సుధీర్ బాబు ‘మామా మశ్చీంద్ర’ ఫస్ట్ సింగిల్ గాలుల్లోన మే 4న విడుదల

Nitro Star Sudheer Babu, Harshavardhan, Sree Venkateswara Cinemas Mama Mascheendra First Single Gaalullona Lyrical On May 4th
Spread the love

నైట్రో స్టార్ సుధీర్ బాబు క్రేజీ ప్రాజెక్ట్ ‘మామా మశ్చీంద్ర’ లో త్రిపాత్రాభినయం లో కనిపించనున్నారు. యాక్టర్ -ఫిల్మ్ మేకర్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. ఇటివలే విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌పై అప్‌డేట్‌తో వచ్చారు. మొదటి సింగిల్ గాలుల్లోన లిరికల్ వీడియో మే 4న విడుదల కానుంది. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో సుధీర్ బాబు దుర్గా, డిజే గెటప్స్ లో కనిపించారు. మిర్నాలిని రవి డిజే వైపు చూస్తూ ఉండగా, ఈషా రెబ్బా చేతిలో బర్గర్ పట్టుకున్న దుర్గా తో సెల్ఫీ తీసుకుంటుంది.
పి జి విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్‌ సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు.
తారాగణం: సుధీర్ బాబు, మిర్నాలిని రవి, ఈషా రెబ్బా, హర్షవర్ధన్, సాంకేతిక విభాగం: రచన, దర్శకత్వం: హర్షవర్ధన్, నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, సమర్పణ: సోనాలి నారంగ్, సృష్టి (సృష్టి సెల్యులాయిడ్), బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సంగీతం: చైతన్ భరద్వాజ్, డీవోపీ: పీజీ విందా, ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్, పీఆర్వో: వంశీ-శేఖర్

Related posts

Leave a Comment