుతుందని అన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం కలిగించే విధంగా ఉన్నాయని అన్నారు
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను విద్యుత్ సంస్కరణల చట్టాలను ఉపసంహరించుకోవాలని ఢిల్లీలో జరుగుతున్న రైతన్న ఉద్యమాన్ని నీరు కార్చడం కోసం అనేక కుటిల ప్రయత్నాలు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ప్రజల తిరస్కరణకు గురికాక తప్పదని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మోడీగారి రమేష్ వడ్డెమాను శ్రీనివాసులు జూకంటి పౌలు ఘన గానిi మల్లేష్ బుగ్గ నవీన్ చెన్న రాజేష్ భువనగిరి గణేష్ కాసుల నరేష్ , మా దాని నవీన్ ఎలుగల శివ మోరీగాడి లక్ష్మణ్ చెక్క పరశురాములు మోరిగాడి అంజయ్య, ఘనగాని రాజు భోగం రమేష్ కూరెళ్ల రవి కళ్యాణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు