మేనేజర్ తో విబేధాలు లేవు, ఇకపై విడిగా కెరీర్ సాగిస్తాం : హీరోయిన్ రష్మిక మందన్న

Rashmika Mandanna, manager clarify on rumors .
Spread the love

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన మేనేజర్ తో ఇక కలిసి పనిచేయడం లేదనే విషయంపై మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. మేనేజర్ తో విబేధాల కారణంగానే రష్మిక ఆయనతో వర్క్ చేయడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూమర్స్ పై స్పందించింది రష్మిక. తాము విడిగా పని చేయాలని నిర్ణయించుకోవడం వెనక ఎలాంటి గొడవలు లేవని తెలిపింది. ఆరోగ్యకర వాతావరణంలో కలిసి పనిచేశాం. పరస్పర ఒప్పందంతో విడిగా కెరీర్ లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. ప్రొఫెషనల్ గా ఉండే వాళ్లం కాబట్టి అలాగే కలిసి వర్క్ చేశాం. ఇప్పుడు అంతే హుందాగా విడిగా పని చేయాలని అనుకుంటున్నాం అని రష్మిక, ఆమె మేనేజర్ తాజా ప్రకటనలో తెలిపారు.

Related posts

Leave a Comment