‘అన్ స్టాపబుల్’కి ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చిన తీర్పు.. రియల్ బ్లాక్ బస్టర్ : సక్సెస్ మీట్ లో చిత్ర యూనిట్

'అన్ స్టాపబుల్'కి ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చిన తీర్పు.. రియల్ బ్లాక్ బస్టర్ : 'అన్ స్టాపబుల్' సక్సెస్ మీట్ లో చిత్ర యూనిట్
Spread the love

బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘అన్ స్టాపబుల్’. నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రాన్ని ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మాత రజిత్ రావు గ్రాండ్ గా నిర్మించారు. జూన్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి రియల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది.

సక్సెస్ మీట్ లో హీరో సన్నీ మాట్లాడుతూ.. ‘అన్ స్టాపబుల్’ చూసిన ప్రేక్షకులందరూ సినిమా బాగుంది, చాలా ఎంజాయ్ చేశామని చెప్పడం ఆనందంగా వుంది. సినిమాని ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. కొన్ని రివ్యూలలో భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి. ఐతే ఎవరి అభిప్రాయం వారిది. కానీ సినిమా చూసిన ప్రతి ఒక్కరు బావుందని చెబుతున్నారు. అందుకే ప్రేక్షకులని ఒకటే కోరుతున్నాను. మీకు సినిమా చూడాలనిపిస్తే దయచేసి చూడండి. చూసిన ప్రతి ఒక్కరు నచ్చిందని చెబుతున్నారు. ఒక సినిమా తీసి దానిని థియేటర్ లో విడుదల చేయడం అంత తేలికైన విషయం కాదు. నిర్మాత రజిత్ రావు గారు సినిమాపై ప్యాషన్ తో ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమా చేశారు. ‘అన్ స్టాపబుల్’ మంచి సినిమా.. ప్రేక్షకులు ఆదరించాలి’ అని కోరారు

దర్శకుడు డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ..
‘అన్ స్టాపబుల్’ ని మంచి సినిమా అని ప్రేక్షకులు మెచ్చుకోవడం ఆనందంగా వుంది. హాయిగా నవ్వించాలానే ఉద్దేశంతో ఈ సినిమా చేశాను. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. ఇప్పుడు సినిమా చూసిన ప్రేక్షకులు చాలా బాగుంది హాయిగా నవ్వుకున్నా. ఇలాంటి సినిమాలు కావాలని సెకనుకో కాల్ చేస్తున్నారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ అద్భుతంగా వుంది. పబ్లిక్ టాక్ అద్భుతంగా వుంది. ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చిన తీర్పు రియల్ బ్లాక్ బస్టర్. ఇకపై అన్నీ నవ్వించే సినిమాలే చేస్తాను. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నిర్మాత రజిత్ రావు గారు నా దర్శకత్వంలో మళ్ళీ సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. నాపై ఇంత నమ్మకం పెట్టిన ఆయనకి కృతజ్ఞతలు. ఈ సినిమా మీ అందరికీ నచ్చి తీరుతుంది. ప్రేక్షకుల ఇచ్చిన రెస్పాన్స్ ని మీడియా ముందుకు తీసుకువెళ్లాలని కోరుతున్నాను.

అక్సాఖాన్ మాట్లాడుతూ..
ప్రేక్షకులని హాయిగా నవ్వించాలనే ఉద్దేశం ‘అన్ స్టాపబుల్’ చేశాం. సినిమా చూస్తున్న ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీ ప్రేమ, ఆదరణ ఇంకా కావాలి’’ అని కోరారు.

నిర్మాత రజిత్ రావు మాట్లాడుతూ.. ముందుగా బాలయ్య బాబు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ‘అన్ స్టాపబుల్’ అని ఆయన టైటిల్ తీసుకున్నాం. బాలయ్య బాబు ఏది పట్టుకున్న బంగారం అవుతుంది. మా ప్రొడక్షన్ లో తొలి సినిమాకి ఆయన టైటిల్ ఉండటం ఆనందంగా వుంది. ‘అన్ స్టాపబుల్’ రియల్ బ్లాక్ బస్టర్. ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారు. డైమండ్ రత్నబాబు గారు ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చారు. ప్రేక్షకుల నుంచి ఎక్స్టార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు అందించాలానే ఉద్దేశంతో నిర్మాతగా మారాను. ఎక్కడ కూడా లాభం గురించి ఆలోచించలేదు. కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలని అనుకున్నాను. సినిమా చాలా బాగుంది. మీడియా ఎంతగానో సపోర్ట్ చేసింది. ఐతే కొంతమంది రివ్యూ రైటర్స్ కి ఒక విన్నపం. మీ సూచనలు, సలహాలు ఇవ్వండి. ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో చెప్పండి. ఒక కొత్త నిర్మాతగా ఎక్కడా రాజీపడకుండా ఇంత పెద్ద స్టార్ కాస్ట్ తో సినిమా చేశాను. దాని గురించి ప్రస్తావించిఉంటే బాగుండేది. దయచేసిన సినిమాలో ఉండే కంటెంట్ చెప్పండి. ఇది నా తొలి సినిమా. కొత్త నిర్మాతకు సలహాలు సూచనలు ఇవ్వండి. అవి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటారు. ‘అన్ స్టాపబుల్’ ని రియల్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ‘అన్ స్టాపబుల్’2ని మళ్ళీ డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో చేస్తున్నాం’’ అన్నారు.

Related posts

Leave a Comment