దర్శకుడు విరించి వర్మ నూతన చిత్రం షూటింగ్ ప్రారంభం

Director Virinchi Varma's new film commences its shoot
Spread the love

‘ఉయ్యాల జంపాల’, ‘మజ్ను’ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ నూతన నటీనటులతో ఒక సినిమాను ప్రారంభించారు. ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతుంది. 1980 లో జరిగే ఒక పిరియడిక్ కథగా రూపొందుతున్న ఈ సినిమా తెలంగాణా నేపథ్యంలో రియల్ ఇంసిడెన్స్ ను బేస్ చేసుకొని నడిచే కథగా ఈ చిత్రం ఉండబోతోంది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ వి.ఎస్.జ్ఞానశేఖర్ ఈ సినిమాకు కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు. అలాగే గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. నాగేంద్ర కుమార్ ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. డైరెక్టర్ విరించి వర్మ తన గత రెండు చిత్రాలతో లవ్ స్టోరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సారి పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా తో నూతన చిత్రాన్ని తీస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆర్టిస్టుల వివరాలు అలాగే టైటిల్, ఫస్ట్ లుక్ త్వరలోనే మీడియాకు తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.

Related posts

Leave a Comment