టాలీవుడ్ టైమ్స్ ప్రతినిధి – ఆలేరు
తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఆదేశాల మేరకు ఆలేరు పట్టణంలో ఆలేరు యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి.సంపత్ ఆధ్వర్యంలో పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేసిన అనంతరం తహసీల్దార్‌కి వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలేరు యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు జూకంటి.సంపత్ మాట్లాడుతూ లీటర్ పెట్రోలు వంద రూపాయలు దాటి సామాన్య ప్రజలకు పెనుభారంగా మారింది. పెట్రోల్ డీజిల్ కాక, నిత్యవసర వస్తువులు నూనె వంట గ్యాస్ సామాన్య ప్రజలపై భారం పడుతుంది. కరోన మహమ్మారి ప్రజల ప్రాణాలను తీస్తుంటే మన కేంద్ర ప్రభుత్వం మాత్రం సామాన్యుల పై అధిక ధరలు వేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటుంది కరోన కాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రజలను దోచుకుంటున్నది. వెంటనే డిజీల్ పెట్రోల్ మరియు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తామని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు పర్రే.రమేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కలకుంట్ల. లోకేష్,మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఊటుకూరు సురేష్ దడిగే, అనిల్, చిన్నం, రాజు, అంగిడి ఆంజనేయులు ,సుంకరి విక్రమ్, కాసుల భాస్కర్ వెల్ల నవీన్ ,అందే అఖిల్ తదితరులు పాల్గొన్నారు.